news18-telugu
Updated: November 23, 2020, 6:19 PM IST
IRCTC Tour: భక్తులకు గమనిక... నవగ్రహ ఆలయాల టూర్ ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్సీటీసీ
(ప్రతీకాత్మక చిత్రం)
ఆధ్యాత్మిక పర్యటనలకు వెళ్లాలనుకునే భక్తులకు శుభవార్త. ఐఆర్సీటీసీ నవగ్రహ టెంపుల్స్ పేరుతో ప్రత్యేక టూర్ ప్యాకేజీ ప్రకటించింది. ఈ టూర్ ప్యాకేజీ బుక్ చేసినవారిని తమిళనాడులోని నవగ్రహ ఆలయాలకు తీసుకెళ్లనుంది. కుంబకోణం, కరైకల్ ప్రాంతాల్లోని ఈ ఆలయాల్లో ప్రతీ ఆలయం నవగ్రహాల్లోని ఓ గ్రహానికి సంబంధించినది కావడం విశేషం. ఈ టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.7,550. ఇది ట్రిపుల్ షేరింగ్ ధర. ట్విన్ షేరింగ్ ప్యాకేజీకి రూ.10,710 చెల్లించాలి. రెండు రాత్రులు, మూడు రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను https://www.irctctourism.com/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్సైట్లో ప్యాకేజీ బుక్ చేసుకోవాలి. ప్యాకేజీలో రెండు రాత్రులు కుంబకోణంలో బస, ఏసీ ప్రైవేట్ వాహనంలో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.
IRCTC Kerala Tour: కేరళ టూర్ ప్యాకేజీ రూ.7,425 మాత్రమే... హౌజ్ బోట్లో బస చేయొచ్చుIRCTC Kerala Tour: కేరళ టూర్ వెళ్తారా? ఐఆర్సీటీసీ ప్యాకేజీ రూ.5,585 మాత్రమే
IRCTC Navagraham temples tour: ఐఆర్సీటీసీ నవగ్రహం టెంపుల్స్ టూర్ ప్యాకేజీ వివరాలు ఇవే...
ఐఆర్సీటీసీ నవగ్రహం టెంపుల్స్ టూర్ తిరుచ్చిలో మొదలవుతుంది. కాబట్టి ఈ ప్యాకేజీ బుక్ చేసే పర్యాటకులు మొదటి రోజు ఉదయానికి తిరుచ్చి చేరుకోవాలి. తిరుచ్చిలో పర్యాటకుల్ని పికప్ చేసుకున్న తర్వాత కుంబకోణం తీసుకెళ్తారు. హోటల్లో ఫ్రెషప్ అయిన తర్వాత తింగలూరులో చంద్ర ఆలయం, సూర్యనార్కోయిల్లో సూర్య ఆలయం, కంచనూర్లో శుక్ర ఆలయం తీసుకెళ్తారు. మధ్యాహ్నం భోజనం తర్వాత తిరుమల్లార్లో శనీశ్వర ఆలయం, తిరునగేశ్వరంలో రఘు ఆలయం, అలన్గుడిలో గురు ఆలయం తీసుకెళ్తారు. రాత్రికి కుంబకోణంలో బస చేయాలి.
IRCTC: తెలుగు రాష్ట్ర నుంచి దక్షిణ భారతదేశ యాత్ర... ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలివే
IRCTC Ooty Tour: ఆరు వేలకే ఊటీ హాలిడే ట్రిప్... ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలివే
ఇక రెండో రోజు ఉదయం తిరువెన్కడులో బుధ ఆలయం, కీరప్పెరుంపల్లంలో కేతు ఆలయం, వైదీశ్వరన్కోయిల్లో మంగళ ఆలయం చూడొచ్చు. మధ్యాహ్నం భోజనం తర్వాత నల్లూరులో కళ్యాణ సుందరీశ్వరర్ ఆలయానికి తీసుకెళ్తారు. రాత్రికి కుంబకోణంలో బస చేయాలి. మూడో రోజు ఉదయం కాశీ విశ్వనాథ ఆలయం, ఆది కుంభేశ్వర ఆలయం, సారంగపాణి ఆలయాలు తీసుకెళ్తారు. ఆ తర్వాత తిరుచ్చి తిరిగి రావడంతో టూర్ ముగుస్తుంది.
Published by:
Santhosh Kumar S
First published:
November 23, 2020, 6:19 PM IST