కరోనా లాక్డౌన్ కారణంగా టూర్లకు కాదు కదా ఇంట్లోంచి బయటకు అడుగుపెట్టే పరిస్థితి కూడా లేదు. కాస్త ఇప్పుడిప్పుడే జనాలు షికార్లకు వెళ్తున్నారు. టూర్స్ ప్లాన్ చేస్తున్నారు. కేరళ వెళ్లాలనుకునే విశాఖపట్నం వాసులకు అద్భుతమైన టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్సీటీసీ టూరిజం. 'మేజిస్టిక్ కేరళ విత్ శ్రీ పద్మనాభస్వామి' పేరుతో ఈ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ టూర్లో కొచ్చిన్, మున్నార్, అలెప్పీ, కోవలం, త్రివేండ్రం లాంటి ప్రాంతాలను కవర్ చేయొచ్చు. ఐదు రాత్రులు, ఆరు రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఈ టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.25870. ఇది ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర. డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.26960 కాగా, సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ.35860. ఈ టూర్ 2021 ఫిబ్రవరి 25న విశాఖపట్నంలో మొదలవుతుంది.
Day 1: ఐఆర్సీటీసీ 'మేజిస్టిక్ కేరళ విత్ శ్రీ పద్మనాభస్వామి' టూర్ 2021 ఫిబ్రవరి 25న విశాఖపట్నంలో ప్రారంభం అవుతుంది. ఉదయం 07:15 విశాఖపట్నంలో బయల్దేరితే ఉదయం 08:30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఉదయం 10:30 గంటలకు బయల్దేరితే మధ్యాహ్నం 12:20 గంటలకు కొచ్చిన్ చేరుకుంటారు. సాయంత్రం మెరైన్ డ్రైవ్, లులు మాల్ సందర్శించొచ్చు. రాత్రికి కొచ్చిన్లోనే బస చేయాలి.
Day 2: ఫిబ్రవరి 26న కొచ్చిన్, ఎర్నాకులం హాఫ్ డే టూర్ ఉంటుంది. డచ్ ప్యాలెస్, సెయింట్ ఫ్రాన్సిస్ చర్చ్, సాంటా క్రూజ్ బసిలికా చూడొచ్చు. మధ్యాహ్నం తర్వాత మున్నార్ తీసుకెళ్తారు. సాయంత్రం మున్నార్‌లో విహరించొచ్చు. రాత్రికి మున్నార్‌లోనే బస చేయాలి.
Day 3: ఫిబ్రవరి 27న బ్రేక్‌ఫాస్ట్ తర్వాత లోకల్ సైట్ సీయింగ్ ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత రజమలలో ఎరవికులం నేషనల్ పార్క్ సందర్శించొచ్చు. మధ్యాహ్నం తర్వాత మట్టుపెట్టి డ్యామ్, ఇకో పాయింట్, రోజ్ గార్డెన్, టీ మ్యూజియం సందర్శించొచ్చు. రాత్రికి మున్నార్ తిరిగి చేరుకోవాలి. రాత్రి మున్నార్‌లోనే బస చేయాలి.
Day 4: ఫిబ్రవరి 28న మున్నార్ నుంచి అలెప్పీ తీసుకెళ్తారు. రాత్రికి అక్కడే బోటులో సొంత ఖర్చులతో బస చేయాలి.
Day 5: మార్చి 1న అలెప్పీ నుంచి త్రివేండ్రం బయల్దేరాలి. పద్మనాభస్వామి ఆలయం, కోవాలం బీచ్ సందర్శించాలి. రాత్రికి త్రివేండ్రంలో బస చేయాలి.
Day 6: మార్చి 2న త్రివేండ్రం నుంచి తిరుగు ప్రయాణం మొదలవుతుంది. ఉదయం 09:35 గంటలకు త్రివేండ్రం ఎయిర్‌పోర్టులో ఫ్లైట్ ఎక్కితే ఉదయం 11:15 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. మధ్యాహ్నం 12:40 హైదరాబాద్‌లో ఫ్లైట్ ఎక్కితే మధ్యాహ్నం 01:50 గంటలకు విశాఖపట్నం చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
టూర్ ప్యాకేజీలో ఎకనమీ క్లాస్ ఇండిగో ఎయిర్‌లైన్స్ టికెట్స్, కొచ్చిన్‌లో ఒక రాత్రి, మున్నార్‌లో రెండు రాత్రులు, అలెప్పీలో ఒక రాత్రి, త్రివేండ్రంలో ఒకరాత్రి బస, ప్రైవేట్ వాహనంలో సైట్ సీయింగ్, 5 బ్రేక్‌ఫాస్ట్, 5 డిన్నర్ కవర్ అవుతాయి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.