IRCTC Tour: మేఘాలలో తేలుతూ మేఘాలయాకు హనీమూన్ టూర్... విశాఖపట్నం నుంచి ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ

IRCTC Tour: మేఘాలలో తేలుతూ మేఘాలయాకు హనీమూన్ టూర్... విశాఖపట్నం నుంచి ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ (ప్రతీకాత్మక చిత్రం)

IRCTC Magical Meghalaya Tour | హనీమూన్ ప్లాన్ చేసుకునేవారికి, ఫ్యామిలీ టూర్ వెళ్లాలనుకునేవారికి గుడ్ న్యూస్. ఐఆర్‌సీటీసీ విశాఖపట్నం నుంచి మేఘాలయకు టూర్ ప్యాకేజీ ప్రకటించింది.

  • Share this:
    సమ్మర్‌లో టూర్ వెళ్లాలనుకునేవారికి గుడ్ న్యూస్. ఐఆర్‌సీటీసీ టూరిజం వరుసగా టూర్ ప్యాకేజీలను ప్రకటిస్తోంది. హైదరాబాద్‌తో పాటు విశాఖపట్నం నుంచి పలు ప్యాకేజీలను అందిస్తోంది. లేటెస్ట్‌గా విశాఖపట్నం నుంచి మేఘాలయాకు హనీమూన్ టూర్ ప్యాకేజీ ప్రకటించింది. మ్యాజికల్ మేఘాలయ పేరుతో ఈ టూర్ ప్యాకేజీ అందిస్తోంది ఐఆర్‌సీటీసీ. ఈ ప్యాకేజీ బుక్ చేసిన పర్యాటకులు మేఘాలయాతో పాటు అస్సాంలోని ప్రకృతి అందాలను వీక్షించొచ్చు. ఈ ప్యాకేజీలో గువాహతి, షిల్లాంగ్, చిరపుంజ్, మావ్లిన్‌నాంగ్, కాజీరంగా లాంటి ప్రాంతాలు కవర్ అవుతాయి. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. హనీమూన్ వెళ్లాలనుకునే కపుల్స్‌కి లేదా ఫ్యామిలీ టూర్ వెళ్లాలనుకునేవారికి ఇది సూట్ అయ్యే ప్యాకేజీ.

    ఐఆర్‌సీటీసీ టూరిజం మ్యాజికల్ మేఘాలయ టూర్ 2021 ఏప్రిల్ 24న మొదలవుతుంది. ఈ ప్యాకేజీ ప్రారంభ ధర ఒకరికి రూ.28,059. ఇది ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర. ఇక డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.30,099 కాగా, సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ.36,199. ఈ టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్స్, షిల్లాంగ్, కాజీరంగా, గువాహతిలో హోటళ్లలో బస, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. ఐఆర్‌సీటీసీ టూరిజం అధికారిక వెబ్‌సైట్ https://www.irctctourism.com/ లో టూర్ ప్యాకేజీ వివరాలు తెలుసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో ప్యాకేజీ బుక్ చేయాలి.

    IRCTC Tour: విశాఖపట్నం నుంచి కాశీ, అయోధ్యకు ఐఆర్‌సీటీసీ టూర్... ప్యాకేజీ వివరాలివే

    IRCTC Shimla Tour: హనీమూన్ వెళ్లాలనుకుంటున్నారా? హైదరాబాద్ నుంచి షిమ్లాకు ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ


    IRCTC Magical Meghalaya Tour: ఐఆర్‌సీటీసీ మ్యాజికల్ మేఘాలయ టూర్ ప్యాకేజీ వివరాలివే...


    Day 1: మొదటి రోజు ఉదయం 10.15 గంటలకు విశాఖపట్నంలో ఫ్లైట్ ఎక్కితే 11.50 గంటలకు కోల్‌కతా చేరుకుంటారు. సాయంత్రం 4.20 గంటలకు కోల్‌కతాలో ఫ్లైట్ ఎక్కితే సాయంత్రం 5.30 గంటలకు గువాహతి చేరుకుంటారు. అక్కడ్నుంచి షిల్లాంగ్ బయల్దేరాలి. రాత్రికి షిల్లాంగ్‌లోనే బస చేయాలి.

    Day 2: రెండో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత చిరపుంజి బయల్దేరాలి. నోహ్‌కలికై ఫాల్స్, మావ్‌స్మాయ్ గుహలు వీక్షించొచ్చు. సాయంత్రానికి తిరిగి షిల్లాంగ్ చేరుకోవాలి. దారిలో ఎలిఫాంటా ఫాల్స్ చూడొచ్చు. రాత్రికి షిల్లాంగ్‌లోనే బస చేయాలి.

    Day 3: మూడో రోజు ఉదయం మావ్లిన్‌నాంగ్ బయల్దేరాలి. ఆసియాలోనే అత్యంత శుభ్రమైన గ్రామం అది. లివింగ్ రూట్ బ్రిడ్జ్, దావ్కీ సరస్సు చూడొచ్చు. సాయంత్రానికి షిల్లాంగ్ చేరుకోవాలి. రాత్రికి షిల్లాంగ్‌లోనే బస చేయాలి.

    IRCTC Goa Tour: గోవాకు హనీమూన్ వెళ్తారా? హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ

    IRCTC Tirupati Tour: హైదరాబాద్ నుంచి ఫ్లైట్‌లో తిరుపతి టూర్... శ్రీవారి దర్శనం కూడా

    Day 4: నాలుగో రోజు ఉదయం డాన్ బోస్కో మ్యూజియం, యూమియం సరస్సు సందర్శించాలి. ఆ తర్వాత కాజీరంగా బయల్దేరాలి. రాత్రికి కాజీరంగాలోనే బస చేయాలి.

    Day 5: ఐదో రోజు సెంట్రల్ రేంజ్‌లో జీప్ సఫారీకి తీసుకెళ్తారు. ఆ తర్వాత గువాహతి బయల్దేరాలి. బాలాజీ ఆలయాన్ని సందర్శించొచ్చు. రాత్రి గువాహతిలోనే బస చేయాలి.

    Day 6: ఆరో రోజు ఉదయం కామాఖ్య ఆలయాన్ని సందర్శించొచ్చు. అక్కడి నుంచి గువాహతి ఎయిర్‌పోర్టుకు చేరుకోవాలి. సాయంత్రం 5 గంటలకు గువాహతిలో ఫ్లైట్ ఎక్కితే సాయంత్రం 6.15 గంటలకు కోల్‌కతా చేరుకుంటారు. రాత్రి 7.50 గంటలకు గువాహతిలో ఫ్లైట్ ఎక్కితే రాత్రి 9.20 గంటలకు విశాఖపట్నం చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
    Published by:Santhosh Kumar S
    First published: