Home /News /business /

IRCTC ANNOUNCED JUST RS 50 CONVENIENCE FEE ON FLIGHT TICKET BOOKING AND FREE TRAVEL INSURANCE OF RS 50 LAKH SS

IRCTC: ఐఆర్‌సీటీసీ గుడ్ న్యూస్... వారికి రూ.50 లక్షల ఇన్స్యూరెన్స్

IRCTC: ఐఆర్‌సీటీసీ గుడ్ న్యూస్... వారికి రూ.50 లక్షల ఇన్స్యూరెన్స్
(ప్రతీకాత్మక చిత్రం)

IRCTC: ఐఆర్‌సీటీసీ గుడ్ న్యూస్... వారికి రూ.50 లక్షల ఇన్స్యూరెన్స్ (ప్రతీకాత్మక చిత్రం)

IRCTC Good News | ఐఆర్‌సీటీసీ యూజర్లకు శుభవార్త. మీరు ఐఆర్‌సీటీసీ ప్లాట్‌ఫామ్‌లో టికెట్లు బుక్ (IRCTC Ticket Booking) చేస్తుంటారా? వారికి రూ.50 లక్షల ఇన్స్యూరెన్స్ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ. పూర్తి వివరాలు తెలుసుకోండి.

    ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)... ఈ ప్లాట్‌ఫామ్ గురించి పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు రైలు టికెట్లు (Train Ticket Booking) తీసుకోవాలంటే క్యూలో నిలబడాల్సి వచ్చేది. కానీ... ఐఆర్‌సీటీసీ ఆన్‌లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభించిన తర్వాత ఇంట్లో కూర్చొనే ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకునే అవకాశం లభించింది. రైలు టికెట్లు మాత్రమే కాదు... బస్ టికెట్లు, హోటల్ బుకింగ్, టూర్ ప్యాకేజీల బుకింగ్, ఫ్లైట్ టికెట్లు (Flight Ticket Booking) ఇలా అనేక సేవల్ని అందిస్తోంది ఐఆర్‌సీటీసీ. ఇందుకోసం వేర్వేరు వెబ్‌సైట్స్, యాప్స్ ప్రారంభించింది. ఐఆర్‌సీటీసీ ప్లాట్‌ఫామ్‌లో ఫ్లైట్ టికెట్లు బుక్ చేస్తే కన్వేయెన్స్ ఫీజ్ అతి తక్కువగా ఉంటుందని ఐఆర్‌సీటీసీ ప్రకటించింది. ఎయిర్ ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో ఫ్లైట్ టికెట్లు బుక్ చేసేవారి నుంచి కేవలం రూ.50 మాత్రమే కన్వేయెన్స్ ఫీజ్ వసూలు చేస్తున్నట్టు తెలిపింది.

    ఐఆర్‌సీటీసీ ప్లాట్‌ఫామ్‌లో ఫ్లైట్ టికెట్లు బుక్ చేసేవారికి రూ.50 లక్షల విలువైన ఎయిర్ ట్రావెల్ ఇన్స్యూరెన్స్ (Air Travel Insurance) లభిస్తుందని ఐఆర్‌సీటీసీ ప్రకటించింది. కస్టమర్లు తమ ప్లాట్‌ఫామ్‌లో ఎలాంటి హిడెన్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. ఎల్‌టీసీ టికెట్ బుకింగ్ కోసం తమది ప్రభుత్వ ఆథరైజ్డ్ ఏజెన్సీ అని ప్రకటించింది. ఇక ఐఆర్‌సీటీసీ ఎస్‌బీఐ కార్డ్ ప్రీమియర్ క్రెడిట్ కార్డుతో బుక్ చేస్తే 5 శాతం వ్యాల్యూ బ్యాక్ లభిస్తుందని వివరించింది.

    LIC IPO: ఐపీఓ తర్వాత మీ ఎల్ఐసీ పాలసీకి ప్రభుత్వం గ్యారెంటీ ఉంటుందా? తెలుసుకోండి


    కస్టమర్లు ఏ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లో టికెట్స్ బుక్ చేసినా కన్వేయెన్స్ ఫీజు చెల్లించాల్సిందే. ఈ ఫీజు వేర్వేరు ప్లాట్‌ఫామ్స్‌లో వేర్వేరుగా ఉంటుంది. కస్టమర్లు జరిపే చెల్లింపుల ప్రాసెసింగ్ ఖర్చులను కవర్ చేయడానికి కన్వేయెన్స్ ఫీజు వసూలు చేస్తుంటాయి ఈ ప్లాట్‌ఫామ్స్. కొన్ని ప్లాట్‌ఫామ్స్‌లో రూ.150 వరకు కన్వేయెన్స్ ఫీజు చెల్లించాలి. ఐఆర్‌సీటీసీ మాత్రం ఫ్లైట్ టికెట్ బుకింగ్‌కు కేవలం రూ.50 కన్వేయెన్స్ ఫీజు మాత్రమే వసూలు చేస్తుండటం విశేషం.

    Business Idea: ఈ బిజినెస్‌తో ఇంత లాభం ఉంటుందా? ఇలా చేస్తే రూ.15 లక్షల ప్రాఫిట్

    గతంలో రైలు టికెట్ బుకింగ్ పైనా ఐఆర్‌సీటీసీ కన్వేయెన్స్ ఫీజు ఛార్జ్ చేసింది. నాన్ ఏసీ రైలు టికెట్లకు రూ.20 + ట్యాక్స్, ఏసీ టికెట్లకు రూ.40 + ట్యాక్స్ చొప్పున 2016 నవంబర్ 22 వరకు ఐఆర్‌సీటీసీ కన్వేయెన్స్ ఫీజు వసూలు చేసింది. కేంద్ర ప్రభుత్వం డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు పలు చర్యలు తీసుకోవడంతో భారతీయ రైల్వే కన్వేయెన్స్ ఫీజును తొలగించింది. దీంతో అప్పటి నుంచి ఐఆర్‌సీటీసీ రైలు టికెట్ల బుకింగ్‌పై కన్వేయెన్స్ ఫీజు వసూలు చేయలేదు.

    అయితే 2019 సెప్టెంబర్ 1 నుంచి నాన్ ఏసీ టికెట్లపై రూ.15 + జీఎస్‌టీ, ఏసీ టికెట్లపై రూ.30 + జీఎస్‌టీ చొప్పున వసూలు చేస్తోంది ఐఆర్‌సీటీసీ. భీమ్ లేదా యూపీఐ ద్వారా ఆన్‌లైన్ పేమెంట్స్ చేస్తే నాన్ ఏసీ టికెట్లకు రూ.15 + జీఎస్‌టీ, ఏసీ టికెట్లకు రూ.20 + జీఎస్‌టీ చొప్పున ఛార్జీలు చెల్లించాలి.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Flight tickets, IRCTC

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు