• Home
  • »
  • News
  • »
  • business
  • »
  • IRCTC ANNOUNCED HOLY AYODHYA KASHI YATRA TOUR FROM VISAKHAPATAM COVERS VARANASI PRAYAGRAJ AND AYODHYA SS

IRCTC Tour: విశాఖపట్నం నుంచి కాశీ, అయోధ్యకు ఐఆర్‌సీటీసీ టూర్... ప్యాకేజీ వివరాలివే

IRCTC Tour: విశాఖపట్నం నుంచి కాశీ, అయోధ్యకు ఐఆర్‌సీటీసీ టూర్... ప్యాకేజీ వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)

IRCTC Holy Ayodhya Kashi Yatra tour | విశాఖపట్నం నుంచి కాశీ, అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌కు టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. ప్యాకేజీ వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    కాశీకి వెళ్లాలనుకుంటున్నారా? అయోధ్యను దర్శించాలనుకుంటున్నారా? ఐఆర్‌సీటీసీ టూరిజం విశాఖపట్నం నుంచి కాశీ, అయోధ్యకు టూర్ ప్యాకేజీ ప్రకటించింది. ఇది ఆరు రోజులు, ఐదు రాత్రుల టూర్ ప్యాకేజీ. 'హోలీ అయోధ్య కాశీ యాత్ర' పేరుతో ఈ ప్యాకేజీని అందిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఈ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.26,780. ఇది ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర. ఇక డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.28,399 కాగా, సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ.35,070. టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్లు, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, వాహనంలో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.

    ఈ ప్యాకేజీ బుక్ చేసినవాళ్లు అయోధ్య, లక్నో, ప్రయాగ్‌రాజ్, వారణాసి ప్రాంతాలు సందర్శించొచ్చు. వారణాసిలో గంగానది తీరంలో సంధ్యాహారతిలో పాల్గొనొచ్చు. ప్రయాగరాజ్‌లో గంగా, యమున, సరస్వతీ నదీ సంగమంలో స్నానం చేయొచ్చు. ఇక శ్రీరాముడి జన్మస్థానం అయిన అయోధ్యను చూసిరావొచ్చు. విశాఖపట్నుం నుంచి టూర్ 2021 ఏప్రిల్ 11న ప్రారంభం అవుతుంది. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను https://www.irctctourism.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో టూర్ ప్యాకేజీ బుక్ చేయొచ్చు.

    IRCTC Shimla Tour: హనీమూన్ వెళ్లాలనుకుంటున్నారా? హైదరాబాద్ నుంచి షిమ్లాకు ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ

    IRCTC Goa Tour: గోవాకు హనీమూన్ వెళ్తారా? హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ




    IRCTC Holy Ayodhya Kashi Yatra: ఐఆర్‌సీటీసీ హోలీ అయోధ్య కాశీ యాత్ర టూర్ ప్యాకేజీ వివరాలు ఇవే...


    Day 1: మొదటి రోజు ఉదయం 8.50 గంటలకు విశాఖపట్నంలో ఫ్లైటే ఎక్కితే మధ్యాహ్నం 2.40 గంటలకు వారణాసి చేరుకుంటారు. సాయంత్రం గంగానది తీరంలో సంధ్యాహారతి కార్యక్రమంలో పాల్గొనొచ్చు. ఆ తర్వాత రాత్రి వారణాసిలోనే బస చేయాలి.

    Day 2: రెండో రోజు ఉదయం కాశీలో విశ్వనాథ ఆలయం, అన్నపూర్ణ ఆలయాలను సందర్శించాలి. మధ్యాహ్న భోజనం తర్వాత సారనాథ్ బయల్దేరాలి. ఆ తర్వాత సాయంత్రం తిరిగి వారణాసికి బయల్దేరాలి. రాత్రి వారణాసిలోనే బస చేయాలి.

    Day 3: మూడో రోజు ఉదయం ప్రయాగ్‌రాజ్ (అలాహాబాద్‌) బయల్దేరాలి. అక్కడ హోటల్‌లో చెక్ ఇన్ అయిన తర్వాత ప్రయాగ్‌రాజ్‌లో సైట్ సీయింగ్ ఉంటుంది. సంగం, అలాహాబాద్ ఫోర్ట్, పాతాల్‌పురి ఆలయం సందర్శించొచ్చు. రాత్రికి అలాహాబాద్‌లోనే బస చేయాలి.

    IRCTC Tirupati Tour: హైదరాబాద్ నుంచి ఫ్లైట్‌లో తిరుపతి టూర్... శ్రీవారి దర్శనం కూడా

    IRCTC Tour: తెలంగాణ, ఏపీ నుంచి పూరీ, కోణార్క్ టూర్... ఐదు రోజులకు రూ.5,250 మాత్రమే

    Day 4: నాలుగో రోజు ఉదయం 9 గంటలకు అయోధ్యకు బయల్దేరాలి. నాలుగు గంటల్లో అయోధ్యకు చేరుకుంటారు. అయోధ్య, రామజన్మభూమి, లక్ష్మణ్ ఘాట్, కనక్ భవన్ ఆలయం సందర్శించొచ్చు. సాయంత్రం సరయూ నది తీరంలో హారతి కార్యక్రమంలో పాల్గొనొచ్చు. రాత్రికి అయోధ్యలోనే బస చేయాలి.

    Day 5: ఐదో రోజు ఉదయం హోటల్‌లో చెక్ ఔట్ అయిన తర్వాత నందిగ్రామ్ బయల్దేరాలి. అక్కడ భారత్ హనుమాన్ ఆలయం, భారత్ కుండ్ సందర్శించొచ్చు. ఆ తర్వాత లక్నో బయల్దేరాలి. అక్కడ అంబేద్కర్ మెమోరియల్ పార్క్ సందర్శించాలి. ఆ తర్వాత లక్నోలో బస చేయాలి.

    Day 6: ఆరో రోజు ఉదయం హోటల్‌లో చెక్ ఔట్ కావాలి. ఆ తర్వాత గోమతీ రివర్ ఫ్రంట్ పార్క్ చూడొచ్చు. మధ్యాహ్నం 1.55 గంటలకు లక్నోలో ఫ్లైట్ ఎక్కితే రాత్రి 9.45 గంటలకు విశాఖపట్నం చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
    Published by:Santhosh Kumar S
    First published: