అసలే చలికాలం. తెలతెల్లని మంచు కురిసే సమయం. పచ్చని అందాలు చూడటానికి ఇంతకన్నా మంచి టైమ్ ఉండదు. గ్రీనరీతో పాటు వాటర్ ఫాల్స్ కూడా చూస్తే ఇక అంతకుమించిన టూర్ ఎక్స్‌పీరియెన్స్ ఇంకేదీ ఉండదేమో. ఇలాంటి అవకాశం కల్పిస్తోంది ఐఆర్సీటీసీ. దక్షిణ భారతదేశంలో టూరిస్టుల ఫేవరేట్ టూరిస్ట్ స్పాట్ అయిన కూర్గ్‌కు టూర్ ప్యాకేజీ ప్రకటించింది. 'హాలిడే టూర్ టు బెంగళూరు మైసూర్ కూర్గ్' పేరుతో ప్యాకేజీ ప్రకటించింది. బెంగళూరులో ఈ టూర్ ప్రారంభం అవుతుంది. ప్రతీ రోజు ఈ టూర్ అందుబాటులో ఉంటుంది. 6 రోజులు 5 రాత్రుల టూర్ ఇది. టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.11,950 మాత్రమే. ఈ ప్యాకేజీలో ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, ఏసీ గదుల్లో బస, కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ లాంటివి కవర్ అవుతాయి. ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను https://www.irctctourism.com/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు.
IRCTC: అండమాన్ వెళ్లాలా? ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ వివరాలివే
IRCTC Kerala Tour: హౌజ్ బోట్లో స్టేతో కేరళ టూర్... ప్యాకేజీ ధర తెలిస్తే షాకే
Day 1: మొదటి రోజు ఉదయం టూరిస్టులకు బెంగళూరు సిటీ, యశ్వంత్‌పూర్ స్టేషన్, బస్‌స్టాండ్ లేదా ఎయిర్‌పోర్టులో పికప్ చేసుకుంటారు. ఆ తర్వాత హోటల్‌కు తీసుకెళ్తారు. మొదటి రోజంతా లోకల్ సైట్ సీయింగ్ ఉంటుంది. రాత్రికి బెంగళూరులో బస చేయాలి.
Day 2: రెండో రోజు ఉదయం మైసూరుకు బయల్దేరాలి. దారిలో శ్రీరంగపట్నం, టిప్పూ ప్యాలెస్ చూడొచ్చు. మైసూర్లో హోటల్లో చెకిన్ అయిన తర్వాత సెయింట్ ఫిలొమెనా చర్చ్, సాయంత్రం బృందావన్ గార్డెన్స్ చూడొచ్చు. రాత్రికి మైసూర్‌లోనే బస చేయాలి.
Day 3: మూడో రోజు ఉదయం హోటల్ నుంచి చెకౌట్ అయిన తర్వాత కూర్గ్ బయల్దేరాలి. దారిలో జూ, చాముండి హిల్స్, బుద్ధిస్ట్ మానెస్ట్రీ (గోల్డెన్ టెంపుల్), కావేరీ నిసర్గధామ చూడొచ్చు. కూర్గ్ చేరుకున్నాక హోటల్లో చెకిన్ కావాలి. సాయంత్రం అబ్బే ఫాల్స్, ఓంకారేశ్వర ఆలయం, రాసా సీట్ సందర్శించొచ్చు. రాత్రికి కూర్గ్‌లోనే బస చేయాలి.
IRCTC: తెలుగు రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్... ఐఆర్సీటీసీ దక్షిణ భారతదేశ యాత్ర
IRCTC Kerala Tour: అదిరిపోయే ఆఫర్... ఐదు వేలకే కేరళ టూర్
Day 4: నాలుగో రోజు ఉదయం తలకావేరీ, భగమండల సందర్శించాలి. మధ్యాహ్నం ఎలిఫెంట్ క్యాంప్‌కు తీసుకెళ్తారు. రాత్రికి కూర్గ్‌లోనే బస చేయాలి.
Day 5: ఐదో రోజు ఉదయం కూర్గ్ నుంచి బెంగళూరుకు బయల్దేరాలి. దారిలో శ్రీరంగపట్నం తీసుకెళ్తారు. సాయంత్రానికి బెంగళూరు చేరుకుంటారు. రాత్రికి బెంగళూరులోనే బస చేయాలి.
Day 6: ఆరో రోజు ఉదయం ఇస్కాన్ టెంపుల్, విధాన సౌధ, కబ్బన్ పార్క్, లాల్ భాగ్, బుల్ టెంపుల్ తీసుకెళ్తారు. సాయంత్రం పర్యాటకుల్ని బెంగళూరు సిటీ, కంటోన్మెంట్ స్టేషన్, బస్టాండ్ లేదా ఎయిర్‌పోర్టులో డ్రాప్ చేయడంతో టూర్ ముగుస్తుంది.
కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని పర్యాటకులు కోవిడ్ 19 గైడ్‌లైన్స్ పాటించేలా చర్యలు తీసుకుంటోంది ఐఆర్సీటీసీ. కనీసం 6 అడుగుల ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, మాస్కులు, ఫేస్ కవర్స్ ఉపయోగించడం, తరచూ హ్యాండ్ వాష్ చేసుకోవడం, ఆల్కహాల్ బేస్డ్ హ్యాండ్ శానిటైజర్లు ఉపయోగించడం, ఆరోగ్య సేతు యాప్ ఉపయోగించడం లాంటివి తప్పనిసరి చేస్తోంది ఐఆర్సీటీసీ.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bangalore, Best tourist places, Irctc, IRCTC Tourism, Mysore, Tourism