Home /News /business /

IRCTC Hampi Tour: హైదరాబాద్ నుంచి ఫ్లైట్‌లో హంపి టూర్... ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ

IRCTC Hampi Tour: హైదరాబాద్ నుంచి ఫ్లైట్‌లో హంపి టూర్... ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ

IRCTC Hampi Tour: హైదరాబాద్ నుంచి ఫ్లైట్‌లో హంపి టూర్... ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ
(ప్రతీకాత్మక చిత్రం)

IRCTC Hampi Tour: హైదరాబాద్ నుంచి ఫ్లైట్‌లో హంపి టూర్... ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ (ప్రతీకాత్మక చిత్రం)

IRCTC Hampi Tour | ఐఆర్‌సీటీసీ హైదరాబాద్ నుంచి హెరిటేజ్ హంపి టూర్ ప్యాకేజీ ప్రకటించింది. ఈ టూర్ వివరాలు తెలుసుకోండి.

    కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం తగ్గడంతో వరుసగా టూర్ ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC. గతంలో ఉన్న టూర్లను పునరుద్ధరించడంతో పాటు కొత్త టూర్లను అందిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. హెరిటేజ్ హంపి పేరుతో హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజీ ప్రకటించింది. ఈ టూర్ ప్యాకేజీలో బళ్లారి, హోస్‌పేట్, హంపి, బాదామి కవర్ అవుతాయి. ఈ టూర్ ఆగస్ట్ 19న ప్రారంభం కానుంది. ఇది మూడు రాత్రులు, నాలుగు రోజుల టూర్ ప్యాకేజీ. ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను https://www.irctctourism.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

    IRCTC Heritage Hampi Tour: ఐఆర్‌సీటీసీ హెరిటేజ్ హంపి టూర్ ఎలా సాగుతుందంటే...


    Day 1: మొదటి రోజు ఉదయం హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో టూర్ మొదలవుతుంది. ఉదయం 08:20 గంటలకు హైదరాబాద్‌లో ఫ్లైట్ ఎక్కితే 09:25 గంటలకు బళ్లారి విద్యానగర్ ఎయిర్‌పోర్టులో దిగుతారు. అక్కడ్నుంచి హోస్‌పేట్ బయల్దేరాలి. హోటల్‌లో చెకిన్ అయిన తర్వాత అనెగుడి, పంపసరోవర సందర్శించాలి. సాయంత్రం తుంగభద్ర డ్యామ్ సందర్శించొచ్చు. రాత్రికి హోస్‌పేట్‌లో బస చేయాలి.

    IRCTC New Rule: ఐఆర్‌సీటీసీ కొత్త రూల్... టికెట్ బుక్ చేయాలంటే ఇది కంపల్సరీ

    IRCTC Tirumala Tour: శ్రీవారి దర్శనంతో తిరుమల టూర్ ప్యాకేజీ... రూ.990 మాత్రమే

    Day 2: రెండో రోజు హంపి సైట్ సీయింగ్ ఉంటుంది. విఠ్ఠల ఆలయం, హనుమాన్ విగ్రహం, విరూపాక్ష ఆలయం, క్వీన్స్ బాత్, ఎలిఫెంట్ స్టేబుల్, లోటస్ మహల్ లాంటివి సందర్శించొచ్చు. రాత్రికి హోస్‌పేట్‌లో బస చేయాలి.

    Day 03: మూడో రోజు బాదామికి బయల్దేరాలి. బాదామి గుహలు చూడొచ్చు. మధ్యాహ్న భోజనం తర్వాత అయిహోల్ ఆలయం, పట్టడక్కల్ కట్టడాలు సందర్శించాలి. సాయంత్రం తిరిగి హోస్‌పేట్ బయల్దేరాలి. రాత్రికి హోస్‌పేట్‌లో బస చేయాలి.

    Day 04: నాలుగో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత బళ్లారి విద్యానగర్ ఎయిర్‌పోర్టుకు బయల్దేరాలి. సాయంత్రం 5.15 గంటలకు బళ్లారి విద్యానగర్ ఎయిర్‌పోర్టులో ఫ్లైట్ ఎక్కితే సాయంత్రం 6.20 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.

    IRCTC Araku Tour: విశాఖపట్నం నుంచి అరకు టూర్... ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే

    IRCTC Tirupati Tour: ఈ టూర్ ప్యాకేజీ బుక్ చేసేవారికి తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం

    ఈ టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.15,350. ఇది ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.15,970, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.18,010 చెల్లించాలి. ఇవన్నీ కంఫర్ట్ ప్యాకేజీ ధరలు. డీలక్స్ ధరల వివరాలు చూస్తే ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.17,130, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.18,060, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.21,950 చెల్లించాలి. ఈ టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్లు, మూడు రాత్రులు హోస్‌పేట్‌లో బస, 3 బ్రేక్‌ఫాస్ట్‌, 3 డిన్నర్‌, 2 లంచ్‌, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.

    మీ నగరం నుండి (​హైదరాబాద్)

    తెలంగాణ
    ​హైదరాబాద్
    తెలంగాణ
    ​హైదరాబాద్
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Best tourist places, Hyderabad, Hyderabad news, Irctc, IRCTC Tourism, Telangana, Telangana News, Telangana updates, Telugu news, Telugu updates, Telugu varthalu, Tourism, Tourist place, Travel

    తదుపరి వార్తలు