హనీమూన్ వెళ్లాలనుకుంటున్నారా? ఎక్కడికైనా టూర్ వెళ్లాలని డిసైడ్ అయ్యారా? ఐఆర్సీటీసీ టూరిజం హైదరాబాద్ నుంచి షిమ్లా టూర్ ప్యాకేజీ ప్రకటించింది. షిమ్లాతో పాటు ధర్మశాల, అమృత్సర్, చండీగఢ్ లాంటి ప్రాంతాలు కవర్ అవుతాయి. 'హ్యాపీ హిమాచల్ విత్ పంజాబ్' పేరుతో ఈ ప్యాకేజీ అందిస్తోంది. 6 రాత్రులు, 7 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. టూర్ 2021 ఏప్రిల్ 14న ప్రారంభం అవుతుంది. 2021 ఏప్రిల్ 20న ముగుస్తుంది. ఐఆర్సీటీసీ హ్యాపీ హిమాచల్ విత్ పంజాబ్ టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.32,250. ఇది ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర. ఇక డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.33,950 కాగా, సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ.47,950. టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్స్, ఆరు రాత్రులు హోటల్లో బస, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ టెంపో ట్రావెలర్‌లో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను https://www.irctctourism.com/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్సైట్లో ప్యాకేజీ బుక్ చేసుకోవాలి.
IRCTC Happy Himachal With Punjab: ఐఆర్సీటీసీ హ్యాపీ హిమాచల్ విత్ పంజాబ్ టూర్ ప్యాకేజీ వివరాలివే
Day 1: మొదటి రోజు ఉదయం 7.50 గంటలకు హైదరాబాద్‌లో ఫ్లైట్ ఎక్కితే 10:25 గంటలకు చండీగఢ్ చేరుకుంటారు. హోటల్లో చెక్ ఇన్ అయిన తర్వాత రాక్ గార్డెన్, సుఖ్నా లేక్ సందర్శించొచ్చు. రాత్రికి చండీగఢ్‌లోనే బస చేయాలి.
IRCTC Goa Tour: గోవాకు హనీమూన్ వెళ్తారా? హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్సీటీసీ
IRCTC Tirupati Tour: హైదరాబాద్ నుంచి ఫ్లైట్‌లో తిరుపతి టూర్... శ్రీవారి దర్శనం కూడా
Day 2: రెండో రోజు ఉదయం హోటల్ నుంచి చెక్ ఔట్ కావాలి. అక్కడ్నుంచి అమృత్సర్ బయల్దేరాలి. దారిలో జలంధర్ సందర్శించొచ్చు. అమృత్సర్ చేరుకున్న తర్వాత వాఘా బార్డర్ తీసుకెళ్తారు. రాత్రికి అమృత్‌సర్‌లో బస చేయాలి.
Day 3: మూడో రోజు ఉదయం గోల్డెన్ టెంపుల్ తీసుకెళ్తారు. ఆ తర్వాత ఝలియన్వాలా బాగ్ సందర్శించాలి. ఆ తర్వాత ధర్మశాలకు బయల్దేరతారు. రాత్రికి ధర్మశాలలోనే బసచేయాలి.
Day 4: నాలుగో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత టిబెటన్ మానస్ట్రీ, హెచ్‌పీ క్రికెట్ స్టేడియం సందర్శించాలి. ఆ తర్వాత లోకల్ సైట్‌సీయింగ్ ఉంటుంది. రాత్రికి ధర్మశాలలోనే బస చేయాలి.
IRCTC Tour: తెలంగాణ, ఏపీ నుంచి పూరీ, కోణార్క్ టూర్... ఐదు రోజులకు రూ.5,250 మాత్రమే
తెలంగాణ, ఏపీ నుంచి IRCTC Bharat Darshan టూరిస్ట్ ట్రైన్... రూ.10,000 ఖర్చుతో 10 రోజుల టూర్
Day 5: ఐదో రోజు ఉదయం ధర్మశాల నుంచి షిమ్లా బయల్దేరాలి. షిమ్లా చేరుకున్న తర్వాత రాత్రికి అక్కడే బస చేయాలి.
Day 6: ఆరో రోజు షిమ్లా లోకల్ సైట్‌సీయింగ్ ఉంటుంది. కుఫ్రీ, మాల్ రోడ్ సందర్శించాలి. రాత్రికి షిమ్లాలోనే బస చేయాలి.
Day 7: ఏడో రోజు ఉదయం చండీగఢ్ బయల్దేరాలి. చండీగఢ్‌లో రాత్రి 7.25 గంటలకు ఫ్లైట్ ఎక్కితే రాత్రి 10 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.