Home /News /business /

IRCTC ANNOUNCED CHAR DHAM YATRA SPECIAL DELUXE AC TOURIST TRAIN COVERS BADRINATH JAGANNATH PURI RAMESHWARAM AND DWARKADHISH SS

IRCTC Char-Dham Yatra: చార్‌ధామ్ యాత్ర ప్రకటించిన ఐఆర్‌సీటీసీ... ప్యాకేజీ ధర ఎంతంటే

IRCTC Char-Dham Yatra: చార్‌ధామ్ యాత్ర ప్రకటించిన ఐఆర్‌సీటీసీ... ప్యాకేజీ ధర ఎంతంటే
(ప్రతీకాత్మక చిత్రం)

IRCTC Char-Dham Yatra: చార్‌ధామ్ యాత్ర ప్రకటించిన ఐఆర్‌సీటీసీ... ప్యాకేజీ ధర ఎంతంటే (ప్రతీకాత్మక చిత్రం)

IRCTC Char-Dham Yatra | చార్‌ధామ్ యాత్రకు వెళ్లాలనుకునే భక్తులకు గుడ్ న్యూస్. ఐఆర్‌సీటీసీ చార్‌ధామ్ యాత్రను ప్రకటించింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

    కరోనా వైరస్ మహమ్మారి కారణంగా టూర్లకు, యాత్రలకు దూరమైనవారికి శుభవార్త. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలను కలుపుతూ 'చార్‌ధామ్ యాత్ర'ను ప్రకటించింది. దేఖో అప్నా దేశ్ కార్యక్రమంలో భాగంగా ఈ యాత్రను ప్రకటించింది. డీలక్స్ ఏసీ టూరిస్ట్ ట్రైన్‌లో చార్‌ధామ్ యాత్ర చేయొచ్చు. చార్‌ధామ్ యాత్రలో భాగమైన బద్రీనాథ్, పూరీ జగన్నాథ్, రామేశ్వరం, ద్వారకాదీశ్ ప్రాంతాలను ఒకే టూర్‌లో చూడొచ్చు. బద్రీనాథ్‌లో బద్రీనాథ్ ఆళయం, మన గ్రామం, నర్సింఘా ఆలయం, రిషికేషన్‌లో లక్ష్మణ్ ఝూలా, త్రివేణి ఘాట్, పూరీలో జగన్నాథ ఆలయం, గోల్డెన్ బీచ్, కోణార్క్ సూర్య దేవాలయం, చంద్రభాగా బీచ్, రామేశ్వరంలో రామనాథస్వామి ఆళయం, ధనుష్కోటి, ద్వారకలో ద్వారకాదీష్ ఆలయం, నాగేశ్వర్ జ్యోతిర్లింగ, శివ్‌రాజ్‌పూర్ బీచ్, బెట్ ద్వారక సందర్శించొచ్చు.

    IRCTC: తిరుమల వెళ్లే భక్తులకు శుభవార్త... పంచదేవాలయం టూర్ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ

    IRCTC Work From Hotel: హిమాలయాలను చూసుకుంటూ వర్క్ చేసుకోవచ్చు... ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే


    ఐఆర్‌సీటీసీ 'చార్‌ధామ్ యాత్ర' ఢిల్లీలో మొదలవుతుంది. డీలక్స్ ఏసీ టూరిస్ట్ ట్రైన్‌ ఢిల్లీలోని సఫ్దర్‌గంజ్ రైల్వే స్టేషన్‌లో సెప్టెంబర్ 18న బయల్దేరుతుంది. మొత్తం 15 రాత్రులు, 16 రోజుల కొనసాగుతుంది. 8500 కిలోమీటర్లను కవర్ చేస్తుంది. ఈ టూర్ ప్యాకేజీ ధర రూ.78,585. సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీకి ప్యాకేజీ ధరలు వేర్వేరుగా ఉన్నాయి. టూర్ ప్యాకేజీలో ఫస్ట్ ఏసీ లేదా సెకండ్ ఏసీ క్లాస్‌లో ప్రయాణం, 6 రాత్రులు డీలక్స్ కేటగిరీ వసతి, 9 రాత్రులు రైలు కోచ్‌లోనే ప్రయాణం, రైలులోని రెస్టారెంట్ అందించే భోజనంతో పాటు పర్యాటక ప్రాంతాల్లో హోటళ్లలో భోజనం, ఏసీ వాహనాల్లో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. 'చార్‌ధామ్ యాత్ర' ఎలా ఉంటుందో వివరించేందుకు ఐఆర్‌సీటీసీ ఓ వీడియోను రూపొందించింది. ఆ వీడియో ఇక్కడ చూడొచ్చు.

    IRCTC Ticket Booking: ఐఆర్‌సీటీసీలో టికెట్ బుక్ చేసే రైల్వే ప్రయాణికులకు శుభవార్త

    IRCTC Goa Tour: హైదరాబాద్ నుంచి ఫ్లైట్‌లో గోవా టూర్... ప్యాకేజీ వివరాలివే


    డీలక్స్ ఏసీ టూరిస్ట్ రైలులో రెండు రెస్టారెంట్లు, అత్యాధునిక కిచెన్, షవర్ క్యూబికల్స్, సెన్సార్ బేస్డ్ వాష్‌రూమ్, ఫుట్ మసాజర్ లాంటి సౌకర్యాలు ఉంటాయి. రైలులో సీసీటీవీ కెమెరాలతో పాటు ప్రతీ కోచ్‌లో సెక్యూరిటీ గార్డులు ఉంటారు. ఈ రైలు 156 మంది టూరిస్టులు ప్రయాణించొచ్చు. కానీ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా టూరిస్టుల సంఖ్యను 120 కి తగ్గించింది ఐఆర్‌సీటీసీ. అంటే 120 మంది మాత్రమే ఈ ప్యాకేజీ బుక్ చేయడానికి అవకాశం ఉంటుంది. కోవిడ్ 19 మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని ఐఆర్‌సీటీసీ టూరిస్టులందరికీ ఫేస్ మాస్కులు, హ్యాండ్ గ్లోవ్స్, శానిటైజర్లను అందిస్తుంది. 18 ఏళ్లు పైబడినవారు ఐఆర్‌సీటీసీ 'చార్‌ధామ్ యాత్ర' ప్యాకేజీ బుక్ చేయాలంటే కనీసం కోవిడ్ 19 వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకోవాలి.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Best tourist places, Indian Railway, Indian Railways, Irctc, IRCTC Tourism, Railways, Special Trains, Tourism, Tourist place, Train, Train tickets, Travel

    తదుపరి వార్తలు