శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యను దర్శించుకోవాలనుకునే శ్రీరామ భక్తులకు శుభవార్త. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC అయోధ్య టూర్ ప్రకటించింది. అయోధ్యను దర్శించుకొని రామాణయానికి సంబంధించిన విశేషాలు తెలుసుకోవాలనుకునేవారికి ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుంది. 'అయోధ్య దర్శన్' పేరుతో ఈ ప్యాకేజీ అందిస్తోంది ఐఆర్సీటీసీ. ఈ ప్యాకేజీ ప్రతీ రోజు అందుబాటులో ఉంటుంది. ఇది ఒకరోజు ప్యాకేజీ మాత్రమే. ఫుల్ డే టూర్ ఉంటుంది. ఐఆర్సీటీసీ 'అయోధ్య దర్శన్' టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.7430. దీంతో పాటు రూ.9780, రూ.14440, రూ.21060 ప్యాకేజీలు కూడా ఉన్నాయి. టూర్ ప్యాకేజీలో వాహనంలో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. ఇతర ఖర్చుల్ని ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది. టూర్ ప్యాకేజీలకు సంబంధించిన పూర్తి వివరాలను https://www.irctctourism.com/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు.
IRCTC: తెలుగు రాష్ట్ర నుంచి దక్షిణ భారతదేశ యాత్ర... ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలివే
IRCTC Ooty Tour: ఆరు వేలకే ఊటీ హాలిడే ట్రిప్... ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలివే
ఐఆర్సీటీసీ అయోధ్య దర్శన్ టూర్ ప్యాకేజీ బుక్ చేసుకునేవారు ఉదయం 8 గంటల్లోగా చార్భాగ్ రైల్వే స్టేషన్, ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవాలి. టూరిస్టులను ఉదయం 8 గంటలకు ఐఆర్సీటీసీ ఎగ్జిక్యూటీవ్ పికప్ చేసుకుంటారు. ఆ తర్వాత అయోధ్యకు తీసుకెళ్తారు. అక్కడ పూజా కార్యక్రమాల్లో పాల్గొనొచ్చు. శ్రీరామ జన్మభూమి, హనుమాన్ ఘడి, కనక్ భవన్ సందర్శించొచ్చు. మధ్యాహ్న భోజనం తర్వాత సరయు ఘాట్‌కు తీసుకెళ్తారు. సమయం ఉంటే అక్కడ హారతి కార్యక్రమంలో పాల్గొనొచ్చు. ఆ తర్వాత పర్యాటకులను చార్భాగ్ రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్, హోటల్ దగ్గర డ్రాప్ చేయడంతో టూర్ ముగుస్తుంది.
IRCTC Tour: భక్తులకు గమనిక... నవగ్రహ ఆలయాల టూర్ ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్సీటీసీ
IRCTC Kerala Tour: కేరళ టూర్ ప్యాకేజీ రూ.7,425 మాత్రమే... హౌజ్ బోట్లో బస చేయొచ్చు
Undertake a divine journey to the pious land of #Hindu gods & ancient legends. Offer prayers at the venerated temples of #Ayodhya & #Naimishranya with a perfectly-planned tour package from #IRCTC. Make your #bookings on https://t.co/F8GuGCjTbZ #dekhoapnadesh #photography #like
— IRCTC (@IRCTCofficial) November 23, 2020
ఐఆర్సీటీసీ అయోధ్య దర్శన్ టూర్ ప్రతీ రోజు అందుబాటులో ఉంటుంది. ఐఆర్సీటీసీ టూరిజం వెబ్సైట్లో ఉన్న వివరాల ప్రకారం నవంబర్ 27,28,29,30, డిసెంబర్ 1,2,3,4,5,6,7,8,9,10,11,12,15,16,17,18,19,20,21,22,23,27,28, జనవరి 3,4,5,6,7,8,9,10,11,12,15,16,17,18,19,20,21,22,23,27,28,29,30,31, ఫిబ్రవరి 1,2,3,4,5,6,7,8,9,10,13,14,15,16,17,18,19,20,21,22,23,24,25,26,27,28 తేదీల్లో ఐఆర్సీటీసీ అయోధ్య దర్శన్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ayodhya, Ayodhya Ram Mandir, Best tourist places, Irctc, IRCTC Tourism, Tourism