HOME »NEWS »BUSINESS »irctc and sbi card launched rupay credit card no joining fee till 2021 march 21 know benefits ss

IRCTC SBI Credit Card: గుడ్ న్యూస్... జాయినింగ్ ఫీజు లేకుండా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్

IRCTC SBI Credit Card: గుడ్ న్యూస్... జాయినింగ్ ఫీజు లేకుండా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్
IRCTC SBI Credit Card: గుడ్ న్యూస్... జాయినింగ్ ఫీజు లేకుండా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్

IRCTC SBI Rupay Credit Card | మీరు కొత్త క్రెడిట్ కార్డ్ తీసుకోవాలనుకుంటున్నారా? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఐఆర్‌సీటీసీతో కలిసి రూపే క్రెడిట్ కార్డ్ లాంఛ్ చేసింది. లాభాలేంటో తెలుసుకోండి.

  • Share this:
    తరచూ రైళల్లో ప్రయాణించేవారి కోసం ఐఆర్‌సీటీసీ, ఎస్‌బీఐ కార్డ్ ప్రత్యేకంగా క్రెడిట్ కార్డులు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇన్నాళ్లూ ప్రీమియర్, ప్లాటినమ్ క్రెడిట్ కార్డ్స్ మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఐఆర్‌సీటీసీ ఎస్‌బీఐ కార్డ్ రూపే ప్లాట్‌ఫామ్ పైన తీసుకోవచ్చు. రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఐఆర్‌సీటీసీ ఎస్‌బీఐ రూపే క్రెడిట్ కార్డ్‌ను ఆవిష్కరించారు. తరచూ రైళ్లల్లో ప్రయాణించేవారి అవసరాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన క్రెడిట్ కార్డు ఇది. ప్రయాణాల కోసం ఈ క్రెడిట్ కార్డును ఉపయోగిస్తే ఎక్కువ బెనిఫిట్స్ పొందొచ్చు. దీంతో పాటు షాపింగ్, డైనింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ లాంటివాటికి కూడా ఈ క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్స్ చేసి లాభాలు పొందొచ్చు. బిగ్ బాస్కెట్, ఏజియో లాంటి పాపులర్ ఇ-కామర్స్ సైట్లలో కూడా డిస్కౌంట్స్ పొందొచ్చు.


    ఐఆర్‌సీటీసీ ఎస్‌బీఐ రూపే క్రెడిట్ కార్డ్‌ తీసుకున్న కస్టమర్లు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, చైర్ కార్ ఏసీ టికెట్లు బుక్ చేస్తే 10శాతం వ్యాల్యూ బ్యాక్ లభిస్తుంది. 1% ట్రాన్సాక్షన్ ఫీజు మినహాయింపు కూడా లభిస్తుంది. కార్డ్ యాక్టివేట్ చేసిన వెంటనే 350 బోనస్ రివార్డ్ పాయింట్స్ లభిస్తాయి. 1% ఫ్యూయెల్ సర్‌ఛార్జీ మినహాయింపు కూడా లభిస్తుంది. ఇవే కాకుండా టికెట్ బుకింగ్, షాపింగ్ ద్వారా పొందిన బోనస్ పాయింట్స్‌ని ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో రీడీమ్ చేసుకోవచ్చు. అంటే ఎక్కువ పాయింట్స్ ఉంటే ఉచితంగానే రైలు టికెట్లు పొందొచ్చు. ఐఆర్‌సీటీసీ ఎస్‌బీఐ రూపే క్రెడిట్ కార్డుకు నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్-NFC టెక్నాలజీ ఉంటుంది. అంటే కార్డు స్వైప్ చేయాల్సిన అవసరం లేకుండా పీఓఎస్ మెషనీల్పై ట్యాప్ చేసి పేమెంట్స్ చేయొచ్చు.


    మీరు ఐఆర్‌సీటీసీ ఎస్‌బీఐ రూపే క్రెడిట్ కార్డ్‌ తీసుకోవాలనుకుంటే ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ లేదా, ఎస్‌బీఐ కార్డ్ వెబ్‌సైట్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది. 2021 మార్చి 21 వరకు అప్లై చేసేవారికి జాయినింగ్ ఫీజు ఉండదు.
    Published by:Santhosh Kumar S
    First published:July 28, 2020, 13:17 IST

    टॉप स्टोरीज