• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • IRCTC AND FHRAI JOIN HANDS TO OFFER HOTEL ACCOMMODATION TO TOURISTS NS

IRCTC: పర్యాటకులకు గుడ్ న్యూస్ చెప్పిన IRCTC.. టికెట్ బుకింగ్ తో పాటు ఆ సదుపాయం కూడా..

IRCTC: పర్యాటకులకు గుడ్ న్యూస్ చెప్పిన IRCTC.. టికెట్ బుకింగ్ తో పాటు ఆ సదుపాయం కూడా..

ప్రతీకాత్మక చిత్రం

ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ ఈ-టికెటింగ్(IRCTC) మరో కీలక నిర్ణయం తీసుకుంది. పర్యాటకులకు మెరుగైన హోటల్ సదుపాయాలు కల్పించడానికి..

  • Share this:
    పర్యాటకులకు మెరుగౌన సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ ఈ-టికెటింగ్(IRCTC) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందు
    కోసం ఫెడరేషన్ ఆఫ్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా(FHRAI)తో కీలక ఒప్పందం చేసుకుంది. పర్యాటకులకు మెరుగైన, అత్యుత్తమమైన హోటల్ సదుపాయాలు అందించడమే లక్ష్యంగా ఈ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా ఐఆర్సీటీసీ పర్యాటక వెబ్ సైట్లో FHRAIతో పాటు, దాని భాగస్వామ్య హోటళ్లలో వసతికి సంబంధించి బుక్సింగ్స్‌ అందుబాటులోకి వస్తాయి. ఐఆర్‌సీటీసీ, ఎఫ్‌హెచ్ఆర్ఏఐల భాగస్వామ్య ఒప్పందం మూడేళ్ల వరకు
    కొనసాగనుంది. ఒప్పందం ముగిసిన అనంతరం తిరిగి పొడిగించే అవకాశం సైతం ఉంది.

    ఈ ఒప్పదం కారణంగా ఐఆర్సీటీసీ వినియోగదారులు దేశవ్యాప్తంగా ఉన్న 55 వేల హోటళ్లలో తమకు నచ్చిన హోటల్ ను బుక్ చేసుకునే అవకాశం కలుగుతుంది.
    ఈ విషయంపై ఎఫ్‌హెచ్ఆర్‌ఏఐ వైస్ ప్రెసిడెంట్ గుర్‌బక్షిష్ సింగ్ కోహ్లీ మాట్లాడుతూ... ఎఫ్‌హెచ్ఆర్‌ఏఐ హోటళ్లలో వివిధ సౌకర్యాలతో పాటు.. అంతర్జాతీయ భద్రతా
    ప్రమాణాలు కూడా ఉన్నాయని తెలిపారు. ఐఆర్సీటీసీ ద్వారా ప్రయాణికులు తమ ప్రయాణాన్ని బుక్ చేసుకునే సమయంలో సదుపాయాలు కలిగిన తమ హోటళ్లలో
    గదులను సైతం బుక్ చేసుకునే సౌలభ్యం ఈ ఒప్పందం ద్వారా కలుగుతుందన్నారు.

    ఈ అంశంపై ఎఫ్‌హెచ్‌ఆర్‌ఐ వైస్ ప్రెసిడెంట్ సురేంద్ర కుమార్ జైస్వాల్ మాట్లాడుతూ.. ఐఆర్‌సీటీసీ, ఎఫ్‌హెచ్ఆర్ఏఐ ల భాగస్వామ్యం ప్రధాని మోదీ ప్రభుత్వం
    చేసిన గొప్ప ప్రయత్నం అని కొనియాడారు. ఈ భాగస్వామ్యం హోటళ్లు, రెస్టారెంట్ల యజమానుల ఇబ్బందులను తొలగిస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ ఒప్పందం
    కరోనా కారణంగా నష్టపోయిన హోటల్ యజమానుల్లో ఆశలు నింపిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    అగ్ర కథనాలు