IRCTC: రూ.33 కోసం 24 నెలల పోరాటం... ఓ కామన్ మ్యాన్ కథ ఇది

అప్పటి నిబంధనల ప్రకారం వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న టికెట్ క్యాన్సిల్ చేస్తే రూ.65 ఛార్జ్ చేస్తుంది ఐఆర్‌సీటీసీ. కానీ సుజీత్ స్వామికి రూ.100 తక్కువగా వచ్చాయి. రూ.65 క్లరికల్ ఛార్జ్, రూ.35 సర్వీస్ ట్యాక్స్. దీంతో తనకు రావాల్సిన రూ.35 కోసం ఐఆర్సీటీసీని సంప్రదించాడు.

news18-telugu
Updated: May 9, 2019, 12:40 PM IST
IRCTC: రూ.33 కోసం 24 నెలల పోరాటం... ఓ కామన్ మ్యాన్ కథ ఇది
IRCTC: రూ.33 కోసం 24 నెలల పోరాటం... ఓ కామన్ మ్యాన్ కథ ఇది (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
తమకు జరిగిన అన్యాయంపై కొందరు వ్యక్తులు జరిపే పోరాటాలు ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తాయి. పోరాడి సాధించినది ఏమిటి, ఎంత అన్నదానికన్నా పోరాటంలో గెలిచామా లేదా? న్యాయం జరిగిందా లేదా? అన్నదే ముఖ్యం. రాజస్తాన్‌లోని కోటాకు చెందిన ఓ వ్యక్తి కథ కూడా అలాంటిదే. ఐఆర్‌సీటీసీపై ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా 24 నెలల పాటు పోరాటం చేశాడు. అన్యాయంగా తన నుంచి రూ.33 వసూలు చేశారన్న ఆవేదనతో చేసిన పోరాటమది. చివరకు న్యాయం అతనివైపే నిలిచింది. ఐఆర్‌సీటీసీ నుంచి అతనికి న్యాయంగా రావాల్సిన రూ.33 రీఫండ్ వచ్చేసింది. ఈ పోరాటంలో అతనికి న్యాయం జరిగింది.

రైలు టికెట్ బుక్ చేసినప్పుడో లేదా ఏదైనా ఫీజు చెల్లించినప్పుడో కొన్ని సాంకేతిక కారణాల వల్ల డబ్బులు ఎక్కువగా చెల్లించిన సందర్భాలు చాలామందికి ఎదురవుతుంటాయి. లేదా రీఫండ్ రావాల్సినంత కాకుండా కాస్త తక్కువగా వస్తుంది. పోనీలే అని వదిలేసేవారే ఎక్కువ. కానీ... కోటాకు చెందిన 30 ఏళ్ల ఇంజనీర్ సుజీత్ స్వామి అలా చేయలేదు. భారతీయ రైల్వే తన నుంచి నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేసిన రూ.35 కోసం పోరాటం జరిపాడు.

Read this: IRCTC Tatkal Booking: ఐఆర్‌సీటీసీ తత్కాల్ బుకింగ్... ఈజీగా చేయొచ్చు ఇలా

జీఎస్టీ అమలులోకి రాకముందే బుక్ చేసిన టికెట్‌ను క్యాన్సిల్ చేస్తే... ఐఆర్‌సీటీసీ జీఎస్టీ వసూలు చేసిందన్నది అతని వాదన. 2017 జూలై 2న కోటా నుంచి న్యూ ఢిల్లీ వెళ్లేందుకు గోల్డెన్ టెంపుల్ మెయిల్ రైలులో 2017 ఏప్రిల్‌లో టికెట్ బుక్ చేసుకున్నాడు. టికెట్ ధర రూ.765. టికెట్ వెయిటింగ్ లిస్ట్‌లో ఉండటంతో ఆయన టికెట్ క్యాన్సిల్ చేసుకున్నాడు. రీఫండ్ రూ.665 వచ్చింది.


irctc refund, Kota based engineer, sujit swami, irctc refund helpline, irctc refund status, irctc ticket cancellation, irctc cancellation charges for waiting list ticket, irctc ticket cancellation refund time, train ticket cancellation charges, Indian railways, ఐఆర్‌సీటీసీ రీఫండ్, కోటా ఇంజనీర్, సుజీత్ స్వామి, ఐఆర్‌సీటీసీ రీఫండ్ హెల్ప్‌లైన్, ఐఆర్‌సీటీసీ రీఫండ్ స్టేటస్, ఐఆర్‌సీటీసీ టికెట్ క్యాన్సలేషన్, ఐఆర్‌సీటీసీ రీఫండ్ ఛార్జీలు, ఇండియన్ రైల్వేస్, భారతీయ రైల్వే
ప్రతీకాత్మక చిత్రం


అప్పటి నిబంధనల ప్రకారం వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న టికెట్ క్యాన్సిల్ చేస్తే రూ.65 ఛార్జ్ చేస్తుంది ఐఆర్‌సీటీసీ. కానీ సుజీత్ స్వామికి రూ.100 తక్కువగా వచ్చాయి. రూ.65 క్లరికల్ ఛార్జ్, రూ.35 సర్వీస్ ట్యాక్స్. దీంతో తనకు రావాల్సిన రూ.35 కోసం ఐఆర్సీటీసీని సంప్రదించాడు. జీఎస్టీ రాకముందు బుక్ చేసిన టికెట్ క్యాన్సిల్ చేశాను కాబట్టి తనకు జీఎస్టీ వర్తించదంటూ తన వాదన వినిపించాడు. తనకు ఇంకా రావాల్సిన రూ.35 కోసం 2017 నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాడు సుజీత్ స్వామి. సమాచార హక్కు చట్టం కింద సంప్రదించాడు. రైల్వే మంత్రిత్వ శాఖ కమర్షియల్ సర్క్యులర్ నెంబర్ 43 ప్రకారం జీఎస్టీకి ముందు బుక్ చేసిన టికెట్లను జీఎస్టీ అమలు చేసిన తర్వాత క్యాన్సిల్ చేస్తే సర్వీస్ ట్యాక్స్ రీఫండ్ చేయరని ఐఆర్‌సీటీసీ సమాధానం ఇచ్చింది. ఆ తర్వాత 2017 జూలై 1 ముందు బుక్ చేసిన టికెట్లకు వర్తింపజేయాలని నిర్ణయం తీసుకున్నట్టు ఐఆర్‌సీటీసీ స్పష్టత ఇచ్చింది. ఆ లెక్కన బుకింగ్ సమయంలో ఛార్జ్ చేసిన సర్వీస్ ట్యాక్స్ రీఫండ్ చేయాల్సిందే. సరిగ్గా 2019 మే 1న సుజీత్ స్వామికి న్యాయంగా రావాల్సిన డబ్బు అతని బ్యాంక్ అకౌంట్‌లో క్రెడిట్ అయ్యాయి.

Read this: IRCTC: ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్ ఏజెంట్ మీరూ కావొచ్చు... వివరాలు ఇవే
నేను 2018 ఏప్రిల్‌లో లోక్ అదాలత్‌లో పిటిషన్ దాఖలు చేశాను. అయితే ఇది తమ పరిధిలోని అంశం కాదంటూ 2019 జనవరిలో పిటిషన్‌ను తిరస్కరించారు. నేను ఆర్‌టీఐ ద్వారా పోరాడుతూనే ఉన్నాను. 2018 డిసెంబర్ నుంచి 2019 ఏప్రిల్ వరకు నా ఆర్‌టీఐ దరఖాస్తులు ఒక డిపార్ట్‌మెంట్ నుంచి మరో డిపార్ట్‌మెంట్‌కు 10 సార్లు ట్రాన్స్‌ఫర్ అయ్యాయి. చివరకు నా పోరాటం ఫలించింది. చివరకు బ్యాంక్ అకౌంట్‌లో రూ.33 క్రెడిట్ అయ్యాయి. నాకు జరిగిన అన్యాయానికి పరిహారం ఇవ్వాల్సింది పోయి రూ.2 తగ్గించి రూ.33 మాత్రమే అకౌంట్‌లో వేశారు.
సుజీత్ స్వామి, ఇంజనీర్


irctc refund, Kota based engineer, sujit swami, irctc refund helpline, irctc refund status, irctc ticket cancellation, irctc cancellation charges for waiting list ticket, irctc ticket cancellation refund time, train ticket cancellation charges, Indian railways, ఐఆర్‌సీటీసీ రీఫండ్, కోటా ఇంజనీర్, సుజీత్ స్వామి, ఐఆర్‌సీటీసీ రీఫండ్ హెల్ప్‌లైన్, ఐఆర్‌సీటీసీ రీఫండ్ స్టేటస్, ఐఆర్‌సీటీసీ టికెట్ క్యాన్సలేషన్, ఐఆర్‌సీటీసీ రీఫండ్ ఛార్జీలు, ఇండియన్ రైల్వేస్, భారతీయ రైల్వే
ప్రతీకాత్మక చిత్రం


ఇలా ఐఆర్‌సీటీసీలో న్యాయంగా రావాల్సిన రీఫండ్ కోసం పోరాటం చేసింది సుజీత్ స్వామి ఒక్కడే. జీఎస్టీ అమలు చేయడానికంటే ముందు టికెట్లు బుక్ చేసి, జీఎస్టీ అమలైన తర్వాత టికెట్లు క్యాన్సిల్ చేసిన 9 లక్షల మంది నుంచి ఇలాగే ఛార్జీలు వసూలు చేసినట్టు సుజీత్ స్వామి ఫైల్ చేసిన ఆర్‌టీఐ ద్వారా తెలిసింది. ఆ డబ్బు రూ.3.34 కోట్లు ఉంటుందని అంచనా. చాలామంది ప్రయాణికులు ఈ విషయాన్నే పట్టించుకోలేదు. మరి వారికి ఇప్పటికైనా రీఫండ్ వస్తుందో రాదో తెలియదు. మొత్తానికి ఓ సామాన్యుడు తన పవర్ ఏంటో చాటి చెప్పాడు. అందుకే అంటారు "డోన్ట్ అండర్ ఎస్టిమేట్ ది పవర్ ఆఫ్ ఏ కామన్ మ్యాన్" అని.

Photos: గూగుల్ పిక్సెల్ 3ఏ, 3ఏ ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్స్ ఎలా ఉన్నాయో చూశారా?

ఇవి కూడా చదవండి:

IRCTC-SBI offer: ఫ్రీగా రైలు టికెట్... 10% క్యాష్‌బ్యాక్... ఆఫర్ ఇలా పొందండి

IRCTC-ePayLater: డబ్బులు లేవా? అయినా ట్రైన్ టికెట్ బుక్ చేయొచ్చు ఇలా...
First published: May 9, 2019, 12:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading