Home /News /business /

IPO FIREWORKS IN NEW YEAR TOO COMPANIES LIKELY TO GARNER RS 1 5 LAKH CRORE THROUGH INITIAL SHARE SALES GH VB

IPOs Market: 2022లోనూ కొనసాగనున్న IPO ట్రెండ్.. రూ.1.5 లక్షల కోట్లు సంపాదించనున్న కంపెనీలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

2021 విపరీతమైన లిక్విడిటీ, పెరిగిన రిటైల్ పెట్టుబడిదారుల సంఖ్యతో ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్(IPO)లకు ఎన్నడూ లేని విధంగా సానుకూల రెస్పాన్స్ లభించింది. దీనితో కంపెనీలు ఈ సంవత్సరం రూ. 1.2 లక్షల కోట్లకు పైగా సంపాదించాయి.

2021లో అనేక కంపెనీలు ఐపీఓలకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే 2021 కంటే 2022లో ఐపీఓ జోరు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (బీఎస్‌సీ) మార్కెట్ లెక్కలేనన్ని ఇనిషియల్‌ షేర్ సేల్స్ (initial share sales)తో తారాజువ్వలా ఎగిసిపడుతుందని నిపుణులు తెలుపుతున్నారు. 2022లో కంపెనీల ఇనిషియల్‌ షేర్ విక్రయాలతో దలాల్ స్ట్రీట్ ఆద్యంతం కళకళలాడుతుందని అభిప్రాయపడుతున్నారు. కొత్త సంవత్సరంలో కంపెనీలు ఏకంగా రూ. 1.5 లక్షల కోట్ల వరకు రాబట్టవచ్చని అంచనా వేస్తున్నారు. రెండు దశాబ్దాల తరువాత 2021 బెస్ట్ ఐపీఓ ఇయర్‌గా మారింది.

2021 నుంచి భారతీయ మార్కెట్లు బుల్లిష్ గా మారాయే తప్ప బేరీష్ సంకేతాలు అసలు చూపించలేదు. 2021 విపరీతమైన లిక్విడిటీ, పెరిగిన రిటైల్ పెట్టుబడిదారుల సంఖ్యతో ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్(IPO)లకు ఎన్నడూ లేని విధంగా సానుకూల రెస్పాన్స్ లభించింది. దీనితో కంపెనీలు ఈ సంవత్సరం రూ. 1.2 లక్షల కోట్లకు పైగా సంపాదించాయి. కరోనా కాలంలోనూ ఈ స్థాయిలో కంపెనీలు ఐపీఓ ద్వారా డబ్బును సమకూర్చుకోవడమనేది మామూలు విషయం కాదు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) మెగా ఐపీఓ ద్వారా 2022లో ప్రైమరీ మార్కెట్ ద్వారా అధిక మొత్తంలో నిధులు సమకూరుతాయని చెప్పొచ్చు.

Milk Jewelry: తల్లిపాలతో నగల తయారీ.. ఆసక్తి పెంచుకున్న యువత.. ఎలా తయారు చేస్తారో తెలుసుకోండి..


భారతీయ మార్కెట్ల బుల్లిష్ రన్‌కు ఒమిక్రాన్, వడ్డీ రేట్లు పెరుగుదల వంటి అంశాలు అడ్డంకిగా మారొచ్చని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలా అని ఈక్విటీల ప్రైమరీ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలిపోదని.. కానీ కరోనా మహమ్మారి సంబంధిత దుర్వార్తలు ఎంతోకొంత ప్రభావం చూపుతాయని అంటున్నారు. ఐపీఓల ద్వారా సేకరించే అమౌంట్ రూ.1.25 - రూ. 1.5 లక్షల కోట్ల రేంజ్‌లో ఉండొచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2022 ఐపీఓ సేకరణలో కొత్త రికార్డులను సృష్టించబోతోంది అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. భారతీయ ప్రైమరీ మార్కెట్ లో బెస్ట్ ఐపీఓ ఇయర్‌గా చరిత్ర సృష్టించిన 2021లో ఐపీఓలు 16.9 బిలియన్ల అమెరికన్ డాలర్లు సేకరించాయి.

కొత్త తరం టెక్నాలజీ కంపెనీలు వ్యాపార రంగంలో రాజ్యమేలుతున్న సమయంలో ఇండియన్ ఐపీఓ మార్కెట్ అత్యుత్తమ పర్ఫామెన్స్ కనబరుస్తోందని.. అన్ని ప్రొడక్టులకు డిమాండ్ కూడా విపరీతంగా పెరిగిపోతుందని విశదీకరిస్తున్నాయి నిపుణులు. స్టార్ట్ అప్ కంపెనీలతో సహా విభిన్న కంపెనీలు అంతకంతకూ విస్తరిస్తూ లాభాల బాట పడుతున్నాయని అంటున్నారు. దీనివల్ల ఇన్వెస్టర్ సెంటిమెంట్ అనేది ఇప్పటికీ స్థిరంగానే ఉందని.. దేశీ, విదేశీ డిమాండ్ లతో 2022 లోనూ ఇన్వెస్టర్ సెంటిమెంట్ అనేది ఇంకా పెరగవచ్చని అంటున్నారు.

Dating Experience: మీరు డేటింగ్ కు వెళ్తున్నారా.. అయితే వాళ్లను ఇంప్రెస్ చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి..


కొందరు విశ్లేషకులు మాత్రం మహమ్మారి కారణంగా 2022 అనేది ప్రైమరీ మార్కెట్లకు అంతగా అనుకూలంగా ఉండకపోవచ్చని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఒక్క ఏడాదిలోనే 63 కంపెనీలు ఐపీఓలకు వచ్చి రూ.1.2 లక్షల కోట్లు రాబట్టాయి. 2020లో కేవలం 15 కంపెనీలు మాత్రమే ఇనిషియల్‌ షేర్స్ సేల్ చేసి రూ.26,611 కోట్లు మాత్రమే సమీకరించాయి. అంటే ఏ స్థాయిలో ఐపీఓల మొత్తం పెరిగిందో గమనించవచ్చు. 2021కి ముందు 2017లో మొత్తం 36 కంపెనీలు ఐపీవోలకు వచ్చి రూ.68,827 సేకరించాయి.

అయితే ఈ రికార్డుని 2021 బీట్ చేసింది. వన్97 కమ్యూనికేషన్ (పేటీఎం) రూ.18,300 కోట్లు.. జొమాటో రూ 9,375 కోట్లు.. స్టార్ హెల్త్ & అలైడ్ ఇన్సూరెన్స్ రూ.6,018 కోట్లు.. పాలసీబజార్ రూ.5,625 కోట్లు.. సోనా కామ్‌స్టార్ రూ.5,550 కోట్లు, నైకా పేరెంట్ కంపెనీ FSN కామర్స్ వెంచర్స్ రూ.5,350 కోట్లు, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ రూ.4,633.38 కోట్లు సమీకరించి 2021లో అతిపెద్ద ఇష్యూలుగా నిలిచాయి.  2022లో చాలా కంపెనీలు ఐపీఓలకు వచ్చే అవకాశం ఉంది. 2021 నాల్గవ త్రైమాసికంలో 15 కంటే ఎక్కువ కంపెనీలు తమ డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP)ని ప్రధాన మార్కెట్‌లో దాఖలు చేశాయి. ఇవి మొదటి త్రైమాసికం 2022లో తమ ఐపీఓలను తేవాలని యోచిస్తున్నాయి.
Published by:Veera Babu
First published:

Tags: Business, IPO

తదుపరి వార్తలు