IPL 2023: క్రికెట్ ఫ్యాన్స్‌కు జాతర లాంటి ఐపీఎల్-2023(IPL 2023) టోర్నీ నేడు ప్రారంభం కానుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఓపెనింగ్ సెర్మనీ జరగనుంది. ఐపీఎల్ 2023 ఫస్ట్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఈ మెగా క్రికెట్ టోర్నమెంట్ 16వ ఎడిషన్‌కు, టాటా గ్రూప్ టైటిట్ స్పాన్సర్‌గా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్-2023కి అధికారిక భాగస్వామిగా టాటా టియాగో ఎలక్ట్రిక్ వెహికల్ (Tiago EV) ఉంటుంది. IPL మ్యాచ్‌లు ఆడాల్సిన మొత్తం 12 స్టేడియంలలో దీన్ని ప్రదర్శిస్తారు. ఎక్కువ మందికి టియాగో ఈవీ రీచ్ కావడంతో పాటు బ్రాండ్ అవేర్‌నెస్ పెంచడానికి దీన్ని మ్యాచ్‌ల్లో డిస్‌ప్లే చేయనున్నాను.
టాటా మోటార్స్ 2018 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్‌తో అసోసియేట్ అవుతోంది. ఇప్పటికే నెక్సాన్, హారియర్, ఆల్ట్రోజ్, సఫారీ, పంచ్ వంటి పాపులర్ మోడల్స్‌ను సంస్థ లీగ్‌లో ప్రదర్శించింది. ఇటీవల ముగిసిన ఉమెన్ ప్రీమియర్ లీగ్‌లో టాటా మోటార్స్ సఫారీని వెహికల్‌ను ప్రదర్శించగా, ఇప్పుడు టియాగో EVని టోర్నీ మొత్తం, అన్ని మ్యాచ్‌లలో ప్రదర్శించనుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్‌పై అపోహలను దూరం చేయడం, వీటిపై అవగాహన పెంచడంతో పాటు EVల వైపు కొనుగోలుదారులను ఆకర్షించడం.. వంటి లక్ష్యాలతో టాటా గ్రూప్ ఈ నిర్ణయం తీసుకుంది.
బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI), IPLతో వరుసగా ఆరో సంవత్సరం టాటా మోటార్స్ తన అనుబంధాన్ని కొనసాగిస్తోంది. ఈ సందర్భంగా EVల గురించి అవగాహన పెంచడానికి ఈ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించుకోవాలని టాటా మోటార్స్ లక్ష్యంగా పెట్టుకుంది.
IPLతో పార్ట్నర్‌షిప్ గురించి టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మార్కెటింగ్, సేల్స్ అండ్ సర్వీస్ స్ట్రాటజీ హెడ్ వివేక్ శ్రీవత్స మాట్లాడారు. వరుసగా ఐదేళ్లు ఐపీఎల్‌తో అసోసియేట్ అయ్యామని, ఇప్పుడు ఆరో సంవత్సరం కూడా ఈ అనుబంధాన్ని కొనసాగిస్తున్నామని చెప్పారు. ‘మా సరికొత్త EV ఆఫర్ అయిన టియాగో EVని టోర్నీ మొత్తం, అన్ని స్టేడియంలలో ప్రదర్శిస్తాం. ఈ కొత్త ప్రొడక్ట్‌తో ఇండియన్ EV మార్కెట్‌ను పెంచుకోవాలని భావిస్తున్నాం. ఈవీలపై నెలకొన్ని అపోహలను దూరం చేయడంతో పాటు బ్రాండ్ వాల్యూ పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని చెప్పారు.
మరోవైపు, '100 రీజన్స్ విత్ Tiago.ev' క్యాంపెయిన్‌కు కూడా టాటా మోటార్స్ ప్రారంభించింది. ఈ సంవత్సరం IPL మ్యాచ్‌ల్లో Tiago.ev ఎలక్ట్రిక్ స్ట్రైకర్ అవార్డును అందిస్తారు. ప్రతి మ్యాచ్‌లో అత్యధిక స్ట్రైక్ రేట్ ఉన్న ఆటగాళ్లను గుర్తించి, ప్రతి మ్యాచ్‌లో విజేతకు ట్రోఫీ, రూ.1 లక్ష నగదు బహుమతి అందిస్తారు. ఎలక్ట్రిక్ స్ట్రైకర్ ఆఫ్ సీజన్‌కి సరికొత్త టాటా టియాగో EVని అందిస్తారు.
టాటా నుంచి స్టైలిష్ బడ్జెట్ కారు.. అదిరిపోయే హ్యాచ్‌బ్యాక్ డిజైన్.. ధర, ఫీచర్స్ ఇవే!
* కారు గురించి..
టాటా మోటార్స్ Tiago EVని 2022 సెప్టెంబర్ 28న లాంచ్ చేసింది. దీని ధర రూ. 8,49,000 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 10న కంపెనీ మొత్తం ఏడు వేరియంట్ల ధరలను రూ. 20,000 వరకు పెంచింది. అయినా కూడా Tiago EV భారతదేశంలో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారుగానే నిలిచింది. దీనికి 20,000 కంటే ఎక్కువ బుకింగ్స్ వచ్చాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Evs, IPL 2023, Tata Motors