• associate partner

IPL 2020: డ్రీమ్11 లో డబ్బులు గెలుచుకుంటున్నారా? ఈ తప్పు చేస్తే చిక్కులు తప్పవు

IPL 2020 | డ్రీమ్‌11 లో నిర్వహించే కాంటెస్ట్‌లో పాల్గొంటున్నారా? అందులో డబ్బులు గెలుచుకుంటున్నారా? అయితే ఈ విషయం మర్చిపోతే చిక్కులు తప్పవు.

news18-telugu
Updated: September 19, 2020, 2:15 PM IST
IPL 2020: డ్రీమ్11 లో డబ్బులు గెలుచుకుంటున్నారా? ఈ తప్పు చేస్తే చిక్కులు తప్పవు
IPL 2020: డ్రీమ్11 లో డబ్బులు గెలుచుకుంటున్నారా? ఈ తప్పు చేస్తే చిక్కులు తప్పవు (ప్రతీకాత్మక చిత్రం, image: News18 Creative)
  • Share this:
కుర్రాళ్లలో ఐపీఎల్ 2020 సందడి కనిపిస్తోంది. తమ ఫేవరెట్ మ్యాచ్‌ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. క్రికెట్ మ్యాచ్‌లు అనగానే యూత్‌లో ఎక్కువగా వినిపించే పేరు డ్రీమ్11. ఫ్యాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్ ఇది. ఇందులో యూజర్లు తమకు నచ్చిన ప్లేయర్స్‌తో ఓ టీమ్‌ను రూపొందిస్తారు. కెప్టెన్, వైస్ కెప్టెన్‌, బౌలర్స్, బ్యాట్స్‌మెన్, కీపర్‌లను సెలెక్ట్ చేసి బెస్ట్ టీమ్ ఎంపిక చేస్తారు. ఆ తర్వాత రిజిస్టర్ చేసుకొని కాంటెస్ట్‌లో పాల్గొంటారు. ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్‌లతో పాటు జరగబోయే మ్యాచ్‌లకు టీమ్స్‌ను సెలెక్ట్ చేస్తారు. ఇందులో సెలెక్ట్ చేసిన ప్లేయర్స్ క్రికెట్ మ్యాచ్‌లో పెర్ఫామ్ చేసేదాన్ని బట్టి యూజర్లు డబ్బులు గెలుచుకుంటారు. ఐసీసీ టోర్నమెంట్లతో పాటు ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంలో డ్రీమ్11 ఫ్యాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్‌కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అయితే దీనిపై వివాదం కూడా ఉంది. ఇది గ్యాంబ్లింగ్ అన్న ఆరోపణలు ఓవైపు ఉంటే, ఇదంతా స్కిల్స్‌కు సంబంధించిన గేమ్ అన్న వాదన కూడా ఉంది.

Jio IPL Plans: స్మార్ట్‌ఫోన్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు చూడాలా? జియో క్రికెట్ ప్లాన్స్ ఇవే

SBI Loan: ఈఎంఐ కట్టలేకపోతున్నవారికి ఎస్‌బీఐ నుంచి అద్భుతమైన అవకాశం

IPL 2020, dream11 tax, dream11 tax policy, dream11 tax details, dream11 tax rules, dream11 tax refund, dream11 team, ఐపీఎల్ 2020, డ్రీమ్11 ట్యాక్స్ రూల్స్, డ్రీమ్11 పన్ను నిబంధనలు

ఇదంతా బాగానే ఉంది కానీ డ్రీమ్11 లో డబ్బులు గెలుచుకునేవారు గుర్తుంచుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఆ విషయాలు మర్చిపోతే చిక్కుల్లో పడే అవకాశముంది. డ్రీమ్11లో గెలుచుకునే డబ్బులకు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఈ విషయం డ్రీమ్11 ట్యాక్స్ పాలసీలో వివరించింది. ఆ వివరాల ప్రకారం యూజర్లు ఒక కాంటెస్ట్‌లో రూ.10,000 కన్నా ఎక్కువ గెలుచుకుంటే 30% ట్యాక్స్ డిడెక్టెడ్ ఎట్ సోర్స్ వర్తిస్తుంది. అంటే రూ.10,000 కన్నా ఎంత ఎక్కువ గెలుచుకున్నా 30% పన్ను చెల్లించాల్సిందే. ఆదాయపు పన్ను చట్టం-1961 ఈ ట్యాక్స్ నియమాలు వర్తిస్తాయి. ట్యాక్స్ మినహాయించిన తర్వాత మిగిలిన డబ్బు డ్రీమ్ 11లోని 'విన్నింగ్స్'లో క్రెడిట్ అవుతుంది. ఈ డబ్బును విత్‌డ్రా చేసుకుంటే అదనంగా ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. పన్ను చెల్లించినవారికి డబ్బు గెలుచుకున్న మూడు నెలల్లో టీడీఎస్ సర్టిఫికెట్ వస్తుంది. టీడీఎస్ డిడక్షన్ కాకుండా ఇన్‌కమ్ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్స్ లాంటివి వర్తిస్తే వాటిని యూజర్లు తప్పనిసరిగా చెల్లించాలి.

Gold Loan: గోల్డ్ లోన్ కట్టలేకపోతున్నారా? ఈ ఆప్షన్స్ మీకోసమే

SBI ATM: అలర్ట్... ఎస్‌బీఐ ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తున్నారా? కొత్త రూల్ తెలుసుకోండి

IPL 2020, dream11 tax, dream11 tax policy, dream11 tax details, dream11 tax rules, dream11 tax refund, dream11 team, ఐపీఎల్ 2020, డ్రీమ్11 ట్యాక్స్ రూల్స్, డ్రీమ్11 పన్ను నిబంధనలు
ప్రతీకాత్మక చిత్రం


డ్రీమ్11 మాత్రమే కాదు లోకో క్విజ్, రమ్మీ లాంటి ఆన్‌లైన్ గేమ్స్‌, ఆన్‌లైన్ ఫ్యాంటసీ గేమ్స్‌లో డబ్బులు గెలుచుకున్నా ఇవే ట్యాక్స్ నిబంధనలు వర్తిస్తాయి. రియల్ మనీతో సంబంధం ఉన్న ఎలాంటి గేమ్స్‌లో పార్టిసిపేట్ చేసి ప్రైజ్ మనీ గెలుచుకున్నా, యూజర్లు పన్ను చెల్లించక తప్పదు. 30% ట్యాక్స్‌తో పాటు 1.2 శాతం సెస్ చెల్లించాల్సి ఉంటుంది. "ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 115బీబీ ప్రకారం లాటరీలు, క్రాస్‌వర్డ్ పజిల్స్, గుర్రపు పందేలు, కార్డ్ గేమ్స్, ఇతర గేమ్స్, గ్యాంబ్లింగ్, బెట్టింగ్ లాంటి వాటి ద్వారా గెలుచుకునే మొత్తాన్ని 'ఇతర మార్గాల ద్వారా వచ్చిన ఆదాయం'గా పరిగణిస్తారు" అని మనోహర్ చౌదరీ అండ్ అసోసియేట్స్ పార్ట్‌నర్ అయిన అమీత్ పటేల్ మనీకంట్రోల్‌కు వివరించారు. అయితే ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేప్పుడు అప్పటికే వీటిపై పన్ను చెల్లించినట్టైతే యూజర్లు కంగారు పడాల్సిందేమీ లేదు. "కంపెనీలు మీకు పేమెంట్ చేసేప్పుడే 30 శాతం పన్నును డిడక్ట్ చేస్తాయి. అయితే అంతటితో మీ లావేదేవీ పూర్తి కాదు. మీ ట్యాక్స్ రిటర్న్స్‌లో ఆ ఆదాయం గురించి వివరించాలి" అని ముంబైకి చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ మెహూల్ షేఠ్ మనీకంట్రోల్‌కు తెలిపారు.

IPL 2020: ఈ ఎయిర్‌టెల్, జియో ప్లాన్స్ రీఛార్జ్ చేస్తే ఐపీఎల్ ఫ్రీగా చూడొచ్చు

PF Balance: తెలుగులో మీ పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోండి ఇలాIPL 2020, dream11 tax, dream11 tax policy, dream11 tax details, dream11 tax rules, dream11 tax refund, dream11 team, ఐపీఎల్ 2020, డ్రీమ్11 ట్యాక్స్ రూల్స్, డ్రీమ్11 పన్ను నిబంధనలు
ప్రతీకాత్మక చిత్రం


ఇలా గేమ్స్ ద్వారా గెలుచుకున్న డబ్బు వివరాలను ట్యాక్స్ రిటర్న్స్‌లో వివరించకపోతే చిక్కులు తప్పవు. ఎందుకంటే ఈ గేమ్స్‌లో పార్టిసిపేట్ చేయాలంటే సదరు కంపెనీలు మీ పాన్ కార్డు వివరాలను తీసుకుంటాయి. ఆదాయపు పన్ను శాఖ అధికారులు మీ పాన్ కార్డు ద్వారా జరిగిన లావాదేవీలను చెక్ చేసినప్పుడు మీరు డబ్బు గెలుచుకున్నారన్న విషయం వారికి తెలుస్తుంది. మీ ఫామ్ 26ఏఎస్ లేదా యాన్యువల్ ట్యాక్స్ స్టేట్‌మెంట్‌లో ఈ వివరాలన్నీ ఉంటాయి. ఒకవేళ మీరు వివరాలు సరిగ్గా వెల్లడించకపోతే ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారుల నుంచి నోటీసులు వచ్చే అవకాశం ఉంటుంది. రూ.5 లక్షల వరకు ఆదాయానికి పన్ను మినహాయింపు ఉంటుందని, అందులో ఈ ప్రైజ్ మనీని అడ్జెస్ట్ చేయొచ్చనుకుంటే పొరపాటే. గేమ్స్ ద్వారా గెలుచుకున్న మొత్తంపై ఖచ్చితంగా ట్యాక్స్ చెల్లించాల్సిందే. రూ.10,000 కన్నా ఎక్కువ గెలుచుకుంటేనే 30 శాతం ట్యాక్స్ వర్తిస్తుంది.

(ఈ ఆర్టికల్ మొదట Moneycontrol వెబ్‌సైట్‌లో పబ్లిష్ అయింది. ఒరిజినల్ ఆర్టికల్‌ను ఇక్కడ చదవొచ్చు.)
Published by: Santhosh Kumar S
First published: September 19, 2020, 12:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading