IPHONE SE 3 AND IPHONE 12S PRO LIKELY TO LAUNCH IN 2021 MK GH
iPhone: త్వరలోనే ఆపిల్ నుంచి మరో రెండు ఐఫోన్ లు లాంచ్..ఓ లుక్కేయండి
(ప్రతీకాత్మక చిత్రం)
ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ తన ఐఫోన్ 12 సిరీస్ ఫోన్లతో గతేడాది సందడి చేసింది. ఈ ఏడాదిలో ఐఫోన్ 13 సిరీస్ ను మార్కెట్లోకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. దీనితో పాటు ఈ ఏడాది ఐఫోన్ ఎస్ఈ 3, ఐఫోన్ 12ఎస్ ప్రో పేరుతో మరో రెండు స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్దమవుతోంది.
ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ తన ఐఫోన్ 12 సిరీస్ ఫోన్లతో గతేడాది సందడి చేసింది. ఈ ఏడాదిలో ఐఫోన్ 13 సిరీస్ ను మార్కెట్లోకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. దీనితో పాటు ఈ ఏడాది ఐఫోన్ ఎస్ఈ 3, ఐఫోన్ 12ఎస్ ప్రో పేరుతో మరో రెండు స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్దమవుతోంది. అయితే, ఈ రెండు మోడళ్లకు స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధరపై అనేక ఊహాగాణాలు వినిపిస్తున్నాయి. ఇటీవలే వీటికి సంబంధించిన కీలక సమాచారం ఆన్లైన్లో వైరల్ అవుతుంది. ఐఫోన్ SE 3 దాని మునుపటి సిరీస్‌ల కంటే అనేక అప్డేట్లతో ముందుకొస్తుందని లీకైన సమాచారం బట్టి తెలుస్తోంది. కాగా, డిజైన్ పరంగా చూస్తే ఐఫోన్ 12S ప్రో, ఐఫోన్ 12 ప్రోను పోలి ఉంటుందని తెలుస్తోంది. అంతేకాక, ఐఫోన్ 12 ఎస్ ప్రో ఫీచర్లు ఐఫోన్ 13 ప్రోతో సమానంగా ఉండే అవకాశం ఉంది. 2020లో విడుదలైన ఐఫోన్ SE స్మార్ట్ ఫోన్ కు భారత మార్కెట్లో అనూహ్య స్పందన లభించిన విషయం తెలిసిందే. బీఫీ చిప్సెట్తో వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ లో కెమెరా సిస్టమ్, బ్యాటరీ లైఫ్ ను అందించింది ఆపిల్ సంస్థ. ఇక లీకైన సమాచారం ప్రకారం, ఐఫోన్ ఎస్ఈ3, ఐఫోన్ 12ఎస్‌లో ఉండే స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర వంటి వివరాలపై ఓలుక్కేయండి.
ఐఫోన్ SE 3 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆన్ లైన్లో లీకైన సమాచారం ప్రకారం, ఐఫోన్ SE 3 బ్రెజర్ లెస్ డిస్ ప్లే, పంచ్-హోల్ కెమెరాలతో రానున్నట్లు తెలుస్తోంది. అంతేకాక, దీనిలో ఐఫోన్ 12లో ఉన్న విధంగా ఫ్లాట్ డిజైన్ కూడా ఉండే అవకాశం ఉంది. ఈ డివైజ్ వెనుకవైపు ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్న సింగిల్ కెమెరా సెన్సార్, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉండనుంది. వీటిని టచ్ ఐడిగా మార్చుకునే సౌకర్యం ఉంటుంది. అంతేకాక, ఇది 5.4- అంగుళాల హై-రిజల్యూషన్ ఐపిఎస్ ఎల్సిడి ప్యానల్‌తో వస్తుంది. ఇది ఆపిల్ A14 బయోనిక్ చిప్సెట్తో పాటు 4GB ర్యామ్‌తో పనిచేస్తుందని నివేదికలు సూచిస్తున్నాయి. ఐఫోన్ SE 3 డివైజ్- 64GB, 128GB, 256GB మూడు స్టోరేజ్ వేరియంట్లతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఐఫోన్ 12 ఎస్ ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆన్లైన్లో లీకైన సమాచారం ప్రకారం, ఐఫోన్ 12 ఎస్ ప్రోలో డచ్ టెక్ బ్లాగ్ లెట్స్‌గో డిజిటల్, కాన్సెప్ట్ క్రియేటర్ వంటి ఫీచర్లను జోడించనున్నట్లు తెలుస్తోంది. దీనిలోని ఫీచర్లు కూడా ఐఫోన్ 12 ప్రోతో సమానంగా ఉండనున్నాయి. అయితే ఐఫోన్ 12 ప్రోలో ఉపయోగించిన నాచ్ స్థానంలో స్పీకర్ గ్రిల్, సెల్ఫీ షూటర్ వంటి వాటిని చేర్చనుంది. ఈ డివైజ్ వెనుక భాగంలో ఐఫోన్ 12 ప్రో మాదిరిగా ట్రిపుల్ బ్యాక్ సెటప్‌ను చేర్చనున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్ 12 ఎస్ ప్రో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో, 6.1- అంగుళాల ఒఎల్ఇడి ప్యానెల్‌తో వస్తుంది. యూజర్ రికగ్నిషన్ కొరకు దీనిలో ఫేస్-ఐడితో పాటు డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను పొందుపర్చనున్నట్లు తెలుస్తోంది.- ప్రతి సంవత్సరం, ఆపిల్ తన పరికరాల్లో కొత్త చిప్‌సెట్‌ను జోడిస్తుంది. ఈ ఏడాది విడుదల కానున్న ఐఫోన్ 12 ఎస్ ప్రోలో కూడా అదే జరగనున్నట్లు ఆశిస్తున్నారు. దీనిలో A15 బయోనిక్ చిప్‌సెట్‌ను ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. దీనిలో అల్ట్రావైడ్ సెన్సార్‌ను వాడనున్నారు. దీని కెమెరాలు మాత్రం ఐఫోన్ 12 మాదిరిగానే ఉంటాయని తెలుస్తోంది.
భారత్ లో ఎప్పుడు లాంచ్?
ఆపిల్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఫోన్ 13తో పాటు ఐఫోన్ఎస్ఈ 3, ఐఫోన్ 12 ఎస్ ప్రో మోడళ్లు సెప్టెంబర్‌లో భారత మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ రెండు మెడళ్లు 64GB, 128GB, 256GB, 512GB నాలుగు వేర్వేరు స్టోరేజ్ వేరియంట్లలో విడుదల కానున్నాయి. ఈ మొడళ్లు గెలాక్సీ ఎస్ 21 +, పిక్సెల్ 6, వన్‌ప్లస్ 9 స్మార్ట్ఫోన్లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. కాగా, లీకైన సమచారం ప్రకారం, ఐఫోన్ SE 3 ప్రారంభ ధర రూ .40,999 వద్ద, ఐఫోన్ 12 ఎస్ ప్రో రూ.1,20,000 ల వద్ద ఉండే అవకాశం ఉంది.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.