Home /News /business /

IPHONE 12 SERIES CREATES RECORD IPHONE 12 MINI IPHONE 12 PRO AND IPHONE 12 PRO MAX SALES CROSS 100 MILLION UNITS IN JUST 7 MONTHS GH SK

iPhone 12 series: 7 నెలల్లో 10 కోట్ల యూనిట్ల అమ్మకాలు.. ఐఫోన్ 12 సిరీస్​ సరికొత్త రికార్డు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కౌంటర్ పాయింట్ రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం.. ఐఫోన్ 12 సిరీస్​ ఫోన్ల అమ్మకాల్లో ఐఫోన్ 12 ప్రో మాక్స్ మోడల్ అత్యధికంగా అమ్ముడైంది. మొత్తం అమ్మకాల్లో ఇది 29 శాతం కలిగి ఉంది.

ప్రపంచవ్యాప్తంగా యాపిల్​ కంపెనీ ఉత్పత్తులకు ఉండే ఆదరణ అంతా ఇంతా కాదు. ప్రీమియం రేంజ్​ స్మార్ట్​ఫోన్లలో యాపిల్ ఐఫోన్లకు మార్కెట్​లో విపరీతమైన డిమాండ్​ ఉంటుంది. దీన్ని క్యాష్​ చేసుకునేందుకు యాపిల్​ సంస్థ ప్రతి ఏడాది వరుసగా స్మార్ట్​ఫోన్లను విడుదల చేస్తుంది. సంస్థ గతేడాది విడుదల చేసిన ఐఫోన్​ 12 సిరీస్​కు కొనసాగింపుగా ఈ ఏడాది చివరికల్లా ఐఫోన్​ 13 సిరీస్​ని లాంచ్​ చేయాలని యోచిస్తోంది. ఇదిలా ఉంటే, గతేడాది విడుదలైన ఐఫోన్ 12 సిరీస్ స్మార్ట్​ ఫోన్లు అమ్మకాల్లో రికార్డు బద్దలు కొట్టాయి. ఐఫోన్ 12, ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 12 ప్రో, ఐఫోన్ 12 ప్రో మాక్స్ నాలుగు వేరియంట్ల అమ్మకాలు100 మిలియన్ యూనిట్ల మార్కును దాటాయి. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ప్రకారం ఐఫోన్ 12 సిరీస్ ప్రారంభించిన కేవలం ఏడు నెలల్లోనే ఈ ఘనతను సాధించగలిగింది. 2021 ఏప్రిల్‌ చివరికల్లా పది కోట్ల మార్కును తాకిందని నివేదిక పేర్కొంది.

5G సపోర్ట్, OLED డిస్​ప్లే, ఆల్-టైమ్ హై యావరేజ్ సెల్లింగ్ ప్రైజ్​ వంటి ఫీచర్ల కారణంగా ఐఫోన్ 12 సిరీస్​కు విపరీతమైన క్రేజ్ ఏర్పడిందని నివేదిక స్పష్టం చేసింది. కాగా, ఇదే 100 మిలియన్ల మైలురాయిని చేరుకోవడానికి ఐఫోన్ 11కు తొమ్మిది నెలల సమయం పట్టింది. కానీ, ఐఫోన్​ 12 మాత్రం కేవలం 7 నెలల్లోనే ఈ అమ్మకాలను చేరుకోగలిగింది. ఐఫోన్​ 11తో పోలిస్తే ఐఫోన్​ 12లో గణనీయమైన ఫీచర్లను చేర్చడమే ఈ డిమాండ్​కు గల ఏకైక కారణంగా చెప్పవచ్చు. కాగా, ఐఫోన్​ 12తో పోలిస్తే ఐఫోన్​ 12 ప్రో, ప్రో మాక్స్ మోడళ్లకు వినియోగదారుల నుంచి గణనీయమైన రెస్పాన్స్​ వచ్చిందని కౌంటర్ పాయింట్ నివేదిక స్పష్టం చేసింది.

కేవలం 7 నెలల్లోనే 10కోట్లల మార్కు..

కౌంటర్ పాయింట్ రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం.. ఐఫోన్ 12 సిరీస్​ ఫోన్ల అమ్మకాల్లో ఐఫోన్ 12 ప్రో మాక్స్ మోడల్ అత్యధికంగా అమ్ముడైంది. మొత్తం అమ్మకాల్లో ఇది 29 శాతం కలిగి ఉంది. అదే ఐఫోన్ 11ప్రో మాక్స్ విషయానికి వస్తే.. మొత్తం అమ్మకాల్లో 25 శాతం వాటా సాధించింది. ఐఫోన్​ 12 సిరీస్​లో ప్రో మాక్స్ మోడల్​కు వినియోగదారులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం వల్ల, దాని ముందు సిరీస్ కంటే 22 శాతం ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించగలిగిందని నివేదిక స్పష్టం చేసింది. కాగా, ఐఫోన్​ 12 రిటైల్ బాక్స్‌లో ఛార్జర్ అందించలేదు. ఈ నేపథ్యంలో యాపిల్​పై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. ఇది తెలివైన చర్య కాదని, దీని వల్ల అమ్మకాలు తగ్గుతాయని టెక్​ నిపుణులు అంచనా వేశారు. అయినప్పటికీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ గణనీయమైన అమ్మకాలను నమోదు చేయడం విశేషం.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Apple, Iphone, Mobiles, Technology

తదుపరి వార్తలు