Home /News /business /

INVESTORS LOST NEARLY 17 LAKH CRORES IN SEVEN DAYS BUT WHERE DOES THE MONEY GOES AK

Stock Market Crash: 7 రోజుల్లో రూ. 17 లక్షల కోట్లు హాంఫట్.. ఈ డబ్బంతా ఎక్కడికి వెళుతుందో తెలుసా..?

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Stock Market: బీఎస్‌ఈలో లిస్టయిన కంపెనీల మార్కెట్ విలువ జనవరి 17న రూ. 280.02 లక్షల కోట్లు కాగా, జనవరి 25 నాటికి రూ.262.78 లక్షల కోట్లకు తగ్గింది.

    స్టాక్ మార్కెట్ పతనం వల్ల లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయిందనే వార్తలు మనం తరచూ వింటుంటాం. కొద్దిరోజుల నుంచి స్టాక్ మార్కెట్‌లో వరుస పతనాల కారణంగా మరోసారి ఇదే జరుగుతోంది. అయితే ఇన్వెస్టర్లు నష్టపోయిన ఈ డబ్బు ఎక్కడికి వెళుతుంది ? ఎవరికి లాభంగా మారుతుంది ? వాస్తవానికి షేర్ విలువ దాని కంపెనీ పనితీరు, నష్టం, లాభాన్ని అంచనా వేయడంపై ఆధారపడి ఉంటుంది. భవిష్యత్తులో కంపెనీ మెరుగైన పనితీరు కనబరుస్తుందని పెట్టుబడిదారులు, మార్కెట్ విశ్లేషకులు భావిస్తే.. షేర్ల కొనుగోలు పెరుగుతుంది. మార్కెట్‌లో డిమాండ్ కూడా పెరుగుతుంది. అదేవిధంగా ఏదైనా కంపెనీకి భవిష్యత్తులో లాభాలు తగ్గుతాయని లేదా వ్యాపారంలో మందగమనం ఉంటుందని అంచనా వేసినట్టయితే.. దాని షేర్ల ధరలు తగ్గిపోతాయి. మార్కెట్ డిమాండ్ సరఫరా సూత్రంపై పనిచేస్తుంది. అందువల్ల రెండు సందర్భాల్లో షేర్ల విలువ పెరగడం లేదా తగ్గుతుంది.

    మార్కెట్‌లో నిజమైన డబ్బు ఉండదు. స్టాక్ విలువ మాత్రమే ఉంటుంది.. ఈరోజు రూ. 100 పెట్టి కొనుగోలు చేసిన షేరు విలువ రూ. 80 తగ్గితే మీరు రూ. 20 నష్టపోతారు. ఈ షేర్లను అమ్మేసినప్పుడు మీరు నష్టాలను చవిచూస్తారు. అయితే వాటిని కొనుగోలు చేసిన వ్యక్తికి నేరుగా ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఆ షేర్ విలువ మళ్లీ మళ్లీ రూ.100కి పెరిగితేనే.. దాన్ని కొనుగోలు చేసిన వ్యక్తికి రూ. 20 రూపాయల లాభం వస్తుంది.

    స్టాక్ మార్కెట్ అనేది సెంటిమెంట్ గేమ్ అని అంటుంటారు. పెట్టుబడిదారుల మనోభావాల ఆధారంగా స్టాక్ ధర నిర్ణయించబడుతుంది. ఉదాహరణకు ఒక కంపెనీ క్యాన్సర్ ఔషధం తయారీకి పేటెంట్ పొందినట్లయిత.. భవిష్యత్తులో దాని వ్యాపారం, ఆదాయాలు ఖచ్చితంగా పెరుగుతాయని పెట్టుబడిదారులు భావిస్తున్నారు. ఈ నమ్మకం కారణంగా ఆ కంపెనీ షేర్లను కొనుగోలు చేయడం ప్రారంభిస్తారు. మార్కెట్‌లో డిమాండ్ పెరగడంతో ధరలు పెరగడం మొదలవుతాయి.

    Indian Post Office: మీకు పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ ఉందా.. అయితే ఇది తప్పక తెలుసుకోండి..

    Home Loans: హోమ్ లోన్స్‌పై ఎక్కువ ట్యాక్స్ డిడక్షన్స్.. కొత్త బడ్జెట్‌లో యాన్యువల్ లిమిట్ పెంచే అవకాశం..

    7 రోజుల్లో రూ.17.23 లక్షల కోట్లు ఆవిరి...
    మార్కెట్‌లో కొనసాగుతున్న పతనం కారణంగా గత 7 ట్రేడింగ్ రోజుల్లో ఇన్వెస్టర్లు రూ.17.23 లక్షల కోట్లు నష్టపోయారు. అంటే ఎవరి జేబులోకి కాకుండా కంపెనీల వాల్యుయేషన్ తగ్గడంతో ఈ సొమ్ము గాలిలో కలిసిపోయింది. బీఎస్‌ఈలో లిస్టయిన కంపెనీల మార్కెట్ విలువ జనవరి 17న రూ. 280.02 లక్షల కోట్లు కాగా, జనవరి 25 నాటికి రూ.262.78 లక్షల కోట్లకు తగ్గింది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Stock Market

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు