హోమ్ /వార్తలు /బిజినెస్ /

Stock Market: కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. 15 నిమిషాల్లో రూ.5లక్షల కోట్లు ఫట్

Stock Market: కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. 15 నిమిషాల్లో రూ.5లక్షల కోట్లు ఫట్

బలహీనమైన అంతర్జాతీయ సంకేతాల కారణంగా సోమవారం సెన్సెక్స్, నిఫ్టీ రెండూ 1.50 శాతానికి పైగా పతనాన్ని చూశాయి. దాదాపు అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ఉన్నాయి.

  దేశీయ స్టాక్‌ మార్కెట్లు (Stock Market) కుప్పకూలాయి. ఈ వారం భారీ నష్టాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. బలహీనమైన అంతర్జాతీయ సంకేతాల కారణంగా సోమవారం సెన్సెక్స్ (sensex), నిఫ్టీ(Nifty) రెండూ 1.50 శాతానికి పైగా పతనాన్ని చూశాయి. ఈ రోజు ఉదయం 9.32 సమయంలో సెన్సెక్స్‌ 1070 పాయింట్లు కుంగి 55,940 వద్ద, నిఫ్టీ 327 పాయింట్ల నష్టంతో 16,657 వద్ద ట్రేడయ్యాయి. దాదాపు అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ఉన్నాయి. ఉదయం 11.00 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 1314 పాయింట్లు కుంగి 55,697 వద్ద, నిఫ్టీ 395 పాయింట్లు దిగజారి 16,589 వద్ద కొనసాగుతున్నాయి. నిఫ్టీ బ్యాంక్‌ సూచీ 3.54శాతం మేర పతనమైంది. లోహ, రియల్టీ, ఆటోమొబైల్‌, బ్యాంకింగ్‌ సూచీలు భారీగా కుదేలవుతున్నాయి. అత్యధికంగా రియాల్టీ రంగం 3.45శాతం, లోహ రంగం 3.10శాతం నష్టాలపాలయ్యాయి.

  petrol and diesel rates: స్థిరంగానే పెట్రోల్​, డీజిల్​ ధరలు.. ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్​ ధరలు ఎలా ఉన్నాయంటే..

  ద్రవ్యోల్భనానికి సంబంధించిన భయాలు, ఒమిక్రాన్‌ కేసుల పెరుగుదల స్టాక్ మార్కెట్ పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. వరి, గోధుమ, శనగలు, ఆవాలు, సోయాబీన్స్‌, ముడి పామాయిల్‌, పెసర్ల కమోడిటీ ట్రేడింగ్‌ను ఏడాది పాటు నిలిపివేయాలని కేంద్రం విడుదల చేసిన ఆదేశాలు సూచీలపై తీవ్ర ప్రభావం చూపించాయి. దీనికి తోడు విదేశీ సంస్థాగత మదుపరులు పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం సూచీల సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీసిందని చెప్పొచ్చు.

  Gold Price Today: మగువలకు గుడ్​న్యూస్​.. బంగారం ధరలు తగ్గుముఖం.. అదే బాటలో వెండి ధరలూ.. తులం బంగారం ఎంతంటే..

  బ్యాంక్, ఆటో, ఐటీ, మెటల్, రియాల్టీ సహా అన్ని రంగాల పతనం కారణంగా ప్రారంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 1150 పాయింట్లకు పైగా పడిపోయింది. నిఫ్టీ 16,700 దిగువకు పడిపోయింది. ట్రేడింగ్‌ ఆరంభంలోనే మార్కెట్లు కుప్పకూలాయి. ఇన్వెస్టర్ల సంపద 15 నిమిషాల్లోనే రూ. 6 లక్షల కోట్లకు పైగా పడిపోవడం ఆందోళన కలిగించే అంశంగా మారింది.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

  First published:

  Tags: Nifty, Sensex, Stock Market

  ఉత్తమ కథలు