హోమ్ /వార్తలు /బిజినెస్ /

Investments: రూల్ బేస్డ్ యాక్టివ్ ఇన్వెస్టింగ్ అంటే ఏంటి..? ఇది సంప్రదాయ పెట్టుబడికి ఎలా భిన్నంగా ఉంటుంది..? తెలుసుకోండి..

Investments: రూల్ బేస్డ్ యాక్టివ్ ఇన్వెస్టింగ్ అంటే ఏంటి..? ఇది సంప్రదాయ పెట్టుబడికి ఎలా భిన్నంగా ఉంటుంది..? తెలుసుకోండి..

స్టాక్ మార్కెట్‌ ఇన్వెస్ట్‌మెంట్స్ ఏటా పెరుగుతున్న తరుణంలో, ఇన్వెస్ట్‌మెంట్ ప్లానర్లు కొత్త రకం పెట్టుబడి ప్రమాణాలను ప్రజలకు సూచిస్తున్నారు. ఇలాంటి వాటిలో రూల్ బేస్డ్ యాక్టివ్ ఇన్వెస్టింగ్ విధానం ఒకటి.

స్టాక్ మార్కెట్‌ ఇన్వెస్ట్‌మెంట్స్ ఏటా పెరుగుతున్న తరుణంలో, ఇన్వెస్ట్‌మెంట్ ప్లానర్లు కొత్త రకం పెట్టుబడి ప్రమాణాలను ప్రజలకు సూచిస్తున్నారు. ఇలాంటి వాటిలో రూల్ బేస్డ్ యాక్టివ్ ఇన్వెస్టింగ్ విధానం ఒకటి.

స్టాక్ మార్కెట్‌ ఇన్వెస్ట్‌మెంట్స్ ఏటా పెరుగుతున్న తరుణంలో, ఇన్వెస్ట్‌మెంట్ ప్లానర్లు కొత్త రకం పెట్టుబడి ప్రమాణాలను ప్రజలకు సూచిస్తున్నారు. ఇలాంటి వాటిలో రూల్ బేస్డ్ యాక్టివ్ ఇన్వెస్టింగ్ విధానం ఒకటి.

  • Trending Desk
  • Last Updated :
  • Telangana, India

Bijon Pani, Chief Investment Officer at NJ Asset Management Pvt. Ltd

స్టాక్ మార్కెట్‌ ఇన్వెస్ట్‌మెంట్స్(Stock Market Investment) ఏటా పెరుగుతున్న తరుణంలో, ఇన్వెస్ట్‌మెంట్ ప్లానర్లు కొత్త రకం పెట్టుబడి ప్రమాణాలను ప్రజలకు సూచిస్తున్నారు. ఇలాంటి వాటిలో రూల్ బేస్డ్ యాక్టివ్ ఇన్వెస్టింగ్(Investing) విధానం ఒకటి. ఇప్పటికే నిర్వచించిన కొన్ని కొలమానాల ప్రకారం స్టాక్‌లను ఎంచుకునే పద్దతిని ఇది సూచిస్తుంది. ఈ విధానంలో స్టాక్‌లను(Stocks) ఎంచుకునేటప్పుడు ఎలాంటి ఎమోషనల్ బయాస్ లేదా విచక్షణ ఉండదు. పెట్టుబడుల విషయంలో అనేక రూల్ బేస్డ్ మోడల్స్(Models) ఉన్నాయి. CAPM మోడల్‌, ఫాక్టర్ ఇన్వెస్టింగ్ వంటివి చాలామందికి తెలిసినవే. అయితే విద్యావేత్తలు 300కి పైగా ప్యారామీటర్స్‌పై రిసెర్చ్ చేసి, వీటిని ఐదు ఈక్విటీ ఫ్యాక్టర్స్‌గా వర్గీకరించారు. అవి వాల్యూ, క్వాలిటీ, లో వోలటైలిటీ, మొమెంటమ్, సైజ్. వీటిలో ప్రతి ఫ్యాక్టర్.. రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్‌ల విభిన్న మూలాన్ని అందిస్తుంది. షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ ఆలోచనలను ఇది మానిటర్ చేస్తుంది. తద్వారా ఇన్వెస్టర్లకు రిస్క్, రివార్డ్ బిహేవియర్‌పై అవగాహన పెంచుతుంది.

IGNOU Admissions 2022: ఇగ్నోలో ప్రవేశాలకు దరఖాస్తు గడువు మరోసారి పెంపు.. ఎప్పటివరకంటే..

ఫ్యాక్టర్ కన్‌స్ట్రక్షన్ అనేది కంపెనీల ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్స్, స్టాక్స్ ధరలకు సంబంధించిన సమాచారాన్ని కలిగి ఉన్న పెద్ద డేటాసెట్స్‌ను ఉపయోగించే ప్రక్రియ. ఈ మోడల్స్ వివిధ బిజినెస్ సైకిల్స్‌లో పటిష్టంగా పనిచేస్తుందని, లాంగ్ టర్మ్‌లో రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్‌ స్థిరంగా ఉంటుందని నిర్ధారణ అయింది. బలమైన డేటా, అందుబాటులో ఉన్న కంప్యూటింగ్ పవర్ సాయంతో అధిక సంఖ్యలో కంపెనీలను చాలా త్వరగా విశ్లేషించడానికి, స్టాక్‌ల పోర్ట్‌ఫోలియోను ఎంచుకోవడానికి రూల్ బేస్డ్ మేనేజర్‌కు అవకాశం కలుగుతుంది.

* సంప్రదాయ పెట్టుబడికి ఎలా భిన్నంగా ఉంటుంది?

సంప్రదాయ పెట్టుబడి విధానంలో సాధారణంగా విచక్షణతో కూడిన ఫండ్ మేనేజర్, విశ్లేషకుల బృందం ఉంటుంది. వారు కవర్ చేస్తున్న రిసెర్చ్ కంపెనీలకు మార్కెట్ వార్తలు, సంబంధిత ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్‌ విశ్లేషిస్తారు. ఈ పరిశోధన ఆధారంగా ఫండ్ మేనేజర్ పోర్ట్‌ఫోలియోను నిర్మించడానికి స్టాక్‌లను ఎంచుకుంటారు. ఈ సందర్భంలో పోర్ట్‌ఫోలియో నిర్మాణం సాధారణంగా ముందుగా నిర్వచించిన నియమాల ప్రకారం కాకుండా, ఎక్కువగా ఫండ్ మేనేజర్ విచక్షణపై ఆధారపడి ఉంటుంది. అయితే పెద్ద సంఖ్యలో కంపెనీల సామర్థ్యాలను నిరంతరం విశ్లేషించడం అనేది వీరికి ఒక సవాలుగా ఉంటుంది. అందుకే నిర్వాహకులు తక్కువ కంపెనీలు ఉన్న పూల్‌ను నిర్వహిస్తారు.

విచక్షణతో కూడిన నిర్వాహకులు ముందుకు సాగడానికి నిరంతరం పరిశోధన అవసరం. అలాగే రూల్ బేస్డ్ ఇన్వెస్టింగ్ మోడల్‌లో, పారామీటర్‌లకు స్థిరమైన పర్యవేక్షణ, మార్పు అవసరం. ఈ మోడల్స్ ప్రభావవంతంగా ఉండేలా చూసుకోవడానికి రూల్ బేస్డ్ ఇన్వెస్ట్‌మెంట్ విషయంలో కూడా స్థిరమైన పరిశోధన, పర్యవేక్షణ అవసరం.

AP High Court Jobs: పదో తరగతి అర్హతతో.. ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలు .. జిల్లాల వారీగా పోస్టులు ఇలా..

యాక్టివ్ రూల్ బేస్డ్ ఫండ్స్ ఎందుకు బాగా ప్రాచుర్యం పొందాయి?

ప్రపంచవ్యాప్తంగా యాక్టివ్ రూల్ బేస్డ్ క్వాంటిటేటివ్ ఫండ్స్ అనేవి ఇన్‌స్టిట్యూషనల్, రిటైల్ ఇన్వెస్టర్ అలొకేషన్‌లో ఎక్కువ భాగంగా ఉంటాయి. టాప్ 10లో 7 లార్జెస్ట్ ఆల్టర్నేటివ్ ఫండ్స్ క్వాంటిటేటివ్ మెథడ్స్ ఉపయోగిస్తాయి. సంప్రదాయ ఫండ్‌లు ఇప్పటికీ మొత్తం మ్యూచువల్ ఫండ్ స్పేస్‌లో ఎక్కువ భాగం అయినప్పటికీ, రూల్ బేస్డ్ ఫండ్స్ వాటా వేగంగా పెరుగుతోంది. ఇప్పుడు చాలా మంది పెట్టుబడిదారులకు ఇది గమ్యంగా ఉంది. రూల్స్ సరైన విధానంలో నిర్వచిస్తారు కాబట్టి, ఫండ్‌ను అర్థం చేసుకోవడం సులభతరంగా ఉంటుంది. రూల్ బేస్డ్ ఫండ్స్ జనాదరణ పొందటానికి మరొక కారణం ఉంది. మల్టీ ఫ్యాక్టర్ ఫండ్స్ దీర్ఘకాలికంగా మార్కెట్‌తో పోలిస్తే సున్నితమైన రిస్క్ అడ్జస్టెడ్ రాబడిని అందిస్తాయి.

CAT: క్యాట్‌ ఎగ్జామ్‌లో బెస్ట్ స్కోర్ మీ టార్గెటా..? క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీడింగ్ ప్రిపరేషన్ ఇలా..

* ఏది బెస్ట్ ఆప్షన్?

యాక్టివ్ రూల్ బేస్డ్, ట్రెడిషనల్ మోడల్స్ రెండూ దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు సంపదను సృష్టించగలవు. అయితే యాక్టివ్ రూల్ బేస్డ్ విధానంలో భావోద్వేగ పక్షపాతం (emotional bias) ఉండదు. చాలా కాలం పాటు నియమాలను పరీక్షించవచ్చు. పోర్ట్‌ఫోలియో కోసం స్టాక్స్ ఎలా ఎంపిక చేస్తారనే అంశంపై ఇది పెట్టుబడిదారుడికి అవగాహన అందిస్తుంది. ఈ విధానం సంప్రదాయ పెట్టుబడికి చాలా భిన్నంగా ఉంటుంది కాబట్టి, రూల్ బేస్డ్ ఫండ్‌లకు కేటాయింపు అనేది పెట్టుబడుల్లో డైవర్సిటీని అందిస్తుంది.

First published:

Tags: Bank money, Earn money, Investments, Stock Market

ఉత్తమ కథలు