హోమ్ /వార్తలు /బిజినెస్ /

SIP: నెలకు రూ.1,000 కట్టండి.. రూ.2 కోట్లు మీవే!

SIP: నెలకు రూ.1,000 కట్టండి.. రూ.2 కోట్లు మీవే!

SIP: నెలకు రూ.1,000 కట్టండి.. రూ.2 కోట్లు మీవే!

SIP: నెలకు రూ.1,000 కట్టండి.. రూ.2 కోట్లు మీవే!

MF | చిన్న మొత్తంతోనే భారీ ఫండ్ సొంతం చేసుకోవచ్చు. దీని కోసం మీరు సిప్ చేస్తూ రావాలి. అంటే ప్రతి నెలా క్రమం తప్పకుండా డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి. నెలకు రూ.1000 పొదుపు చేస్తే రూ. 2 కోట్లు పొందొచ్చు. ఇంత భారీ మొత్తం ఎలా పొందొచ్చొ ఒకసారి తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Visakhapatnam

  Mutual Funds: మీరు ధనవంతులు అవ్వాలని అనుకుంటున్నారా? రూ. కోట్లు వెనకేయాలని చూస్తున్నారా? మీకు ప్రతి నెలా వచ్చే జీతం (Salary) ఇంట్లో ఖర్చులకే సరిపోవడం లేదా? మరి రూ. కోట్లు వెనకేయడం ఎలా? అని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. నెలకు రూ.1000 పొదుపు చేస్తే చాలు.. మీరు కోటీశ్వరులు (Crorepati)) అవ్వొచ్చు. లేదంటే మీ పిల్లలను ధనవంతులను చేయొచ్చు. ఎలా అని చూస్తున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. సిప్ చేయాలి. సిప్ అంటే సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. దీంతో మీరు మిలియనీర్ అయిపోవచ్చు. పిల్లల భవిష్యత్ లేదంటే భవిష్యత్ లక్ష్యాల కోసం మీరు వీలైనంత త్వరగా సిప్ (SIP) చేయడం ప్రారంభించాలి.

  రెగ్యులర్ ఇన్వెస్ట్‌మెంట్ ద్వారా మెచ్యూరిటీ సమయంలో భారీ మొత్తం పొందొచ్చు. స్మాల్ ఇన్వెస్ట్‌మెంట్‌తో లార్జ్ ఫండ్ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం. నెలకు రూ. 1000 పొదుపు అనేది చాలా మందికి పెద్ద విషయం కాదని చెప్పుకోవచ్చు. రూ. 1000తో రూ. 2 కోట్లకు పైగా మొత్తం పొందొచ్చు. మ్యూచువల్ ఫండ్స్‌లో నెలకు రూ. 1000 ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లాలి. గత కొన్నేళ్లలో చాలా మ్యూచువల్ ఫండ్స్ 20 శాతం వరకు రాబడిని అందించాయి.

  రూ.30 వేలకే తులం బంగారం.. కొంటే కలిగే లాభాలివే.. అదొక్కటే మైనస్!

  సిప్ క్యాలిక్యులేర్ ప్రకారం.. మీరు 30 ఏళ్ల పాటు నెలకు రూ. 1000 చొప్పున ఇన్వెస్ట్ చేస్తూ వెలితే 20 శాతం వార్షిక రాబడి ప్రకారం చూస్తే.. మీకు మెచ్యూరిటీ సమయంలో రూ. 2 కోట్లకు పైగా లభిస్తాయి. కాంపౌండింగ్ బెనిఫిట్ ద్వారా మీరు ఈ భారీ మొత్తం పొందొచ్చు. అయితే 30 ఏళ్ల పాటు డబ్బులు పెట్టడం అంటే కష్టమైన పనే. కానీ పెద్ద మొత్తం కాదు కనుక ట్రై చేయొచ్చు. పిల్లల భవిష్యత్ కోసం సిప్ చేయడం ప్రారంభిస్తే.. వారి పెళ్లి టైమ్ కల్లా భారీ మొత్తం పొందొచ్చు.

  హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కీలక నిర్ణయం.. కస్టమర్లకు షాక్! ఈరోజు నుంచి..

  ఇకపోతే మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా రిస్క్ ఉంటుంది. అందుకే మీరు డబ్బులు పెట్టేటప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం. లేదంటే డబ్బులు పెట్టినా కూడా తర్వాత ఇబ్బంది పడాల్సి రావొచ్చు. మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్లు కూడా స్టాక్ మార్కెట్ రిస్క్‌కు లోబడే ఉంటాయని చెప్పుకోవాలి. అందుకే డబ్బులు పెట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి. లేదంటే రిస్క్ లేనటువంటి పోస్టాఫీస్ సేవింగ్ స్కీమ్స్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు. వీటిల్లో కచ్చితమైన రాబడి పొందొచ్చు. పీపీఎఫ్ సహా పలు రకాల సేవింగ్స్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు బ్యాంక్‌లో కూడా సేవింగ్ స్కీమ్స్ బెనిఫిట్స్ పొందొచ్చు.

  Published by:Khalimastanvali Khalimastanvali
  First published:

  Tags: Investments, Money, Mutual Funds, PPF, SIP

  ఉత్తమ కథలు