Government Bond: ఈ ప్రభుత్వ బాండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ లాభం

Government Bond | ఎక్కువ వడ్డీ వచ్చే ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్‌లో డబ్బులు దాచుకోవాలనుకుంటున్నారా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI బాండ్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు.

news18-telugu
Updated: August 20, 2020, 3:38 PM IST
Government Bond: ఈ ప్రభుత్వ బాండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ లాభం
Government Bond: ఈ ప్రభుత్వ బాండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ లాభం (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మీరు మీ డబ్బుల్ని ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో కాకుండా ఇంకా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ప్రభుత్వానికి చెందిన బాండ్ మీకు సరైన ఆప్షన్. ఇటీవల ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్స్‌లో వడ్డీ రేట్లు భారీగా తగ్గిపోయాయి. 5 శాతానికి దిగొచ్చాయి. దీంతో పెట్టుబడి పెట్టేందుకు ఇతర మార్గాలను అన్వేషిస్తున్నారు ప్రజలు. డబ్బు సేఫ్‌గా ఉండటంతో పాటు వడ్డీ కూడా ఎక్కువ రావాలని కోరుకునేవారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI ఫ్లోటింగ్ రేట్ బాండ్ గురించి ఆలోచించొచ్చు. ఈ బాండ్‌పై ఆర్‌బీఐ 7.15% గ్యారెంటీడ్ రిటర్న్స్ ఇస్తుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లతో పోలిస్తే ఇది ఎక్కువే. డబ్బు కూడా సురక్షితంగా ఉంటుంది. రిస్క్ అస్సలు ఉండదు.

ATM: ఏటీఎం కార్డు మర్చిపోయారా? డబ్బులు డ్రా చేయండి ఇలా

Post Office Savings Account: ప్రభుత్వ సబ్సిడీలు కావాలంటే ఇలా చేయండి

ఆర్‍బీఐ ఫ్లోటింగ్ రేట్ బాండ్‌ను భారతీయులు ఎవరైనా తీసుకోవచ్చు. సింగిల్‌గా లేదా జాయింట్‌గా ఈ బాండ్ తీసుకోవచ్చు. మైనర్ పేరు మీద కూడా బాండ్ తీసుకోవచ్చు. కనీసం రూ.1,000 నుంచి ఎంతవరకైనా పెట్టుబడి పెట్టొచ్చు. ఏడేళ్ల కాల వ్యవధికి ఈ బాండ్లను జారీ చేస్తుంది ఆర్‌బీఐ. ఏడేళ్లు లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. వడ్డీని ఆరు నెలలకోసారి చెల్లిస్తుంది. ప్రతీ ఆరు నెలలకోసారి వడ్డీని రీసెట్ చేస్తుంది ఆర్‌బీఐ. అయితే బాండ్ మెచ్యూరిటీ సమయంలో మొత్తం వడ్డీని ఒకేసారి తీసుకునే అవకాశం మాత్రం లేదు. మీరు ఈ బాండ్ తీసుకునే సమయంలో బ్యాంకు అకౌంట్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. అదే అకౌంట్‌లో వడ్డీ జమ అవుతుంది.

ఈ బాండ్ల ద్వారా వచ్చే వడ్డీపై ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. మీ వార్షికాదాయంలో ఈ వడ్డీని కలిపి లెక్కించాలి. మీ ట్యాక్స్ శ్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాలి. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు హెచ్‍డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ లాంటి ప్రైవేట్ సెక్టార్ బ్యాంకుల్లో ఆర్‌బీఐ బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. రూ.20,000 లోపు నగదు ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చు. అంతకన్నా ఎక్కువ అయితే చెక్ లేదా ఆన్‌లైన్‌లో ఇన్వెస్ట్ చేయాలి. 60 ఏళ్ల కన్నా ఎక్కువ వయస్సు ఉన్నవారు ప్రీ-మెచ్యూర్ విత్‌డ్రాయల్ చేసుకోవచ్చు. 60 నుంచి 70 ఏళ్ల లోపు ఉన్నవారు ఆరేళ్ల తర్వాత, 70 నుంచి 80 ఏళ్ల లోపు ఉన్నవారు ఐదేళ్ల తర్వాత, 80 ఏళ్ల పైన ఉన్నవారు నాలుగేళ్ల తర్వాత విత్‌డ్రా చేసుకోవచ్చు. ప్రీ-మెచ్యూర్ విత్‌డ్రాయల్ చేస్తే వడ్డీలో 50% తక్కువగా వస్తుంది.
Published by: Santhosh Kumar S
First published: August 20, 2020, 3:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading