Ravana Investment Lessons: రావణుడి నుంచి నేర్చుకోవాల్సిన ఫైనాన్షియల్ పాఠాలు ఇవే...

రావణుడి జీవితం నుంచి ఫైనాన్షియల్ పెట్టుబడికి సంబంధించి ఎన్నో గుణపాఠాలు నేర్చుకోవచ్చు. పెట్టుబడి ఎక్కడ, ఎలా పెట్టుబడి పెట్టాలి, మీ డబ్బును ఎలా నిర్వహించాలో ప్లాన్ చేసుకోవడం మంచిది. రావణుడి జీవితం నుండి మీరు నేర్చుకోగల పది ప్రత్యేక ఆర్థిక చిట్కాలు మీ కోసం.

news18-telugu
Updated: October 26, 2020, 10:46 PM IST
Ravana Investment Lessons: రావణుడి నుంచి నేర్చుకోవాల్సిన ఫైనాన్షియల్ పాఠాలు ఇవే...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
రావణుడు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన రాజులలో ఒకడు. ఎంతో జ్ఞానం ఉన్న చక్రవర్తిగా పరిగణించబడ్డాడు, కాని అతను చేసిన చిన్న తప్పులతో నాశనమయ్యాడు. అందుకే ఎవరైనా తమ జీవితంలో సరైన నిర్ణయాలతో ముందుకెళ్లడం అనేది చాలా ముఖ్యమైనది. రావణుడి జీవితం నుంచి ఫైనాన్షియల్ పెట్టుబడికి సంబంధించి ఎన్నో గుణపాఠాలు నేర్చుకోవచ్చు. పెట్టుబడి ఎక్కడ, ఎలా పెట్టుబడి పెట్టాలి, మీ డబ్బును ఎలా నిర్వహించాలో ప్లాన్ చేసుకోవడం మంచిది. రావణుడి జీవితం నుండి మీరు నేర్చుకోగల పది ప్రత్యేక ఆర్థిక చిట్కాలు మీ కోసం. ఈ చిట్కాలు లంకాధిపతి లాగా జీవితంలో చేసిన తప్పులను పునరావృతం చేయకుండా మిమ్మల్ని హెచ్చరిస్తాయి.

అహంకారంతో నిర్ణయాలు తీసుకోవద్దు..

రావణుడి అహంకారం అతని పతనానికి కారణం. మీరు స్టాక్‌లో పెట్టుబడి పెట్టే ముందు లేదా ఆస్తిని కొనే ముందు అహంకారం తగదు. ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అలాగే మీకు నష్టం వస్తుందంటే షేర్లను కానీ, ఆస్తిని కానీ విక్రయించడానికి వెనుకాడవద్దు. ఒక వేళ ఆ అమ్మకం మీ అహాన్ని దెబ్బతీస్తుందనే కారణంతో దానిని మీ వద్ద ఉంచుకుంటే, మీ నష్టానికి అవకాశాలు పెరుగుతాయి.

సమాచార శక్తి
రావణుడికి వేద జ్ఞానం ఉండేది. మీరు కూడా దేశీయ మార్కెట్ లేదా గ్లోబల్ ఈవెంట్లపై నిఘా ఉంచకపోతే, మీరు మంచి రాబడి ఇచ్చే ఆస్తులలో పెట్టుబడి పెట్టే అవకాశాన్ని చేజార్చుకుంటారు. ఉదాహరణకు, రియాల్టీ మార్కెట్ వృద్ధి చెందడానికి అవకాశం లేని సమయంలో రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టడం వల్ల అది మీ డబ్బును వృథా చేస్తుంది. కాబట్టి, రావణుడిలా జ్ఞానాన్ని సేకరించండి.

చిన్న పొరపాటు ప్రతిదీ నాశనం చేస్తుంది
రాముడి సతీమణి సీతను అపహరించడం వల్ల రావణుడి మిగతా విజయాలన్నీ నాశనమయ్యాయి. మీరు చాలా సంవత్సరాలుగా ఈక్విటీ ఫండ్‌లో పెట్టుబడులు పెడుతున్నారని అనుకుందాం, కానీ ఆకస్మిక మాంద్యం మిమ్మల్ని భయపెట్టడంతో, అన్ని యూనిట్లను విక్రయించినట్లయితే, మీరు నష్టపోతారు. స్వల్పకాలిక సమస్యల బారిన పడకుండా దీర్ఘకాలిక ఈక్విటీ ఫండ్లలో పెట్టుబడులు పెట్టడం ఉత్తమం అని గుర్తుంచుకోండి.

కుటుంబాన్ని గుడ్డిగా నమ్మవద్దు
రావణుడు తన సోదరుడు విభీషణుడి చేతిలో దారుణంగా మోసపోయాడు. మీ తోబుట్టువులు, పిల్లలు, లేక ఇతర బంధవులు ఎవరైనా సరే మీ ఆర్థిక సలహాల్లోనూ, నిర్ణయాల్లోనూ పూర్తిగా భాగస్వామ్యం చేయాల్సిన అవసరం లేదు. ఆర్థిక విషయాల్లో బంధుప్రీతి కన్నా ఫైనాన్షియల్ ప్లానర్ సలహా తీసుకోండి.

హార్డ్ వర్క్ ముఖ్యం
శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి రావణుడు వేలాది సంవత్సరాలు తపస్సు చేశాడు. మీ డబ్బు ఉన్న పళంగా ఎప్పుడూ రెట్టింపు కాదు. దానికి బదులుగా, మీ కృషి, మీరు ఎంత సంపాదిస్తారు ఎంత పెట్టుబడి పెట్టాలి. మీ జీవనశైలి., మీ రిస్క్ ఆకలిపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ, కష్టపడి పనిచేయడం అంటే డబ్బు సంపాదించడమే కాదు, ఎంత పరిశోధించాము, ఎంత స్మార్ట్ గా పనిచేశాం అనేది కూడా బేరీజు వేయాల్సి ఉంటుంది.

గొప్ప వంశ చరిత్ర విజయానికి సరిపోదు
రావణుడు బ్రహ్మ వంశానికి చెందినవాడు. కానీ అతని చర్యల ద్వారా అతని గుర్తింపు ఏర్పడింది. వారసత్వంగా వచ్చిన డబ్బు ధనవంతులు కావడానికి సులభమైన మార్గం కావచ్చు, కానీ ఆ డబ్బును కానీ, వ్యాపారాన్ని కానీ నిర్వహించడం లేదా వృద్ధి చేయడం అంత సులభం కాదు. కాబట్టి మీరు సరైన ఉత్పత్తులలో పెట్టుబడి పెట్టాలి. దీని కోసం పరిశోధన చేయండి లేదా ఫండ్ మేనేజర్ నుండి సహాయం పొందండి.

జ్ఞానాన్ని సరిగ్గా ఉపయోగించడం అవసరం
రావణుడు గొప్ప పండితుడు కాని అతను సీతను అపహరించడం వంటి చెడ్డ పని చేసాడు. వేదాల జ్ఞానం అతనికి పని చేయలేదు. ఎఫ్‌డిల నుండి వచ్చే మొత్తం ఆదాయం పూర్తిగా పన్ను విధించబడిందని మీకు తెలిసినా, డెట్ ఫండ్స్ లో తక్కువ పన్ను విధించినప్పటికీ, మీరు ఇంకా ఎఫ్‌డిలలో పెట్టుబడులు పెడితే, అప్పుడు మీరు మీ పెట్టుబడి పరిజ్ఞానాన్ని మెరుగైన మార్గంలో ఉపయోగించడం లేదని అర్థం.

మీరు మీ ఆస్తిని పూర్తిగా వృద్ధి చేసుకోవాలి...
నైపుణ్యం కలిగిన రాజుగా రావణుడు తన రాజ్యాన్ని మెరుగుపరిచాడు. ముల్లోకాలను జయించాడు. మీరు కూడా సరైన పెట్టుబడులతో మంచి పోర్ట్‌ఫోలియోను సిద్ధం చేసుకోవాలి. ఎప్పటికప్పుడు దాన్ని మారుస్తూ ఉండాలి. మీ పోర్ట్‌ఫోలియోను క్రమానుగతంగా సమీక్షించాలి.

నైపుణ్యాలు ఎన్ని ఉంటే అంత లాభం...
రావణుడు సకలకళావల్లభుడు. ఆయనకు కళ, సంగీతం, దౌత్యం, రాజకీయాలలో ప్రావీణ్యం ఉంది. మార్కెట్ గందరగోళ సమయంలో మీ పోర్ట్‌ఫోలియోను ప్రమాదానికి దూరంగా ఉంచడం పెట్టుబడికి సంబంధించిన అతిపెద్ద నియమం. వేర్వేరు ప్రదేశాల్లో పెట్టుబడులు పెట్టడం అవసరం. ఈక్విటీ, డెట్, బంగారం, రియల్ ఎస్టేట్, కరెన్సీ లాటి మిశ్రమ పోర్ట్‌ఫోలియో కష్ట సమయాల్లో నష్టాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఎందుకంటే ఒక ఆస్తి పేలవంగా పనిచేస్తే మిగిలిన వాటి నుండి మంచి లాభం ఉంటుంది.

నైతికత, నియమాలు
రావణుడు నిజమైన పెద్దమనిషి. అతను తల్లి సీతకు ఎటువంటి హాని చేయలేదు. లంకను దాటడానికి ముందు రాముడు యజ్ఞం చేయటానికి కూడా సహాయం చేశాడు. పెట్టుబడి ద్వారా త్వరగా ధనవంతులు కావడానికి ఉపాయాలు లేవు. కానీ ఇక్కడ మీరు నిబంధనలను ఉల్లంఘించడం ద్వారా ఎక్కువ డబ్బు సంపాదిస్తారు. కానీ పన్ను మొదలైన నియమాలను పాటించడం వంటి నైతికతను పాటించండి. లేకపోతే మీరు నష్టపోవలసి ఉంటుంది.
Published by: Krishna Adithya
First published: October 26, 2020, 10:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading