• Home
  • »
  • News
  • »
  • business
  • »
  • INVESTING IN GOLD IS IT POSSIBLE TO INVEST IN GOLD UNDER THE CURRENT CIRCUMSTANCES MK GH

Investing in gold: ప్రస్తుత పరిస్థితుల్లో బంగారంలో పెట్టుబడులు పెట్టవచ్చా? గోల్డ్ లో ఇన్వెస్ట్‌మెంట్‌పై ఎలా నిర్ణయం తీసుకోవాలి..

ప్రతీకాత్మకచిత్రం

సాధారణంగా గోల్డ్, ఈక్విటీలు, ఇతర ఆస్తుల ధరలు పెరుతున్నప్పుడే వాటిలో పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతారు. వీటి ధరలు అలాగే పెరుగుతాయని చాలామంది ఊహిస్తారు. అందుకే ధరల పెరుగుదల కనిపించిన ప్రాథమిక దశలోనే ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ఆసక్తి చూపుతారు.

  • Share this:
సాధారణంగా గోల్డ్, ఈక్విటీలు, ఇతర ఆస్తుల ధరలు పెరుతున్నప్పుడే వాటిలో పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతారు. వీటి ధరలు అలాగే పెరుగుతాయని చాలామంది ఊహిస్తారు. అందుకే ధరల పెరుగుదల కనిపించిన ప్రాథమిక దశలోనే ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ఆసక్తి చూపుతారు. ఇలా ఎక్కువ లాభాలను ఆర్జించాలని ప్రణాళిక వేసుకుంటారు. కానీ ధరల్లో హెచ్చుతగ్గులను ఎవరూ అంచనా వేయలేరని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్ పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో ఊహించడం కష్టమైన విషయం. బంగారం విషయంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. గత ఏడాది ఆగస్టులో బంగారం ధరలు చాలా ఎక్కువగా నమోదయ్యాయి. ప్రస్తుతం ధరలు భారీగా పతనమవుతున్నాయి. అందువల్ల బంగారంలో పెట్టుబడుల విషయంలో అన్ని విధాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.

బంగారంలో పెట్టుబడి ఎప్పుడు పెట్టాలి?
బంగారంలో పెట్టుబడులకు కేవలం ధరలనే ప్రామాణికంగా తీసుకోకూడదు. ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియో ఆధారంగా దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాలి. అసెట్ క్లాస్‌లో అన్ని రకాల ఇన్వెస్ట్‌మెంట్లు ఉండాలి. అప్పుడే పోర్ట్‌ఫోలియో సమతూకంగా ఉంటుంది. దీంతోపాటు ఇన్వెస్ట్‌మెంట్ రిస్క్ అనేది అన్ని రకాల పెట్టుబడులకూ విస్తరిస్తుంది. ఫలితంగా బంగారం ధరలు తగ్గినా పోర్ట్‌ఫోలియో మొత్తం పెట్టుబడులపై పెద్దగా ప్రభావం ఉండదు. అన్ని పెట్టుబడులు ఒకే సమయంలో పెరగవు లేదా తగ్గవు. కానీ మార్కెట్ అస్థిరత కారణంగా కొన్నిసార్లు పోర్ట్‌ఫోలియో సమతూకం (బ్యాలెన్స్) దెబ్బతింటుంది. ఇలాంటి అస్థిరతను తగ్గించేందుకు బంగారంలో పెట్టుబడులను ఎంచుకోవచ్చు. దీనివల్ల ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియో సమతూకంగా ఉంటుంది. రిస్క్‌ను సర్దుబాటు చేసినప్పుడు వచ్చే రిటర్న్‌లతో పోలిస్తే.. అస్థిరతను సర్దుబాటు చేసినప్పుడు వచ్చే రిటర్నులే మెరుగ్గా ఉంటాయి.

ప్రధాన పెట్టుబడిగా వద్దు
పోర్ట్ ఫోలియోలో గోల్డ్ ఇన్వెస్ట్‌మెంటు ప్రధాన పెట్టుబడిగా కాకుండా, తక్కువ ప్రాధాన్యం ఉన్న పెట్టుబడి మార్గంగా ఉండాలి. ఇది వ్యక్తుల ఇన్వెస్ట్‌మెంట్ ప్రొఫైల్, పెట్టుబడి లక్ష్యాలపై ఆధారపడి ఉండాలి. సాధారణంగా పోర్ట్‌ఫోలియోలో ఈక్విటీ, డెట్ ఇన్‌స్ట్రుమెంట్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ఈక్విటీ పెట్టుబడులు దీర్ఘకాలంలో సంపద వృద్ధికి దోహదం చేస్తాయి. డెట్ ఇన్‌స్ట్రుమెంట్లు స్థిరమైన రాబడితో పాటు సంపద వృద్ధికి ఉపయోగపడతాయి. అందువల్ల మొత్తం పెట్టుబడుల్లో కొంత మేరకు బంగారం ఉన్నప్పుడు పోర్ట్‌ఫోలియో అస్థిరత ప్రభావం పెద్దగా ఉండదు. ఈక్విటీ, డెట్ అసెట్ క్లాసులే ఉంటే.. పోర్ట్‌ఫోలియో అస్థిరతకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ప్రస్తుత పరిస్థితులు చూడాలి
బంగారం ఇతర పెట్టుబడుల మాదిరిగా సంపదను ఉత్పత్తి చేయదు. స్టీల్, అల్యూమినియం వంటి లోహాల ఉత్పత్తి, పారిశ్రామిక వినియోగం ఆధారంగా వీటి ధరలు మారుతాయి. కానీ బంగారం వినియోగం కొన్ని దేశాలకే పరిమితం. ప్రపంచ దేశాల మధ్య సంబంధాలు, పెట్టుబడులు, రాజకీయ కారణాలు, భౌగోళిక పరిస్థితులు, కోవిడ్-19 వంటి మహమ్మారుల వల్ల మాత్రమే బంగారం ధరల్లో మార్పులు కనిపిస్తాయి. ప్రస్తుతం బంగారం ధరలు తగ్గడానికి కూడా ఇవే కారణమని చెప్పవచ్చు. అందువల్ల ప్రస్తుత పరిస్థితుల్లో బంగారాన్ని ప్రధాన పెట్టుబడి మార్గంగా ఎంచుకోకపోవడమే మంచిదని ఆర్థిక నిపుణులు సలహా ఇస్తున్నారు.
First published: