దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock markets) సోమవారం భారీగా నష్టపోయాయి. జొమాటో(Zomato), పేటీఎం, నైకా, పీబీ ఫిన్‌టెక్ తదితర స్టాక్స్ కుప్పకూలాయి. జొమాటో స్టాక్స్ సోమవారం 20 శాతం పడిపోయాయి. ఇక, పేటీఎం షేర్లు 6 శాతం క్షీణించగా, FSN ఈ-–కామర్స్ షేర్లు 13 శాతం పడిపోయాయి. దీంతో, వీటిలో ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడిదారులందరూ ఇప్పుడు లబోదిబో అంటున్నారు. గతేడాది లిస్టింగ్‌కు వచ్చిన నాటి నుంచి జొమాటో షేర్లు జనవరి 24న కనిష్ట స్థాయిని తాకాయి. మరోవైపు పాలసీబజార్, పైసాబజార్ మాతృ సంస్థ అయిన పీబీ ఫిన్‌టెక్, వన్97 కమ్యూనికేషన్స్, పేటీఎం, కార్ ట్రేడ్, ఫినో పేమెంట్ బ్యాంక్ స్టాక్స్ కూడా సోమవారం ఆల్-టైమ్ కనిష్ట స్థాయికి చేరుకోవడంతో ఇన్వెస్టర్లు భారీ నష్టాన్ని చవిచూశారు. ఇన్వెస్టర్లు లాభదాయకం కాని టెక్ స్టాక్‌లపై ఆసక్తి చూపని కారణంగా ఈ కొత్త స్టాక్స్ ఆకస్మికంగా పడిపోయాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ప్రస్తుత ట్రెండ్‌పై జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వి కె విజయకుమార్ మాట్లాడుతూ, “ఎక్కువ భాగం అమ్మకాలు లాభదాయకం కాని టెక్ స్టాక్‌లలో జరుగుతాయి. ఈ ట్రెండ్ భారతదేశంలోని జొమాటో, పేటీఎం వంటి స్టాక్లను కూడా ప్రభావితం చేస్తుంది. గత కొన్ని సెషన్లలో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు ఒత్తిడిలో ఉన్నాయి. ఈ వారంలో జరగనున్న యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కమిటీ సమావేశం కోసం పెట్టుబడిదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
రాయిటర్స్ చేసిన పోల్ ప్రకారం, పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నిర్వహించడానికి, యూఎస్ సెంట్రల్ బ్యాంక్ ఊహించిన దాని కంటే త్వరగా పాలసీ రేటు పెంపును ఎంచుకునే అవకాశం ఉంది. దీన్ని ముందుగానే ఊహించి, యూఎస్ బాండ్ల రాబడులు గణనీయంగా పెరిగాయి. ఇన్వెస్టర్లలో నష్టాలను మూటగట్టుకున్న భారతీయ టెక్ స్టాక్‌ల ఆకర్షణను ఇది గుర్తించింది. ప్రస్తుతం, గ్లోబల్ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్ స్పష్టంగా బేరిష్‌గా మారింది. గత వారం S&P 500, నాస్డాక్ 8 శాతం, 15 శాతం తమ ఆల్‌టైమ్ గరిష్టాల కంటే దిగువన ముగిశాయి. గత వారం టెక్ స్టాక్‌లలో అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. యూరప్ స్టాక్స్ కూడా నీరసించాయి. రష్యా- ఉక్రెయిన్ సరిహద్దులో పెరిగిన ఉద్రిక్తతల కారణంగా స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. అందుకే, పెట్టుబడిదారులు తమ ర్యాలీని జాగ్రత్తగా కొనసాగించాలి.”అని అన్నారు.
పెట్టుబడిదారులు ఏం చేయాలి?
జొమాటో, ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ స్టాక్‌లు సోమవారం 20 శాతం పడిపోయి. ఆల్‌టైమ్ కనిష్టానికి రూ.90.95కి చేరుకున్నాయి. ఇక, పేటీఎం 6 శాతం పడిపోయాయి, FSN ఈ–-కామర్స్ షేర్లు 13 శాతం పడిపోయాయి. పీబీ ఫిన్‌టెక్ లిమిటెడ్ షేర్లు సోమవారం 11 శాతం క్షీణించాయి. మీరు న్యూ ఏజ్ టెక్ స్టాక్‌లలో పెట్టుబడి పెట్టినట్లయితే నష్టాల నుంచి బయటపడేందుకు ఏమి చేయాలనే దానిపై జీసీఎల్ సెక్యూరిటీస్ వైస్ ఛైర్మన్ రవి సింఘాల్ మాట్లాడుతూ “పేటీఎం షేర్లను కలిగి ఉన్నవారు బౌన్స్‌లో నిష్క్రమించాలి.
తిరిగి ప్రవేశించడానికి మరికొంత కాలం వేచి ఉండాలి. ఒక షేర్ వాల్యూని రూ. 1,950 నుండి రూ. 2,000 వరకు కొనసాగించాలి. రూ. 1,100 కంటే ఎక్కువ స్టాప్ లాస్‌ను రూ. 915 వద్ద కొనసాగిస్తూ రూ. 800 స్టాప్ లాస్‌తో రూ. 677 వద్ద కొనుగోలు చేయాలి. ప్రస్తుతం జొమాటో కంపెనీ అనేక విధాలుగా స్విగ్గీ నుంచి కఠినమైన పోటీని ఎదుర్కొంటోంది. ప్రధానంగా మెట్రో నగరాల్లోని రెస్టారెంట్ నెట్ వర్క్, స్విగ్గీ నుంచి ఈ పోటీ ఉంది.” అని అన్నారు. వచ్చే వారం బడ్జెట్లో అంటే 2022 ఫిబ్రవరి 1 ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో మరికొంత అస్థిరతను చూడవచ్చని ఏంజెల్ వన్ లిమిటెడ్ ఈక్విటీ రీసెర్చ్ అనలిస్ట్ యాష్ గుప్తా పేర్కొన్నారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.