హోమ్ /వార్తలు /బిజినెస్ /

MF SIP: రూ.200 పొదుపుతో రూ.2 కోట్లు వెనకేయండిలా!

MF SIP: రూ.200 పొదుపుతో రూ.2 కోట్లు వెనకేయండిలా!

 MF SIP: రూ.200 పొదుపుతో రూ.2 కోట్లు వెనకేయండిలా!

MF SIP: రూ.200 పొదుపుతో రూ.2 కోట్లు వెనకేయండిలా!

Investment | మీరు ప్రతి నెలా కొంత మొత్తం దాచుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే దీర్ఘకాలం ఇన్వెస్ట్ మెంట్లను కొనసాగించండి. అదిరే రాబడి పొందొచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Mutual Funds | చేతిలో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ వెలితే దీర్ఘకాలంలో భారీ మొత్తాన్ని పొందొచ్చు. డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. గవర్నమెంట్ స్కీమ్స్ దగ్గరి నుంచి ఈక్విటీ మార్కెట్ వరకు మీరు చాలా ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్లలో డబ్బులు (Money) పెట్టొచ్చు. మీరు ఎంచుకునే ఆప్షన్ ప్రాతిపదికన మీకు వచ్చే రాబడి కూడా మారుతుంది. అలాగే మెచ్యూరిటీ మొత్తం కూడా ఆధారపడి ఉంటుంది. రిస్క్ లేకుండా రాబడి కావాలని భావిస్తే.. పోస్టాఫీస్ (Post Office) పథకాల్లో డబ్బులు పెట్టాలి. రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడితే మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ వంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు.

మ్యూచువల్ ఫండ్స్‌లో దీర్ఘకాలంలో ఇన్వెస్ట్ చేస్తే ఆకర్షణీయ రాబడి పొందొచ్చని నిపుణులు పేర్కొంటూ ఉంటారు. సిప్ ద్వారా దీర్ఘకాలంలో ఇన్వెస్ట్ చేస్తే కాంపౌండిగ్ బెనిఫిట్ పొందొచ్చని తెలియజేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్‌లో దీర్ఘకాలంలో ప్రతి నెలా సిప్ చేస్తూ వెలితే ఎలాంటి బెనిఫిట్ పొందొచ్చొ ఒకసారి తెలుసుకుందాం.

మార్కెట్‌లోకి కొత్త ఎలక్ట్రిక్ సైకిల్.. ధర తెలిస్తే మీ ఫ్యూజుల్ ఔట్, కొత్త కారు కొనొచ్చు!

మీ వయసు 20 ఏళ్లు. మీరు నెలకు రూ. 6 వేలు చొప్పున 25 ఏళ్ల పాటు మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్ చేయాలని అనుకుంటున్నారు. సగటు రాబడి 12 శాతంగా పరిగణలోకి తీసుకుంటే మీకు 45 ఏళ్లు వచ్చే సరికి రూ. కోటి లభిస్తాయి. సిప్ క్యాలిక్యులేటర్ ప్రకారం చూస్తే.. మీకు 25 ఏళ్లలో రూ.కోటి 13 లక్షల 85 వేలు లభిస్తాయి. మీ ఇన్వెస్ట్‌మెంట్ మొత్తం రూ. 18 లక్షలు అవుతుంది. అంటే మీకు రాబడి రూపంలో రూ. 95 లక్షలకు పైగా వస్తాయి.

శుభవార్త.. అదే జరిగితే, భారీగా పడిపోనున్న బంగారం ధరలు!

అదే మీరు ఇంకా ఎక్కువ మొత్తాన్ని కోరుకుంటే.. అప్పుడు టన్యూర్ 30 ఏళ్లకు పెంచుకోవాలి. అప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసే మొత్తం రూ. 21.6 లక్షలు అవుతుంది. అయితే మీకు 50 ఏళ్లు వచ్చే సరికి రూ. 2 కోట్ల 11 లక్షలు లభిస్తాయి. అంటే భారీ మొత్తాన్ని సొంతం చేసుకోవచ్చు. అయితే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే వారు మంచి ఫండ్‌ను ఎంచుకోవాలి. అంతేకాకుండా మరో విషయాన్ని కూడా గుర్తించుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా రిస్క్ ఉంటుంది. అందువల్ల మీరు ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. స్టాక్ మార్కెట్‌కు లోబడే మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్ కూడా ఆధారపడి ఉంటుంది. అందువల్ల లాభాలే కాకుండా నష్టాలు కూడా రావొచ్చని గుర్తించుకోవాలి. అందుకే రిస్క్ తీసుకునే వారు మాత్రమే మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బులు దాచుకోవడం ఉత్తమం.

First published:

Tags: Investments, Money, Mutual Funds, Personal Finance, SIP, Stock Market

ఉత్తమ కథలు