పెన్షన్... వృద్ధాప్యంలో ఆర్థికంగా ఆదుకునే పథకం. రిటైర్ అయిన తర్వాత జీవితాంతం వరకు ఈ పెన్షన్ డబ్బుల పైనే ఆధారపడేవారు ఉంటారు. అందుకే ముందునుంచే భవిష్యత్తును చక్కగా ప్లాన్ చేసుకుంటే కోరుకున్నంత పెన్షన్ పొందొచ్చు. ఇందుకోసం అనే పెన్షన్ స్కీమ్స్ ఉన్నాయి. ఈ పెన్షన్ స్కీమ్స్‌లో పొదుపు చేస్తే పన్ను లాభాలు కూడా ఉంటాయి. అలాంటి పథకమే నేషనల్ పెన్షన్ స్కీమ్-NPS. ఈ స్కీమ్‌లో ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీసీడీ (1బీ) కింద ఏటా రూ.50,000 వరకు పొదుపు చేసి పన్ను మినహాయింపులు పొందొచ్చు. మరి మీరు సంవత్సరానికి రూ.50,000 అంటే నెలకు రూ.4167 చొప్పున నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో పొదుపు చేస్తే మీకు 60 ఏళ్ల వయస్సులో వచ్చే మొత్తం ఎంత? ఆ తర్వాత ప్రతీ నెల వచ్చే పెన్షన్ ఎంత? తెలుసుకోండి.
ఉదాహరణకు మీ వయస్సు 30 ఏళ్లు అనుకుంటే మీరు నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో 30 ఏళ్ల పాటు పొదుపు చేయాల్సి ఉంటుంది. వార్షికంగా రూ.50,000 పొదుపు చేస్తారనుకుందాం. అంటే నెలకు రూ.4,167 చొప్పున జమ చేయాలి. నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో వార్షికంగా 10 శాతం వడ్డీ వస్తుందనుకుంటే 30 ఏళ్ల తర్వాత మీకు రూ.94.97 లక్షలు వచ్చే అవకాశం ఉంది. నేషనల్ పెన్షన్ స్కీమ్-NPS మెచ్యూరిటీ రూల్స్ ప్రకారం మీరు చెల్లించినదానికి వడ్డీతో కలిపి జమ అయిన మొత్తంలో మీరు 60 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. దీనిపైన వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు. మిగిలిన 40 శాతం నుంచి మీకు పెన్షన్ లభిస్తుంది.
ఏడాదికి రూ.50,000 చొప్పున మీరు చెల్లించేది రు.15 లక్షలు. 60 ఏళ్ల వయస్సులో అకౌంట్లో జమ అయ్యే మొత్తం రూ.94.97 లక్షలు. మీరు గరిష్టంగా 60 శాతం అంటే రూ.57 లక్షల వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. మిగిలిన 40 శాతం అంటే రూ.38 లక్షలు అకౌంట్లో ఉంటుంది. నెలకు రూ.19,000 చొప్పున పెన్షన్ లభిస్తుంది. అంటే 30 ఏళ్ల వయస్సు నుంచి నెలకు రూ.4,167 చొప్పున జమ చేస్తే వృద్ధాప్యంలో నెలకు రూ.19,000 చొప్పున పెన్షన్ పొందొచ్చు. ఒకవేళ మీ వయస్సు 35 ఏళ్లు అయితే రూ.19,000 పెన్షన్ పొందేందుకు నెలకు రూ.7,100 జమ చేయాలి. ఒకవేళ మీ వయస్సు 40 ఏళ్లు అయితే రూ.19,000 పెన్షన్ పొందేందుకు నెలకు రూ.12,400 జమ చేయాలి.
ఇవి కూడా చదవండి:
Home loan: సొంత ఇల్లు మీ కలా? హోమ్ లోన్ ఎంత తీసుకోవాలో తెలుసుకోండి
Railway Stations: దేశంలో 10 పరిశుభ్రమైన రైల్వే స్టేషన్లు ఇవే... విజయవాడ ర్యాంక్ ఎంతో తెలుసా?
SBI: కరెన్సీ నోట్లు పాడయ్యాయా? ఎస్బీఐలో ఫ్రీగా మార్చుకోండి ఇలాPublished by:Santhosh Kumar S
First published:March 04, 2020, 18:25 IST