కోటీశ్వరుడు అవ్వడం అనేది ప్రతీ పేద, మధ్య తరగతి సామాన్యుడి కల...అలాంటి కలను సాకారం చేసుకునేందుకు ప్రతీ ఒక్కరూ తమ పెట్టుబడులను వేర్వేరు మార్గాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అయితే అందులో కొందరు రియల్ ఎస్టేట్ ను ఆశ్రయిస్తే, మరికొందరు స్టాక్ మార్కెట్ ను ఆశ్రయిస్తుంటారు. అలాగే బంగారం, బాండ్స్, విదేశీ కరెన్సీ ఇలా రకరకాల మార్గాల్లో డబ్బును ఇన్వెస్ట్ చేస్తుంటారు. అయితే పద్ధతి ప్రకారం ఫైనాన్షియల్ ఎక్స్ పర్ట్స్ చెప్పినట్లు క్రమశిక్షణగా మదుపు చేస్తే కోటీశ్వరుడు కావడం ఖాయం అనే చెప్పాలి. అయితే నెలకు రూ.1800 మదుపుచేస్తే కోటీశ్వరుడు అయ్యేందుకు సుమారు 30 సంవత్సరాలు పడుతుందని ఫైనాన్షియల్ నిపుణులు సూచిస్తున్నారు. నిజానికి రూ. 1800 మదుపు చేస్తే 30 సంవత్సరాల్లో అది రూ.6,39,230 మాత్రమే అవుతుంది. అయితే రూ.1 కోటి ఎలా అవుతుంది అనే సందేహం రావచ్చు. కానీ సాధ్యమే అదెలాగో ఇప్పుడు చూద్దాం.
డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడితే ఇండెక్స్(సెన్సెక్స్, నిఫ్టీ)లో పెట్టుబడి కన్నా అధిక రాబడిని ఇస్తుంటాయి. అందుకే డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకొని మదుపు చేస్తే లాభం వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో క్రమబద్ధంగా ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీ దీర్ఘకాలిక ఆర్థిక అవసరాలను సాకారం చేసుకోవచ్చు. ప్రతి రెండేళ్లకొకసారి మీరు ఇన్వెస్ట్ చేస్తున్న ఫండ్స్ పనితీరును మదింపు చేయండి. ఇతర ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌తో పోల్చితే మీరు ఇన్వెస్ట్ చేసే ఈక్విటీ ఫండ్స్ పనితీరు బాగా లేకపోతే, ఆ ఫండ్స్ నుంచి మారిపోండి. ఈక్విటీ ఫండ్స్‌లో సిప్ విధానంలో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేస్తే, దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలైన–పిల్లల పై చదువులు, సొంత ఇల్లు సమకూర్చుకోవడం రిటైర్మెంట్ అవసరాల కోసం మంచి నిధిని ఏర్పాటు చేసుకోవడం వంటి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను సాకారం చేసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Business, Stock Market