INVEST IN GOLD WITH MMTC GOLD ACCOUNT AND GET THE EASE OF DIGITAL TRANSACTIONS MK
Gold: ఒక రూపాయికే బంగారం ఎలా కొనాలో తెలుసా...?
ప్రతీకాత్మకచిత్రం
ఆన్లైన్ యాప్స్ పేటీఎం, ఫోన్‌పే, మోతీలాల్ ఓస్వాల్, ఆగ్మంట్ తదితర వేదికల ద్వారా డిజిటల్ గోల్డ్‌ను రూపాయి నుంచి నుంచే కొనుగోలు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాయి.
బంగారం ధరలు మార్కెట్లో ఒక గ్రాముకు సుమారు రూ.4 వేలు పలుకుతోంది. అయితే బంగారం ఫిజికల్ గానే కాదు డిజిటల్ రూపంలో కూడా కొనవచ్చని బులియన్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పుడు డిజిటల్ గోల్డ్ రూపంలో కూడా బంగారం కొనుగోలు చేయవచ్చు. కస్టమర్లు కొనే బంగారానికి సరిపడా ఫిజికల్ బంగారాన్ని ఆయా సంస్థలు ఎంఎంటీసీ లాంటి సంస్థలతో కలిసి నిల్వ చేస్తుంటాయి. ఆన్లైన్ యాప్స్ పేటీఎం, ఫోన్‌పే, మోతీలాల్ ఓస్వాల్, ఆగ్మంట్ తదితర వేదికల ద్వారా డిజిటల్ గోల్డ్‌ను రూపాయి నుంచి నుంచే కొనుగోలు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాయి. సాధారణంగా షాపుల్లో బంగారం కొనాలంటే కనీసం ఒక గ్రాము కొనాల్సి ఉంటుంది. అలాగే బాండ్లలో సైతం సార్వభౌమ బంగారం బాండ్లు అయినా సరే కనీసం గ్రాము బంగారం కొనుగోలు చేయక తప్పదు.
అయితే పేమెంట్ యాప్స్ ద్వారా డిజిటల్ బంగారాన్ని చిన్న మొత్తాల్లో కొనుగోలు చేస్తూ, మీకు కావల్సినంత సమకూరిన ఇంటి వద్దకే బంగారాన్ని డెలివరీ తీసుకునే సదుపాయం ఉంది. లేదంటే ఈ డిజిటల్ బంగారాన్ని ఆభరణాల సంస్థలకు బదిలీ చేసుకుని అందుకు తగిన నగలను కొనుగోలు చేసుకునే ఆప్షన్ కూడా ఉంది.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.