Home /News /business /

INVEST 5000 RUPEES MONTHLY IN THIS BUSINESS AND GET UPTO 30000 RUPEES PROFIT EVERY MONTH NK

Business Ideas: రూ.5వేల పెట్టుబడితో నెలకు రూ.30వేల లాభం

Business Ideas: రూ.5వేల పెట్టుబడితో నెలకు రూ.30వేల లాభం

Business Ideas: రూ.5వేల పెట్టుబడితో నెలకు రూ.30వేల లాభం

Business Ideas: మన సమాజంలో వ్యాపారాలు చాలా రకాలున్నాయి. కొన్ని తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ లాభాలు ఇస్తాయి. అవి ఎలా చెయ్యాలో తెలిస్తే చాలు. అలాంటి ఓ వ్యాపారం ఇది.

    Business Ideas: ఏ వ్యాపారమైనా రాత్రికి రాత్రి లక్షాధికారులను చేసేయదు. విజయం సాధించేందుకు కూడా కొంత కష్టం ఉంటుంది. ఐతే... తక్కువ పెట్టుబడితో చేసే వ్యాపారాలు నష్టం వచ్చినా... గట్టెక్కేందుకు అవకాశాలు ఉంటాయి. ఈ వ్యాపారం జాగ్రత్తగా డెవలప్ చేసుకుంటే... కనిపించని లాభాలుంటాయి. దీనికి పోటీ తక్కువే. వ్యాపారమేంటంటే... లూజు టీపొడి అమ్మకం. మన దేశంలో నీళ్ల తర్వాత ప్రజలు ఎక్కువగా తాగుతున్నది టీనే. అంటే టీపొడికి ఉన్న డిమాండ్ చాలా ఎక్కువ. వ్యాపారాన్ని పెంచుకోవడానికి మంచి అవకాశాలు ఉంటాయి. ఇందులో ప్రారంభ పెట్టుబడి రూ.5వేలే. సక్సెస్ అయితే... పెట్టుబడి పెంచుకుంటూ వెళ్లొచ్చు. దీనికి ప్రభుత్వ సాయం కూడా ఉంటుంది.

    దేశంలో చాలా చోట్ల తేయాకు తోటలను సాగుచేస్తున్నారు. దేశంలో అస్సాం, డార్జిలింగ్ టీ పొడికి మంచి డిమాండ్ ఉంది. విదేశాల్లో కూడా ఈ టీపొడిని ఎంతో ఇష్టపడతారు. మీరు టీ పొడి వ్యాపారం ప్రారంభించదలిస్తే... ఈ రెండు రకాల టీపొడులతో ప్రారంభించడం మేలు. రూ.5వేల నుంచి రూ.10వేల లోపు బడ్జెట్ అవసరం. ఈ వ్యాపారాన్ని ఎంతైనా విస్తరించుకునే ఛాన్స్ ఉంటుంది.

    ఈ వ్యాపారం ఎలా చెయ్యాలి?
    మీరు ఈ వ్యాపారం రకరకాలుగా చెయ్యవచ్చు. మీరు రిటైల్ గా టీపొడి అమ్మవచ్చు లేదా... హోల్‌సేల్‌లో అమ్మవచ్చు. టీ స్టాల్స్, రెస్టారెంట్లకు అమ్మవచ్చు. ఇళ్లకు హోమ్ డెలివరీ ఇవ్వొచ్చు. రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లు, థియేటర్ల దగ్గర అమ్మవచ్చు. ఆన్‌లైన్‌లో కూడా అమ్ముకోవచ్చు. వ్యాపారం పెంచేకొద్దీ పెట్టుబడి కూడా పెంచాల్సి వస్తుంది.

    మెల్లగా పెరుగుదల:
    మీరు ఏదైనా బ్రాండెడ్ కంపెనీ టీపొడిని ఫ్రాంచైజీగా అమ్మాలి అనుకుంటే... ఆ కంపెనీతో డీల్ కుదుర్చుకొని... ఇంటి నుంచే టీ ప్యాకెట్లను డెలివరీ చెయ్యవచ్చు. ఇది కాస్త ఖర్చుతో కూడుకున్నది. సింపుల్‌గా ఉండాలంటే.. ఇంటింటికీ తిరుగుతూ... అమ్మవచ్చు. షాపుల్లో టీప్యాకెట్ల కంటే తక్కువ ధరకు ఇస్తే... ఇళ్లలో వారు కొంటారు. మరోసారి కొనేందుకు మొబైల్ నంబర్ ఇస్తే... వారే కావాల్సినప్పుడల్లా కాల్ చేస్తారు.

    లాభం:
    మీరు నెలకు కనీసం రూ.20వేలు సంపాదించవచ్చు. ఎలాగంటే... మంచి క్వాలిటీ టీపొడి మీకు టీ గార్డెన్ల నుంచి కేజీ రూ.140కి లభిస్తుంది. దాన్ని మీరు కేజీ రూ.200 నుంచి రూ.300కు అమ్ముకోవచ్చు. ఇలా రోజూ మీరు 10 కేజీలు... రూ.200 చొప్పున అమ్మినా... మీకు లాభం రూ.600 వస్తుంది. తద్వారా నెలకు రూ.15,000 నుంచి రూ.20,000 వేల దాకా లాభం పొందవచ్చు. అదే మరింత ఎక్కువ రేటుకు అమ్మితే నెలకు రూ.30వేల దాకా కూడా పొందగలరు.

    బ్రాండింగ్, రిజస్ట్రేషన్:
    మీరు అమ్మే టీపొడికి బ్రాండ్ ఇవ్వాలనుకుంటే... మీరు కంపెనీగా రిజిస్టర్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది ఆహారానికి సంబంధించిన వ్యాపారం కాబట్టి... మీ సేవ కేంద్రానికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. కంపెనీ పేరు చెప్పాలి. ఆ పేరు పై మీకు ఓ ప్యాన్ కార్డ్ ఇస్తారు. నలుగురు కంటే ఎక్కువ సిబ్బందితో వ్యాపారం చేయాలనుకుంటే... లేబర్ సర్టిఫికెట్ పొందాలి. ఈ మీ సేవ కేంద్రం ద్వారా మీ వ్యాపారానికి సంబంధించి పూర్తి వివరాలు పొందవచ్చు. అలాగే... ఎంత ఖర్చవుతుంది, ఎలా ప్రారంభించాలి, యంత్రాలు ఎలా పొందాలి, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలేంటి... వంటి వివరాలు అన్నీ అక్కడ తెలుసుకోవచ్చు.

    ముద్ర రుణాలు:
    మీకు కేంద్రప్రభుత్వం ముద్ర స్కీ్మ్ ద్వారా... రూ.50,000 నుంచి రూ.10 లక్షల వరకూ లోన్ ఇస్తోంది. దాన్ని పొంది వ్యాపారం ప్రారంభించవచ్చు. తక్కువ పెట్టుబడితో చేయగలిగే మంచి వ్యాపారం ఇది అవుతుంది.

    ఇది కూడా చదవండి: Business Ideas: నష్టాలే లేని వ్యాపారం... తక్కువ పెట్టుబడి... ఎక్కువ లాభాలు

    ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్:
    కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయం కూడా తెచ్చింది. అందుకోసం MSME ఉద్యోగ్ ఆధార్ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. దానికి లింక్ ఇది. (https://udyamregistration.gov.in/Government-India/Ministry-MSME-registration.htm) ఇక్కడ రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక... స్థానిక మున్సిపాలిటీ నుంచి ట్రేడ్ లైసెన్స్ పొందవచ్చు. అలాగే ఇది ఆహార వ్యాపారం కాబట్టి... దీనికి FSSAI లైసెన్స్ కావాలి. దీన్ని ఆన్‌లైన్‌లో పొందవచ్చు. దానికి లింక్ ఇది. https://www.fssai.gov.in ఇది పొందాక... GST రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఏదైనా బ్యాంకులో కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. ఆ తర్వాత బ్యూరో ఆఫ్ ఇండియన్ స్ట్రాండర్స్ నుంచి BIS సర్టిఫికెట్ పొందాలి. ఈ సేవలన్నీ మీసేవ ద్వారా పొందవచ్చు.

    (Disclaimer: The material provided on this page is for information purposes only and should not be understood as an investment advice. Any opinion that may be provided on this page does not constitute a recommendation by telugu.news18.com We do not make any representations or warranty on the accuracy or completeness of the information that is provided on this page. If you rely on the information on this page then you do so entirely on your own risk.)
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Business Ideas, Business plan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు