• Home
  • »
  • News
  • »
  • business
  • »
  • INVEST 200 RUPEES DAILY AND GET UPTO 14 LAKH RUPEES AFTER 20 YEARS HERE FULL DETAILS NS

Investment: కేవలం రూ. 200 పెట్టుబడితో రూ. 14 లక్షలు పొందే ఛాన్స్.. ఈ సూపర్ ఆఫర్ గురించి వివరాలివే...

ప్రతీకాత్మక చిత్రం

కొద్ది మొత్తం పెట్టుబడితో అధిక లాభాలు పొందాలనుకుంటున్నారా? అయితే.. కేవలం రోజుకు రూ. 200 పెట్టుబడితో రూ. 14 లక్షలు అందుకునే ఈ ఆఫర్ గురించి తెలుసుకోండి.

  • Share this:
    తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. మీ కోసం ప్రత్యేక ఆఫర్ అందుబాటులో ఉంది. పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టడం ద్వారానే కాదు.. కొద్ది మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టడం ద్వారా కూడా మీరు పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించే అవకాశం కల్పిస్తుంది పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్. ఇందులో మీరు రోజుకు 200 రూపాయలు మాత్రమే పెట్టుబడి పెట్టడం ద్వారా రూ. 14 లక్షల రూపాయల వరకు సంపాదించే అవకాశం ఉంది. ఇందు కోసం మీరు మీ నిధులను పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. ఖాతాలో రోజుకు రూ .200/- జమ చేస్తే 20 సంవత్సరాల తరువాత రూ .14 లక్షల వరకు మీకు అందుతుంది. పీపీఎఫ్ పథకం కింద మీరు పెట్టుబడి పెట్టిన డబ్బు ఎప్పుడూ సురక్షితం. ఈ విషయంలో మీరు ఏమాత్రం అనుమాన పడాల్సిన అవరసం లేదని చెప్పవచ్చు. సంపాదించిన వడ్డీ రేటుకు కూడా అస్సలు పన్ను విధించాల్సిన అవసరం కూడా లేదు.

    మీరు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో డబ్బు జమ చేస్తే, మీకు నామినీ ప్రయోజనం కూడా లభిస్తుంది. ఇందుకోసం మీరు పోస్ట్ ఆఫీస్ మరియు బ్యాంక్ వద్ద ఖాతా తెరవవచ్చు. 15 సంవత్సరాల పాటు నిధులు జమ చేయాల్సి ఉంటుంది. మరియు ఈ కాలపరిమితిని మరో 5 సంవత్సరాల వరకు పొడిగించవచ్చు.

    ఇదిలా ఉంటే.. కరోనా తరువాత ఎక్కువ మంది ఉద్యోగులు సొంత ఇల్లు లేదా ఫ్లాట్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి కస్టమర్ల కోసం బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తక్కువ వడ్డీతో హోమ్ లోన్లను అందిస్తున్నాయి. ప్రస్తుతం వివిధ సంస్థలు తక్కువ వడ్డీతో హోమ్ లోన్లను అందిస్తున్నాయి. తాజాగా LIC హౌసింగ్ ఫైనాన్స్ తమ కస్టమర్లకు కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ఏకంగా ఆరు నెలలకు సమానమైన హోమ్ లోన్ EMIలను రద్దు చేస్తామని ఆ సంస్థ గురువారం వెల్లడించింది. గృహ వరిష్ట (Griha Varishtha) హోమ్ లోన్ ప్రొడక్ట్‌ను ఎంచుకున్న కస్టమర్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. నెలవారీ జీతం పొందే ఉద్యోగులు, డిఫైన్డ్ బెనిఫిట్ పెన్షన్ స్కీం (DBPS) పరిధిలోకి వచ్చే పెన్షనర్లు ఈ పథకానికి అర్హులు. కొత్త ఆఫర్ ప్రకారం 37, 38, 73, 74, 121, 122వ EMIలకు మినహాయింపు ఉంటుంది. బకాయి ఉన్న ఈఎంఐలు, తరువాతి నెలల ప్రిన్సిపల్ అమౌంట్‌కు యాడ్ చేసిన మొత్తాన్ని ఆఫర్లో భాగంగా రద్దు చేస్తారు.
    Published by:Nikhil Kumar S
    First published: