అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Womens Day) సెలబ్రేట్ చేసుకోవడానికి మహిళలు సిద్ధమవుతున్నారు. మహిళల కోసం ప్రభుత్వం అనేక పథకాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. అతిపెద్ద బీమా సంస్థ అయిన లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) మహిళల కోసం ప్రత్యేకంగా ఓ ఎల్ఐసీ పాలసీ (LIC Policy) అందిస్తోంది. ఎల్ఐసీ ఆధార్ శిల (LIC Aadhaar Shila) పేరుతో ఈ పాలసీ అందుబాటులో ఉంది. ఇది నాన్ లింక్డ్, పార్టిసిపేటింగ్, ఇండివిజ్యువల్, సేవింగ్స్ లైఫ్ ఇన్స్యూరెన్స్ పథకం. కేవలం మహిళలు మాత్రమే ఈ పాలసీ తీసుకునే అవకాశం ఉంటుంది. మహిళలకు సేవింగ్స్‌తో పాటు రక్షణ కూడా అందించడం ఈ పాలసీ ప్రత్యేకత. ఈ పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
ఎల్ఐసీ ఆధార్ శిల పాలసీ అర్హతలు చూస్తే ఇది మహిళల కోసం రూపొందించిన ప్లాన్ అయినా, బాలికలకు కూడా తీసుకోవచ్చు. ఈ పాలసీ తీసుకోవాలంటే 8 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ట వయస్సు 55 ఏళ్లు. పాలసీ టర్మ్ కనీసం 10 ఏళ్ల నుంచి 20 ఏళ్లు. సమ్ అష్యూర్డ్ విషయానికి వస్తే కనీసం రూ.2,00,000 నుంచి గరిష్టంగా రూ.5,00,000 వరకు పాలసీ తీసుకోవచ్చు. ప్రీమియం నెలకు, మూడు నెలలకు, ఆరు నెలలకు, ఏడాదికి ఓసారి చెల్లించవచ్చు.
Aadhaar Name Update: ఆధార్ కార్డుపై పేరు మార్చాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవండి
ఉదాహరణకు 30 ఏళ్ల వయస్సు ఉన్న ఓ మహిళ రూ.3,00,000 సమ్ అష్యూర్డ్‌తో 20 ఏళ్ల టర్మ్ ఎంచుకొని ఎల్ఐసీ ఆధార్ శిల పాలసీ తీసుకున్నారనుకుందాం. రోజూ రూ.30 చొప్పున ఏటా రూ.10,959 ప్రీమియం చెల్లించాలి. మెచ్యూరిటీ నాటికి రూ.3,97,000 రిటర్న్స్ వస్తాయి. చెల్లించిన ప్రీమియంతో పాటు బోనస్ కూడా వస్తుంది కాబట్టి మంచి రిటర్న్స్ వస్తాయి.
ఇక ఎల్ఐసీ ఆధార్ శిల బ్రోచర్‌లో వివరించిన మరో ఉదాహరణ చూద్దాం. 35 ఏళ్ల వయస్సు ఉన్న ఓ మహిళ రూ.2,00,000 సమ్ అష్యూర్డ్‌తో 20 ఏళ్ల టర్మ్ ఎంచుకొని ఎల్ఐసీ ఆధార్ శిల పాలసీ తీసుకున్నారనుకుందాం. రోజూ రూ.22 చొప్పున ఏటా రూ.7,860 ప్రీమియం చెల్లించాలి. మెచ్యూరిటీ నాటికి రూ.2,33,000 రిటర్న్స్ వస్తాయి.
Indane Gas: ఇండేన్ గ్యాస్ కనెక్షన్ ఉందా? ఎక్స్‌ట్రా సిలిండర్ తీసుకోండిలా
పాలసీ తీసుకున్న మహిళ పాలసీ కొనసాగుతున్న సమయంలో మరణిస్తే నామినీకి డబ్బులు చెల్లిస్తుంది ఎల్ఐసీ. పాలసీ తీసుకున్న ఐదేళ్ల లోపు మరణిస్తే సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్ లభిస్తుంది. ఐదేళ్ల తర్వాత మరణిస్తే లాయల్టీ అడిషన్ కూడా లభిస్తుంది. పాలసీ తీసుకున్న తర్వాత రెండేళ్లు పూర్తి ప్రీమియంలు చెల్లిస్తే లోన్ సదుపాయం కూడా ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Insurance, LIC, Personal Finance, Women's day