హోమ్ /వార్తలు /బిజినెస్ /

GST on Helmets: హెల్మెట్లపై జీఎస్‌టీ ఎత్తేయాలి.. నిర్మలా సీతారామన్‌కు ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్ లేఖ..

GST on Helmets: హెల్మెట్లపై జీఎస్‌టీ ఎత్తేయాలి.. నిర్మలా సీతారామన్‌కు ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్ లేఖ..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

హెల్మెట్‌లపై ఇండియాలో విధిస్తున్న గూడ్స్‌ అండ్‌ సర్వీస్ ట్యాక్స్‌(GST)ని ఉపసంహరించుకోవాలని ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్ (International Road Federation) కోరుతోంది. ప్రస్తుతం ఇండియాలో హెల్మెట్‌లపై 18 శాతం జీఎస్‌టీ విధిస్తున్నారు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ప్రాణాలు కోల్పోతుండటానికి ప్రధాన కారణాల్లో రోడ్డు ప్రమాదాలు ఒకటి. రోడ్డు భద్రతా నియమాలు పాటించకపోవడం, సురక్షిత చర్యలు తీసుకోకపోవడంతోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. హెల్మెట్‌(Helmet) ధరించకపోవడంతనే ద్విచక్ర వాహనదారులు తీవ్రంగా గాయపడుతున్నారు. చాలామంది వాహనదారులు కనీసం వీటిని కొనుగోలు చేయట్లేదు. ఇలాంటి సమస్యలను దూరం చేయడానికి హెల్మెట్‌లపై ఇండియాలో విధిస్తున్న గూడ్స్‌ అండ్‌ సర్వీస్ ట్యాక్స్‌(GST)ని ఉపసంహరించుకోవాలని ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్ (International Road Federation) కోరుతోంది. ప్రస్తుతం ఇండియాలో హెల్మెట్‌లపై 18 శాతం జీఎస్‌టీ విధిస్తున్నారు. ఈ మేరకు గ్లోబల్ రోడ్ సేఫ్టీ బాడీ సోమవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌(Finance Minister Nirmala Sitharaman)కు లేఖ రాసింది.

తాజా విషయంపై కేంద్ర ఆర్థిక మంత్రికి ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఎమెరిటస్ కెకె కపిల ఓ లేఖ రాశారు. రోడ్డు ప్రమాదం ప్రపంచానికి పెనుముప్పు అని ఆమె పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఇండియాలో 11 శాతం నమోదవుతున్నాయని తెలిపారు.ప్రతి సంవత్సరం సుమారు 500,000 రోడ్డు ట్రాఫిక్ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. ఫలితంగా 150,000 కంటే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని, 500,000 మందికి గాయపడుతున్నారని, కొందరు శాశ్వత వైకల్యం పొందుతున్నారని తెలిపారు. రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్న వారిలో ఎక్కువగా 18 నుంచి 45 సంవత్సరాల వయస్సు గలవారు ఉంటున్నారని.. బాధితుల తలకు బలమైన గాయాలు అవడంతోనే మరణిస్తున్నారని వివరించారు.

* గంటకు 17 మంది మరణం

రోడ్డు ప్రమాదాల్లో గాయపడే, ప్రాణాలు కోల్పేయే ద్విచక్ర వాహనదారుల సంఖ్యను తగ్గించడంలో స్టాండర్డ్‌ హెల్మెట్‌ల వినియోగం కీలకమని ఎమెరిటస్ కెకె కపిల చెప్పారు. ఇండియాలో హెల్మెట్ వినియోగం చాలా తక్కువగా ఉందన్నారు. భారతదేశం ట్రాఫిక్ ప్రమాదాలు, గాయాలు, మరణాల భారాన్ని ఎదుర్కొంటోందన్నారు. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ రవాణా పరిశోధన విభాగం నివేదిక ప్రకారం.. 2019లో భారతదేశం అంతటా 480,652 రోడ్డు ప్రమాదాలలో మొత్తం 151,113 మంది మరణించారన్నారు. సగటున రోజుకు 414 లేదా గంటకు 17 మంది ప్రాణాలు కోల్పోయారని, మొత్తం రోడ్డు ప్రమాద మరణాలలో 31.4 శాతం ద్విచక్ర వాహనదారులే ఉన్నారని పేర్కొన్నారు.

Maruti Cars: గుడ్ న్యూస్ చెప్పిన మారుతి సుజుకీ.. పెరగనున్న ఆ కార్ల మైలేజీ... లీటర్‌కు ఎంతంటే..

SBI Alert: షాక్ ఇచ్చిన ఎస్‌బీఐ ... నేటి నుంచి పెరగనున్న ఈఎంఐలు

* 2030 నాటికి హెల్మెట్‌లపై జీఎస్‌టీ తొలగించాలి

నివారించే అవకాశం ఉన్న రోడ్డు ప్రమాదాల నుంచి ప్రజలకు రక్షణ కల్పించే చర్యలు తీసుకోవాలని ఎమెరిటస్ కెకె కపిల కోరారు. రహదారి భద్రతా నిపుణుల అభిప్రాయం ప్రకారం 2025 నాటికి రోడ్డు ప్రమాద మరణాలను 50 శాతానికి తగ్గించడానికి, 2030 ముగిసేలోపు, హెల్మెట్‌లపై జీఎస్‌టీ ఉండకూడదని చెప్పారు. జీఎస్‌టీని తొలగించడం రోడ్డు ప్రమాదాలను, ద్విచక్ర వాహనదారులను తగ్గించడంలో మాత్రమే కాకుండా, ఆర్థిక వ్యవస్థలో రోడ్డు ప్రమాదాల కారణంగా GDPకి కలుగుతున్న నష్టాన్ని కూడా తగ్గిస్తుందని స్పష్టం చేశారు.

First published:

Tags: Helmet, Nirmala sitharaman

ఉత్తమ కథలు