రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) 2030 నాటికి 100 గిగా వాట్ల రిన్యూవబుల్ ఎనర్జీని సృష్టిస్తుందని ఛైర్మన్ ముకేష్ అంబానీ (Mukesh Ambani) తెలిపారు. PDH ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ (PDH Chamber of Commerce & Industry), పర్యావరణ కమిటీ నిర్వహిస్తున్న అంతర్జాతీయ వాతావరణ శిఖరాగ్ర సమావేశం 2021 (ICS 2021) సందర్భంగా ముకేష్ అంబానీ (Mukesh Ambani) భవిష్యత్ ప్రణాళికల్ని వివరించారు. 2030 నాటికి భారతదేశం 450 గిగావాట్ల పునరుత్పాదక శక్తిని టార్గెట్‌గా పెట్టుకుంటే అందులో 100 గిగా వాట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) సృష్టిస్తుందని తెలిపారు. వాతావరణ మార్పు 'ప్రపంచ సమస్య'గా వివరించారు. ఈ సవాల్‌ను ఎదుర్కోవడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) ఇప్పటికే ప్రణాళికలు రూపొందించినట్టు తెలిపారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) జామ్‌నగర్‌లో రూ.75,000 కోట్ల పెట్టుబడితో గ్రీన్ ఎనర్జీ కాంప్లెక్స్ పనులు మొదలుపెట్టినట్టు ముకేష్ అంబానీ చెప్పారు. ఈ కాంప్లెక్స్‌లో 4 గిగా ఫ్యాక్టరీలు ఉంటాయని, గ్రీన్ హైడ్రోజన్ పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని భారతదేశం ప్రణాళికల్ని రూపొందిస్తోందని, భారతదేశ హరిత ఆశయాన్ని పూర్తి చేయడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ కట్టుబడి ఉందని అన్నారు. వాతావరణ మార్పు గురించి మాట్లాడుతూ మానవజాతి తనను తాను పునరుద్ధరించుకోవడానికి, స్థిరమైన భవిష్యత్తును సృష్టించడానికి ఇది ఓ అవకాశం అన్నారు.
Indian Railways: రైల్వే ప్రయాణికులకు శుభవార్త... ఈ కొత్త సర్వీస్ మీకోసమే
భూగ్రహం స్థిరత్వానికి గ్రీన్ హైడ్రోజన్ కీలకం అని, హైడ్రోజన్ నిల్వ చేయడానికి, రవాణా చేయడానికి కొత్త టెక్నాలజీలు పుట్టుకొస్తున్నాయని ముకేష్ అంబానీ తెలిపారు. వాతావరణ మార్పు మానవజాతి ఎదుర్కొంటున్న అత్యంత భయంకరమైన సవాలని అభివర్ణించారు.
LPG Subsidy: గ్యాస్ సిలిండర్ సబ్సిడీ రాలేదా? ఇలా కంప్లైంట్ చేయండి
భారతదేశంలో రాబోయే హైడ్రోజన్ పర్యావరణ వ్యవస్థ, హైడ్రోజన్ శక్తి ఉపయోగించడం, వాటి ద్వారా ఇంధన అవసరాలను తీర్చేందుకు రూపొందించాల్సిన ప్రణాళికలపై ఇంటర్నేషనల్ క్లైమేట్ సమ్మిట్ 2021 నిర్వహించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, ఇండియా, యూరప్‌కు చెందిన గ్లోబల్ ఎనర్జీ ఇండస్ట్రీ, ఆటోమోటివ్ ఇండస్ట్రీ దిగ్గజాలు ఈ సమ్మిట్‌లో పాల్గొంటున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mukesh Ambani, Reliance Industries