హోమ్ /వార్తలు /బిజినెస్ /

Interest Rates On Small Savings Schemes: కొత్త సంవత్సరంలో పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించనున్నట్లు ప్రకటన

Interest Rates On Small Savings Schemes: కొత్త సంవత్సరంలో పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించనున్నట్లు ప్రకటన

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (ఫైల్ ఫోటో)

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (ఫైల్ ఫోటో)

ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ప్రభుత్వం ఈ వడ్డీ రేట్లను యధాతథంగా ఉంచిందని విశ్లేషకులు చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్ తర్వాత చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో అత్యధిక చందాదారులు ఉత్తరప్రదేశ్ లో ఉన్నారు.

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జనవరి-మార్చి త్రైమాసికానికిగానూ చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో  వివిధ స్కీములపై వడ్డీ రేట్లు 4.0 శాతం నుండి 7.6 శాతం వరకు అందుబాటులో ఉన్నాయి.  ఒక వైపు ప్రభుత్వ బాండ్ రాబడులు హెచ్చుతగ్గులకు లోనవుతున్నప్పటికీ, ఏడో త్రైమాసికంలో కూడా  చిన్న పొదుపు సాధనాలపై వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పులు చేయకపోవడం గమనించదగిన విషయం. 2021-22 నాల్గవ త్రైమాసికానికి PPF , NSC సహా చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను ప్రభుత్వం యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, గోవా వంటి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) , నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) నాలుగో త్రైమాసికంలో కూడా వరుసగా 7.1 శాతం , 6.8 శాతం వార్షిక వడ్డీ రేట్లను పొందడం కొనసాగుతుంది.

2021-22 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికానికి (జనవరి 1, 2022 నుండి ప్రారంభమై మార్చి 31, 2022తో ముగుస్తుంది) మూడవ త్రైమాసికంలో రేట్లనే కొనసాగిస్తున్నట్లు వివిధ చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు నోటిఫికేషన్‌లో ఉన్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

అయితే  ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ప్రభుత్వం ఈ వడ్డీ రేట్లను యధాతథంగా ఉంచిందని విశ్లేషకులు చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్ తర్వాత చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో అత్యథిక చందాదారులు ఉత్తరప్రదేశ్ లో ఉన్నారు. గతంలో ఈ పథకాలపై వడ్డీ రేటును తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది. కానీ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 1.1 శాతం వడ్డీ రేటు తగ్గింపును వెంటనే రద్దు చేసింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఒక సంవత్సరం ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌పై వడ్డీ రేటు 5.5 శాతంగా కొనసాగుతుంది. సుకన్య సమృద్ధి యోజనపై వడ్డీ రేటు 7.6 శాతంగా కొనసాగుతుంది. ఐదేళ్ల సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌పై వడ్డీ రేటు 7.4 శాతంగానే ఉంటుంది. సీనియర్ సిటిజన్స్ స్కీమ్‌పై వడ్డీ త్రైమాసిక ప్రాతిపదికన చెల్లించబడుతుంది. చిన్న మొత్తాల పొదుపు డిపాజిట్లపై వడ్డీ రేటు ఏడాదికి 4 శాతంగా ఉంటుంది.

ఒకటి నుండి ఐదు సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.5-6.7 శాతం వడ్డీ కొనసాగనుంది. అయితే ఇది త్రైమాసిక ప్రాతిపదికన చెల్లించబడుతుంది. ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్‌పై వడ్డీ రేటు 5.8 శాతం కొనసాగునంది.

First published:

Tags: Interest rates