Home /News /business /

INTEREST RATES ON BANK FIXED DEPOSITS ARE GOING UP UMG GH

Fixed Deposits: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై పెరుగుతున్న వడ్డీ రేట్లు.. వీటిలో ఇన్వెస్ట్‌ చేయడం మంచిదేనా? నిపుణుల సూచనలివే

అన్ని బ్యాంకులు ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు పెంచేస్తోంది. మరి దేంట్లో పెట్టుబడి పెట్టాలి.

అన్ని బ్యాంకులు ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు పెంచేస్తోంది. మరి దేంట్లో పెట్టుబడి పెట్టాలి.

ప్రస్తుతం బ్యాంకులు (Banks) ఫిక్స్‌డ్ డిపాజిట్ల (Fixed Deposits)పై చెల్లించాల్సిన వడ్డీ రేట్లను పెంచడం ప్రారంభించాయి. అయితే ఈ సమయంలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ల (FD)లో పెట్టుబడి (Investment) పెట్టడం సరైన నిర్ణయమేనా అనేది డిపాజిటర్లు తెలుసుకోవాలి. దీనిపై నిపుణుల విశ్లేషణ ఏంటో చూద్దాం.

ఇంకా చదవండి ...
అన్ని banks కొంతకాలం వరకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లపై తక్కువ వడ్డీని చెల్లించాయి. ప్రస్తుతం ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లపై అందించే వడ్డీలను ఆయా బ్యాంకులు క్రమంగా పెంచుతుండటంతో ఇన్వెస్టర్లకు ఆశలు చిగురించాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) పాలసీ రేట్లు పెంచడం, ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తుండటంతో.. బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై చెల్లించాల్సిన వడ్డీ రేట్లను పెంచడం ప్రారంభించాయి. అయితే ఈ సమయంలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లలో పెట్టుబడి పెట్టడం సరైన నిర్ణయమేనా అనేది డిపాజిటర్లు తెలుసుకోవాలి. దీనిపై నిపుణుల విశ్లేషణ ఏంటో చూద్దాం.

అర్ధవంతమైన పెరుగుదల లేదు
ఇప్పటివరకు బ్యాంకులు ప్రకటించిన interest rates పెంపు నామమాత్రమే. రుణదాతలు వడ్డీ రేట్లను పెంచుతున్నప్పటికీ, సాధారణంగా మూడు సంవత్సరాల కంటే ఎక్కువ కాలానికి చేసే దీర్ఘకాలిక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లపై మాత్రమే గరిష్టంగా 50 బేసిస్ పాయింట్ల వరకు పెరుగుదల కనిపిస్తోంది. ఒకటి లేదా రెండు సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు కేవలం 10-30 బేసిస్ పాయింట్లు పెరిగాయి. ఇది ఆర్‌బీఐ ప్రకటించిన రెపో రేటులో 90 బేసిస్ పాయింట్ల పెంపుదలకు సమీపంలో లేదు, ద్రవ్యోల్బణ రేటును దాటే స్థాయికి చేరుకోలేదు.

ఇదీ చదవండి: ఎస్‌బీఐ సూపర్ స్కీమ్.. డబ్బులే డబ్బులు..!! సింగిల్ ఇన్వెస్ట్‌మెంట్‌తో నెలనెలా ఆదాయం!


సెంట్రల్ బ్యాంక్ చర్యలతో.. ఒక సంవత్సరం బాండ్ రాబడులు దాదాపు 100 బేసిస్ పాయింట్లు పెరిగాయి. దీనిపై లోన్స్‌ కార్పొరేట్ ట్రైనర్ జోయ్‌దీప్ సేన్ మాట్లాడుతూ.. పెరుగుతున్న వడ్డీ రేట్ల సైకిల్‌ను గ్రహిస్తే, సెకండరీ మార్కెట్ ఈల్డ్‌లు పదవీకాలాల్లో గణనీయంగా పెరిగాయని, బ్యాంక్ FD rates పెరగడానికి కొంత సమయం పడుతుందని చెప్పారు. ఉదాహరణకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI), ఒక సంవత్సరం ఫిక్స్‌డ్ డిపాజిట్లకు 5.3 శాతం వడ్డీని చెల్లిస్తుంది. సీనియర్ సిటిజన్‌కి 5.8 శాతం లభిస్తుంది. అయితే ఆర్‌బీఐ జారీ చేసిన జూన్ 2023లో మెచ్యూర్ అయిన ట్రెజరీ బిల్లు 6.25 శాతం రాబడిని అందిస్తుంది. బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లు ఇంకా అర్థవంతంగా పెరగలేదు.

దీర్ఘకాలం పెట్టుబడుల్లో చిక్కుకోవద్దు
బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌ల వడ్డీ రేట్ల పెరుగుదల ప్రారంభ దశలో ఉంది. తక్కువ కాలానికి చేసే డిపాజిట్‌లకంటే కాస్త ఎక్కువ రాబడి కనిపిస్తోందని, దీర్ఘకాల పెట్టుబడులను చేయడం సరైన నిర్ణయం కాదని నిపుణులు సూచిస్తున్నారు. బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీకి పెట్టుబడిదారుడు పన్ను చెల్లించాలి, దీంతో పోస్ట్-టాక్స్ రిటర్న్స్ మరింత తగ్గుతాయి.

ఇదీ చదవండి: ఫ్యూచర్ పేమెంట్ సిస్టమ్స్‌పై ఆర్బీఐ ఫోకస్.. RBI పేమెంట్స్‌ విజన్- 2025లో కీలక అంశాలు


ముంబైకి చెందిన సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ పరుల్ మహేశ్వరి మాట్లాడుతూ..‘బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ ఇన్వెస్టర్లకు ఇప్పుడు తక్కువ సంపాదన లభిస్తుంది. బదులుగా నగదు ప్రవాహ అవసరాలను పరిగణనలోకి తీసుకుని ఒకటి, రెండు, మూడు సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్ల మిశ్రమంలో పెట్టుబడి పెట్టడం సమంజసం’ అని చెప్పారు. బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టాలని ఆసక్తిగా ఉన్నట్లయితే, దాదాపు ఒక సంవత్సరంలో మెచ్యూర్ అయ్యే స్వల్పకాలిక బ్యాంక్ డిపాజిట్లను పరిశీలించడం మేలని మరో నిపుణుడు వివరించారు. ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలానికి చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్‌లను నివారించాలని సిఫార్సు చేస్తున్నారు.ఏ ప్రత్యామ్నాయాలు మేలు?
ఫిక్స్‌డ్ ఇన్‌వెస్టర్లు ఇతర ఆప్షన్‌లకు వెళితే.. ఇలాంటి రిస్క్ ప్రొఫైల్‌తో కూడిన కార్పొరేట్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు మెరుగైన రాబడిని అందిస్తాయి. ఉదాహరణకు హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్(HDFC) 15-నెలల ఫిక్స్‌డ్ డిపాజిట్ కోసం 6.05 శాతం వడ్డీని అందిస్తోంది. HDFC బ్యాంక్ ఇదే కాలానికి 5.35 శాతం ఆఫర్ చేస్తుంది. స్వల్పకాలిక పత్రాలలో పెట్టుబడి పెట్టే మ్యూచువల్ ఫండ్ పథకాలు, అది టార్గెట్ మెచ్యూరిటీ ఫండ్స్ లేదా ఓపెన్-ఎండెడ్ షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్ అయినా, అధిక ఆదాయ పన్ను పరిధిలో ఉన్న పెట్టుబడిదారులకు కూడా ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ తమ పెట్టుబడి కాలపరిమితిని ఫండ్ వ్యవధితో సరిపోల్చాలి. వడ్డీ రేట్లు మరింత పెరిగితే, మార్కెట్ నుంచి నష్టాలు కూడా ఉండవచ్చు.
Published by:Mahesh
First published:

Tags: Banks, BUSINESS NEWS, FD rates, Interest rates

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు