• Home
  • »
  • News
  • »
  • business
  • »
  • INTEREST RATES MAY SEE FURTHER REDUCTION FROM JULY 1 PPF SUKANYA SAMRIDHI NSC WILL BE EFFECTED GH SA

Savings Schemes: అప్పులు తీసుకునే వారికి గుడ్‌న్యూస్.. జులై 1 నుంచి..!

గత నాలుగు దశాబ్దాల్లో అమల్లో ఉన్న వడ్డీ రేట్లలో ప్రస్తుత వడ్డీరేట్లే అత్యల్పమని నిపుణులు చెబుతున్నారు. ఇదే ధోరణి మరో ఆరు నుంచి పన్నెండు నెలల వరకు కొనసాగే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు.

ప్రస్తుతం ద్రవ్యోల్భణం పెరగడంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను తగ్గించే సూచనలే అధికంగా ఉన్నాయి. కరోనా కారణంగా ఆర్థిక వ

  • Share this:
కేంద్ర ప్రభుత్వం ఇటీవల చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్ల తగ్గింపును ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తగ్గింది. దీంతో కిందటి త్రైమాసికంలో వడ్డీ రేట్లను మార్చకుండా యథాతథంగా అమలు చేస్తోంది. అయితే ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ పూర్తవ్వడంతో వచ్చే త్రైమాసికం (అనగా జులై 1) నుంచి వడ్డీ రేట్లను తగ్గించే దిశగా అడుగులు వేస్తోన్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే, పిపిఎఫ్, సుకన్య సమృద్ది యోజన, ఎన్‌ఎస్‌సి, మంత్లీ ఇన్​కమ్​ స్కీమ్​లు, సీనియర్ సిటిజన్ సేవింగ్స్​ వంటి చిన్న పొదుపు ఖాతాల్లో పెట్టుబడి పెట్టే సామాన్యులపై ప్రభావం పడనుంది. ఈ స్కీమ్​లలో పెట్టుబడిపై తక్కువ రాబడి మాత్రమే వస్తుంది. సాధారణంగా రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (ఆర్​బీఐ) ప్రతి మూడునెలలకోసారి వడ్డీ రేట్లను సవరిస్తుందన్న విషయం తెలిసిందే. అయితే, వడ్డీరేట్లు ఎంతమేర ఉండాలనే విషయం ద్రవ్యోల్భణాన్ని బట్టి నిర్ణయిస్తుంది.

ప్రస్తుతం ద్రవ్యోల్భణం పెరగడంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను తగ్గించే సూచనలే అధికంగా ఉన్నాయి. కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ పతనం కాకుండా కాపాడుకోవడానికి గత ఏడాది డిపాజిట్లపై వడ్డీ రేట్లను ఆర్​బీఐ తగ్గించింది. ఇప్పటికీ అవే వడ్డీ రేట్లు అమల్లో ఉన్నాయి. అయితే ఆర్థిక వ్యవస్థ కుదుటపడటంతో ఈ వడ్డీ రేట్లను కిందటి త్రైమాసికంలోనే తగ్గిస్తారని అంతా ఊహించారు. అనుకున్నట్లుగానే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ వడ్డీ రేట్ల తగ్గింపును ప్రకటించారు. కానీ ఎన్నికల్లో దీని ప్రభావం ఉంటుందని భావించి కొద్ది సేపటికే ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నారు. ఈ జులై 1 నుంచి ప్రారంభమయ్యే రెండో త్రైమాసికంలో మాత్రం వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం కచ్చితంగా ఉందని బ్యాంకర్లు విశ్లేషిస్తున్నారు. చిన్న పొదుపు పథకాలపై ప్రస్తుతం అధిక రేట్లు ఉన్నందున వీటిని తగ్గించాలని సెంట్రల్ బ్యాంక్ ప్రణాళికలు సిద్దం చేస్తోంది.

జులై​ 1 నుంచి అమల్లోకి కొత్త వడ్డీ రేట్లు?
వడ్డీరేట్ల తగ్గింపుపై కేర్ రేటింగ్స్ ఎకనమిస్ట్ మదన్ సబ్నావిస్ మాట్లాడుతూ "దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసినందున, వచ్చే త్రైమాసికంలో చిన్న పొదుపు ఖాతాల్లో పెట్టుబడులపై వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉంది." అని పేర్కొన్నారు. ప్రతి త్రైమాసికంలో చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను కేంద్రం సమరిస్తుంది. ప్రస్తుత త్రైమాసికంలో, చిన్న పొదుపు పథకాలపై 4- నుండి 7.6% పరిధిలో వడ్డీ రేట్లు అమలవుతున్నాయి. ప్రస్తుతం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఏడాది వ్యవధి గల టర్మ్ డిపాజిట్లపై 5%, పోస్టల్​ డిపార్ట్​మెంట్ అందిస్తున్న సుకన్య సమృద్ది యోజనపై 7.6%, పిపిఎఫ్​పై 7.1%, ఎన్ఎస్​సీపై 6.8%, కిసాన్ వికాస్ పత్రా స్కీమ్​పై 6.9% వడ్డీ లభిస్తుంది. జులై​ 1 నుంచి ఈ వడ్డీ రేట్లను 6% లేదా అంతకంటే తక్కువగా చేసే అవకాశం ఉంది.
Published by:Krishna Adithya
First published: