హోమ్ /వార్తలు /బిజినెస్ /

Interest Rates: రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటును పెంచిన HDFC.. భారం కానున్న హోమ్ లోన్ ఈఎంఐలు..

Interest Rates: రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటును పెంచిన HDFC.. భారం కానున్న హోమ్ లోన్ ఈఎంఐలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

హౌసింగ్ లోన్‌లపై రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటు (ఆర్‌పీఎల్‌ఆర్)ని 5 బేసిస్ పాయింట్లు పెంచినట్లు తాజాగా హెచ్‌డీఎఫ్‌సీ ప్రకటించింది. దీంతో హోమ్ లోన్ ఈఎంఐ (EMI)లు మరింత భారం కానున్నాయి.

ప్రైవేటు రంగ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) తన కస్టమర్లకు(Customers) వరుస షాకులు ఇస్తోంది. ఈ బ్యాంక్ గడిచిన నెల కాలంలో ఇప్పటికే రెండు సార్లు గృహ రుణాల (Home Loans)పై వడ్డీ రేట్లు (Interest Rates) పెంచింది. దీంతో పెరిగిన ఈఎంఐల భారం వల్ల రుణగ్రహీతలు తల్లడిల్లుతున్నారు. ఈ నేపథ్యంలోనే మరొకసారి హౌసింగ్ లోన్‌లపై(Housing Loans) రిటైల్ ప్రైమ్ లెండింగ్(Retail Prime Lending) రేటు (ఆర్‌పీఎల్‌ఆర్)ని 5 బేసిస్ పాయింట్లు పెంచినట్లు తాజాగా హెచ్‌డీఎఫ్‌సీ(HDFC) ప్రకటించింది. దీంతో హోమ్ లోన్ ఈఎంఐ (EMI)లు మరింత భారం కానున్నాయి. అడ్జస్టబుల్ రేట్ హోమ్ లోన్‌ల బెంచ్‌మార్క్‌పై పెంచిన ఈ హౌసింగ్ లోన్‌ల రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్ (RPLR) పెంపు జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. హెచ్‌డీఎఫ్‌సీ గృహ రుణ రేట్లను పెంచడం నెల రోజుల్లో ఇది మూడోసారి కావడం గమనార్హం. గతంలో మే 2న ఇదే విధంగా 5 బేసిస్ పాయింట్లు పెంచగా, మే 9న గృహ రుణ రేట్లను 30 బేసిస్ పాయింట్లు పెంచింది.

తాజాగా అమల్లోకి వచ్చిన హెచ్‌డీఎఫ్‌సీ రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటు పెంపు వల్ల రుణగ్రహీతలకు గృహ రుణ ఈఎంఐలు 0.05 శాతం పెరిగాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత నెలలో రెపో రేట్లను 40 బేసిస్ పాయింట్లు పెంచింది. ఆ సమయం నుంచి అన్ని బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. భారతదేశం అంతటా పెచ్చరిల్లుతున్న ద్రవ్యోల్బణానికి కళ్లెం వేసేందుకు సెంట్రల్ బ్యాంక్ మళ్లీ రేట్లు పెంచుతుందని తెలుస్తోంది. ఇదే జరిగితే.. అన్ని రుణాలపై వడ్డీ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

Business Idea: ఇంటి నుంచే చేసే బిజినెస్.. నెలకు కనీసం రూ. 20 వేల ఆదాయం.. తెలుసుకోండి

సవరించిన గృహ రుణాల రేట్లు

i) రూ. 30 లక్షల వరకు లోన్‌లపై మహిళా కస్టమర్లకు 7.05 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది. ఈ రేట్ మునుపటి 7 శాతం కంటే 5 బేసిస్ పాయింట్లు పెరిగింది. ఇతర కస్టమర్‌లకు వడ్డీ రేట్లు 7.05 శాతం నుంచి 7.10 శాతానికి పెరిగాయి.

ii) రూ.30 లక్షల కంటే ఎక్కువ, రూ. 75 లక్షల కంటే తక్కువ రుణాలకు, మహిళా రుణగ్రహీతలు 7.35 శాతం వడ్డీని చెల్లించాలి. ఇతర కస్టమర్లు 7.40 శాతం చెల్లించాల్సి ఉంటుంది.

iii) రూ.75 లక్షలకు పైబడిన రుణాల విషయంలో, మహిళా రుణగ్రహీతలు 7.45 శాతం వడ్డీ రేటును చెల్లించాల్సి ఉంటుంది. గతంలో 7.40 శాతంగా ఉన్న ఈ వడ్డీ రేటు నెల కాలంలో 30 బేసిస్ పాయింట్ల పెరుగుదలతో 7.45 శాతానికి చేరుకుంది. ఇతర కస్టమర్లు 7.50 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.

రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్, అడ్జస్టబుల్ రేట్ హోమ్ లోన్‌లు అంటే ఏంటి?

రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్ అనేది బ్యాంక్స్ తమ కస్టమర్లకు రుణాలు ఇచ్చే రేటు. బ్యాంక్స్ తమ రుణాలను ప్రజలకు ఇచ్చినప్పుడు, ఆర్‌పీఎల్‌ఆర్ ఆ రేట్లకు బెంచ్‌మార్క్‌గా నిలుస్తుంది. ఈ రేట్ల సవరణ అంటే తదుపరి ఈఎంఐలు పెరుగుతాయని అర్థం. అడ్జస్టబుల్ రేట్ హోమ్ లోన్ అనేది ఫ్లోటింగ్ లేదా వేరియబుల్ వడ్డీ రేట్లు ఉన్న రుణం.

First published:

Tags: Hdfc, HDFC bank, HDFC Life, Home loans

ఉత్తమ కథలు