హోమ్ /వార్తలు /బిజినెస్ /

IT Return Filing: ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైల్ చేయలేదా..? అయితే మీకే నష్టం.. ఎందుకో ఇది చదవండీ..!

IT Return Filing: ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైల్ చేయలేదా..? అయితే మీకే నష్టం.. ఎందుకో ఇది చదవండీ..!

ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైలింగ్

ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైలింగ్

ఆదాయ పన్ను రిటర్న్స్(ITR) ఫైల్ చేయాల్సి ఉంటే.. చివరి రోజు వరకు వేచి ఉండకుండా ముందుగానే చేయడం మంచిది. గడువు తేదీ తర్వాత పన్ను రిటర్న్‌లను ఫైల్ చేయవచ్చు. కానీ పెనాల్టీలు, వడ్డీలు చెల్లించాల్సి వస్తుంది.

ఆదాయ పన్ను రిటర్న్స్(ITR) ఫైల్ చేయాల్సి ఉంటే.. చివరి రోజు వరకు వేచి ఉండకుండా ముందుగానే చేయడం మంచిది. చివరి నిమిషంలో తప్పులు, ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్ లోపాలు చాలా సాధారణం. దీనికి సంబంధించి జూన్ 2న ఆదాయపన్ను శాఖ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఒక సూచన చేసింది. ఆదాయపన్ను పోర్టల్‌లో జాప్యం గురించి పన్ను దాఖలు చేసేవారిని హెచ్చరించింది. అటువంటి జాప్యాలు కొనసాగితే, గడువు లోపు ఐటీఆర్‌ ఫైల్‌ చేయడం సాధ్యం కాకపోవచ్చు. గడువు తేదీ తర్వాత పన్ను రిటర్న్‌లను ఫైల్ చేయవచ్చు. కానీ పెనాల్టీలు, వడ్డీలు చెల్లించాల్సి వస్తుంది. పన్నులు చెల్లించాల్సిన ఆర్థిక సంవత్సరం పూర్తయిన వెంటనే వడ్డీ ప్రారంభమవుతుంది.

* గడువు తేదీ జులై 31

ఆదాయ పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 139 ప్రకారం, పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడానికి గడువు తేదీ సంబంధిత అసెస్‌మెంట్ ఇయర్‌లో జులై 31. కంపెనీ, అకౌంట్స్‌ను ఆడిట్ చేయాల్సిన అవసరం ఉన్న వ్యక్తి, సెక్షన్‌లో పేర్కొన్న ఇతరులకు గడువు మారుతుంది. కాబట్టి జీతాలు పొందే వ్యక్తులు, చిన్న వ్యాపారులు, వృత్తి నిపుణుల వంటి వారు 2021-22 ఆర్థిక సంవత్సరానికి ITRలను ఫైల్ చేయడానికి గడువు తేదీని 2022 జులై 31గా గుర్తించాలి.

* బిలేటెడ్‌ రిటర్న్స్‌ (Belated Returns)

ఐటీఆర్‌లను ఫైల్ చేయడానికి గడువు జులై 31 అయినప్పటికీ, అసెస్‌మెంట్ ఇయర్‌(ప్రస్తుతం 2022-23) డిసెంబర్ 31 వరకు రిటర్న్‌లను ఫైల్ చేయవచ్చు. కానీ దీనిని బిలేటెడ్‌ రిటర్న్‌ అంటారు. దీనికి వడ్డీతో పాటు జరిమానాలు కూడా చెల్లించాలి. బిలేటెడ్‌ రిటర్న్స్‌ను అసెస్‌మెంట్ ఇయర్‌ ముగియడానికి మూడు నెలల ముందు లేదా అసెస్‌మెంట్ పూర్తయ్యే ముందు, ఏది ముందుగా అయినా ఫైల్ చేయవచ్చు. 2021-22 కోసం ఆలస్యంగా రిటర్న్‌ను డిసెంబర్ 31, 2022 వరకు ఫైల్ చేయవచ్చు. అంటే 2022-23 అసెస్‌మెంట్ ఇయర్‌ మార్చి 31, 2023న ముగిసే మూడు నెలల ముందు.

ఇదీ చదవండి: ఆధార్ భద్రత కోసం యూఐడీఏఐ కొత్త ప్రయోగం.. ఏకంగా హ్యాకర్లను దించుతోంది! చదివితే ఆశ్చర్యపోతారు..


* బిలేటెడ్‌ రిటర్న్‌పై జరిమానా

రెగ్యులర్ రిటర్న్ దాఖలు చేయడం, బిలేటెడ్‌ రిటర్న్ దాఖలు చేయడం ఒకేలా ఉండవు. రిపోర్టు చేయాల్సిన మొత్తం ఆదాయం రూ. 5 లక్షలు దాటితే రిటర్నులు దాఖలు చేయడంలో ఆలస్యమైనందుకు రూ.5,000 జరిమానా విధిస్తారు. వ్యక్తి మొత్తం ఆదాయం రూ.5 లక్షల కంటే తక్కువ ఉంటే, అప్పుడు చెల్లించాల్సిన రుసుము రూ.1,000 వరకు ఉంటుంది. అసెస్‌మెంట్ ఇయర్‌ డిసెంబర్ 31 తర్వాత, ఎవరైనా స్వచ్ఛందంగా ఐటీఆర్‌లను ఫైల్ చేయలేరు. ఆ తర్వాత, ఆదాయపన్ను శాఖ సంబంధిత వ్యక్తి ఆదాయం, పన్ను వివరాలను పరిశీలించి, ఏం చేయాలో చెబుతుంది.

* చెల్లించాల్సిన పన్నులపై జరిమానా వడ్డీ

పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడంలో ఆలస్యానికి జరిమానా చెల్లించడమే కాకుండా.. ఆదాయ పన్నులు చెల్లించాల్సి ఉంటే జరిమానాపై కూడా వడ్డీని చెల్లించాలి. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 234 సకాలంలో పన్నులు చెల్లించడంలో జాప్యం చేసినందుకు విధించే జరిమానా వడ్డీని వివరిస్తుంది.

జరిమానాపై వడ్డీ ముందస్తు పన్ను మొదటి విడత నుంచి ప్రారంభమవుతుంది. వార్షిక ఆదాయ అంచనాల ఆధారంగా ముందస్తు పన్నులు నాలుగు వాయిదాలలో చెల్లించాలి. అవి జూన్ 15, సెప్టెంబర్ 15, డిసెంబర్ 15, మార్చి 15.

సెక్షన్ 234C ప్రకారం.. ముందస్తు పన్నులను సకాలంలో చెల్లించడంలో విఫలమైతే, చెల్లించే వరకు లేదా ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు ప్రతి నెలా 1 శాతం పెనాల్టీ లేదా దానిలో కొంత భాగాన్ని ఆదాయ పన్నుపై చెల్లించాల్సి ఉంటుంది. ఆర్థిక సంవత్సరం (ప్రస్తుతం ఆదాయాన్ని ఆర్జించే 2021-22) ముగిసిన తర్వాత, జులై 31 (పన్ను రిటర్న్‌ను దాఖలు చేయడానికి సాధారణ గడువు తేదీ) లోపు చెల్లించడానికి ఆదాయ పన్ను రిటర్న్‌లను సిద్ధం చేయడం ప్రారంభించాలి. పన్ను రిటర్నులను ఫైల్ చేసే సంవత్సరాన్ని అసెస్‌మెంట్ ఇయర్ అంటారు.

ఆర్థిక సంవత్సరం మార్చి 31 నాటికి ముందస్తు పన్నులో 90 శాతం చెల్లించకపోతే, ఏప్రిల్ 1 నుంచి సెక్షన్ 234b కింద జరిమానాపై వడ్డీ ప్రారంభమవుతుంది. అందుకే అసెస్‌మెంట్ ఇయర్‌ ప్రారంభమైన వెంటనే (ఏప్రిల్ 1) రిటర్న్‌ను దాఖలు చేయడం మంచిదని, చివరి నిమిషం వరకు (జులై 31) వేచి ఉండకూడదని పన్ను నిపుణులు అంటున్నారు. అసెస్‌మెంట్ ఇయర్‌లో ఏప్రిల్ 1, జులై 31 మధ్య పన్ను రిటర్న్‌లను ఎప్పుడు ఫైల్ చేస్తారనే దాని ఆధారంగా, సెక్షన్ 234b ప్రకారం, నెలకు పన్ను బకాయిలపై 1 శాతం వడ్డీని లేదా దానిలో కొంత భాగాన్ని చెల్లించాలి. గడువు తేదీ (జులై 31)లోపు రిటర్న్‌ను ఫైల్ చేయడంలో, పన్నులను చెల్లించడంలో విఫలమైతే, అసెస్‌మెంట్ ఇయర్‌ డిసెంబర్ 31లోపు ఆలస్యంగా పన్ను రిటర్న్‌ను ఫైల్ చేసే అవకాశం ఉంది.

* ఇతర డిసడ్వాంటేజస్‌

పెనాల్టీ, వడ్డీతో పాటు, ఆలస్యంగా రిటర్న్ దాఖలు చేయడం వల్ల ఇతర నష్టాలు కూడా ఉన్నాయి. ఆలస్యమైన రిటర్న్‌ను ఫైల్ చేసే సందర్భంలో, మదింపుదారుడు రీఫండ్‌ పొందేందుకు అర్హత ఉన్నా.. బిలేటెడ్‌ రిటర్న్‌పై జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ట్యాక్స్‌ ఇ-ఫైలింగ్, కంప్లైయెన్స్ మేనేజ్‌మెంట్ పోర్టల్ అయిన TaxManager.in చీఫ్ ఎగ్జిక్యూటివ్ దీపక్ జైన్ అన్నారు. ఎవరైనా ఆలస్యంగా రిటర్న్‌ను ఫైల్ చేసినప్పుడు, నష్టాలను ముందుకు తీసుకెళ్లలేమని సెహగల్ వివరించారు. సకాలంలో రిటర్న్‌లను ఫైల్ చేయకపోతే, 'క్యాపిటల్ గెయిన్' లేదా 'బిజినెస్ అండ్ ప్రొఫెషన్' కింద ఎటువంటి నష్టమూ చూపించలేరని చెప్పారు. ఒకవేళ ఆలస్యమైన రిటర్న్‌ను దాఖలు చేయడంలో అసెస్సీ విఫలమైతే, పన్ను చెల్లింపుదారు విచారణ నోటీసును అందుకోవచ్చు అని జైన్ చెప్పారు.

First published:

Tags: Income tax, IT Returns, ITR, ITR Filing

ఉత్తమ కథలు