RAISE 2020: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో దేశ ముఖచిత్రం మారడం ఖాయం...ముఖేష్ అంబానీ...

ముకేశ్ అంబానీ

130 కోట్ల భారతీయులు డిజిటల్ అక్షరాస్యత పొందితే, అది వేగంగా వృద్ధి చెందడంతో పాటు, మెరుగైన జీవన ప్రమాణాలు సృష్టించి, సమాజంలో ఉన్నతమైన అవకాశాలను కల్పిస్తుందని ముఖేష్ అంబానీ పేర్కొన్నారు.

 • Share this:
  "ఇంటెలిజెంట్ డేటానే డిజిటల్ పెట్టుబడి" అని ముఖేష్ అంబానీ పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) పై ఐదు రోజుల గ్లోబల్ వర్చువల్ సమ్మిట్‌ (global virtual summit on artificial intelligence,AI)ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఇందులో పరిశ్రమ, విద్యాసంస్థల భాగస్వామ్యంతో రైస్ 2020 (RAISE 2020) పేరిట ఈ సదస్సు జరగనుంది. ఈ సదస్సు ముఖ్య ఉద్దేశ్యం బాధ్యతాయుతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏర్పాటులో ప్రభుత్వ, సంస్థ పాత్ర గురించి చర్చించనున్నారు. ముఖ్యంగా ఆరోగ్యం, విద్య, వ్యవసాయ రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకమే లక్ష్యంగా ఈ సదస్సును ప్రారంభించారు. సదస్సు ప్రారంభ వేడుకలో రిలయన్స్ సంస్థల చైర్మన్ ముఖేష్ అంబానీ ప్రారొంభోపన్యాసం చేశారు.

  5 జి టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినప్పటికీ, ఈ రంగంలో భారతదేశం తన నాయకత్వ స్థానాన్ని కొనసాగిస్తుందని ముఖేష్ అంబానీ RAISE 2020 ప్రారంభ ఉపన్యాసంలో ప్రధానంగా పేర్కొన్నారు. దేశంలోని సుదూర ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్‌ను వ్యాప్తి చేయడానికి ఫైబర్ ఆప్టిక్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌ ద్వారా సాధ్యం అవుతుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. అలాగే భారతదేశం డిజిటల్ విప్లవంలో పెరుగుతున్న డేటా సెంటర్లు, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ప్రాముఖ్యతను వివరించారు.

  130 కోట్ల భారతీయులు డిజిటల్ అక్షరాస్యత పొందితే, అది వేగంగా వృద్ధి చెందడంతో పాటు, మెరుగైన జీవన ప్రమాణాలు సృష్టించి, సమాజంలో ఉన్నతమైన అవకాశాలను కల్పిస్తుందని ముఖేష్ అంబానీ పేర్కొన్నారు. దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)అభివృద్ధి చేయడం ద్వారా భారతీయులందరికీ సులువుగా టెక్నాలజీ అందుబాటులోకి వస్తుందని ఆయన ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే RAISE 2020 AI సమ్మిట్ ద్వారా కోవిడ్ -19 మహమ్మారి వల్ల ఎదురయ్యే కష్టాలను అధిగమించాలనే ఆశలను పెంచుతుందని పేర్కొన్నారు. AI ద్వారా భారతదేశ భవిష్యత్తు భద్రంగా ఉంటుందని ఈ సందర్భంగా ముఖేష్ అంబానీ పేర్కొన్నారు. ముఖ్యంగా "ఇంటెలిజెంట్ డేటానే డిజిటల్ పెట్టుబడి" అని ముఖేష్ అంబానీ పేర్కొన్నారు.

  ఐదు రోజుల సదస్సులో... విప్రో లిమిటెడ్ చైర్‌పర్సన్ రిషద్ ప్రేమ్‌జీ, మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ అధ్యక్షుడు బ్రాడ్ స్మిత్, ప్రపంచ ఎకనమిక్ ఫోరంలో ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ చీఫ్ సలహాదారు జె.సత్యనారాయణ, వాద్వానీ ఇన్స్‌స్టిట్యూట్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ అయిన రాహుల్ పాణికర్, స్టాండర్ట్ చార్చర్డ్ బ్యాంక్ చీఫ్ డేటా ఆఫీసర్ షమీక్ కుందు తదితరులు ప్రసంగిస్తారు.

  RAISE 2020 ద్వారా ఆరోగ్యరంగం, వ్యవసాయం, విద్య వంటి రంగాల్లో సమాజిక సాధికారత సాధించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఎలా వాడాలనే అంశంపై ఆతిథ్య దేశాలు తమ ఆలోచనలను పంచుకుంటాయి.

  ప్రజా మోలిక సదుపాయాలకు AI వాడకం ఎలా అనే అంశంపై ఈ సదస్సులో చర్చిస్తారు. అలాగే సామాజిక సాధికారత, సమాజంలో సరికొత్త మార్పులకు AIని బాధ్యతాయుతంగా ఎలా అభివృద్ధి చేయాలో మాట్లాడుకుంటారు. ఇప్పటివరకూ 125 దేశాల నుంచి 38,700 మంది విద్యాసంస్థలు, పరిశోధనా సంస్థల ప్రతినిధులు, ప్రభుత్వ ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొనేందుకు రిజిస్టర్ చేసుకున్నారు. ఈ సదస్సు ద్వారా భారత ఆర్థిక వ్యవస్థ లోకి 2035 నాటికి 957 బిలియన్ డాలర్లు వస్తాయని అంచనా వేస్తున్నారు ఇండస్ట్రీ విశ్లేషకులు.

  జూన్‌లో ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, న్యూజిలాండ్ మరిన్ని ఇతర దేశాలు చేతులు కలిపాయి. అన్నీ కలిసి గ్లోబల్ పార్ట్‌నర్‌షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (GPAI)గా ఏర్పడ్డాయి. ఇవి కృత్రిమ మేథోశక్తి (AI)ని బాధ్యతాయుతంగా ఉపయోగిస్తూ అభివృద్ధిని సాధించడమే లక్ష్యంగా పనిచేయనున్నాయి.
  Published by:Krishna Adithya
  First published: