Intel-Jio Deal: రిలయెన్స్ జియోతో ఇంటెల్ డీల్... రూ.1,894.50 కోట్ల పెట్టుబడులు

Intel-Jio Deal | రిలయెన్స్ జియో ఇటీవల కుదుర్చుకున్న 12వ డీల్ ఇది. 11 వారాల్లో ఈ డీల్స్ కుదుర్చుకోవడం విశేషం. ఈ డీల్‌తో జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి రూ.1,17,588.45 కోట్ల పెట్టుబడులు రానున్నాయి.

news18-telugu
Updated: July 3, 2020, 8:38 AM IST
Intel-Jio Deal: రిలయెన్స్ జియోతో ఇంటెల్ డీల్... రూ.1,894.50 కోట్ల పెట్టుబడులు
Intel-Jio Deal: రిలయెన్స్ జియోతో ఇంటెల్ డీల్... రూ.1,894.50 కోట్ల పెట్టుబడులు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
రిలయెన్స్ జియోలోకి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. జియో ప్లాట్‌ఫామ్స్‌తో అమెరికాకు చెందిన మల్టీ నేషనల్ కంపెనీ ఇంటెల్ ఒప్పందం కుదుర్చుకుంది. రూ.1894.50 కోట్ల పెట్టుబడులతో 0.39 శాతం వాటాలు చేజిక్కించుకోబోతోంది. సెమీ కండక్టర్ ఇండస్ట్రీ దిగ్గజం అయిన ఇంటెల్ కార్పొరేషన్‌కు చెందిన పెట్టుబడి సంస్థ ఇంటెల్ క్యాపిటల్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అటానమస్ వెహికిల్స్, డాటా సెంటర్ అండ్ క్లౌడ్, 5జీ, నెక్స్ట్ జనరేషన్ కంప్యూటర్ లాంటి రంగాల్లో రాణిస్తున్న స్టార్టప్స్‌లో ఇంటెల్ క్యాపిటల్ ఇన్నోవేటీవ్ పెట్టుబడులు పెడుతోంది. ఇప్పటి వరకు ఇంటెల్ క్యాపిటల్ ప్రపంచ వ్యాప్తంగా 1,582 కంపెనీలు, 692 పోర్ట్‌ఫోలియో కంపెనీల్లో 12.9 యూఎస్ డాలర్లను ఇన్వెస్ట్ చేసింది.అమెరికాకు చెందిన ఇంటెల్ ఎంఎన్‌సీ 2 దశాబ్దాలుగా భారతదేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇండియాలో వేలాది మంది ఇంటెల్ సంస్థలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంటెల్‌కు హైదరాబాద్‌తో పాటు బెంగళూరులో కార్యాలయాలున్నాయి.

ఇంటెల్‌తో కలిసి పనిచేయడానికి సంతోషిస్తున్నాము. భారతదేశంలో అన్ని రంగాలను శక్తివంతం చేసే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలలో దేశ సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి ఈ డీల్ ఉపయోగపడుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థను, 130 కోట్ల భారతీయుల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది.

ముఖేష్ అంబానీ, ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్


Intel Reliance Jio, reliance jio, Reliance Jio deal, Reliance Industries limited, Jio deals, Jio platforms deals, ఇంటెల్ రిలయెన్స్ జియో డీల్, జియో ఇంటెల్ డీల్, రిలయెన్స్ జియో, జియో ప్లాట్‌ఫామ్స్ డీల్స్, జియో డీల్స్, రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్

రిలయెన్స్ జియో ఇటీవల కుదుర్చుకున్న 12వ డీల్ ఇది. 11 వారాల్లో ఈ డీల్స్ కుదుర్చుకోవడం విశేషం. ఈ డీల్‌తో జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి రూ.1,17,588.45 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ప్రపంచంలోనే ఇంత భారీగా పెట్టుబడులు సేకరించిన కంపెనీగా రిలయెన్స్ జియో రికార్డు సృష్టించింది. భారతదేశంలో స్టార్టప్ ఎకోసిస్టమ్‌లోకి గతేడాది రూ.1.10 లక్షల పెట్టుబడులు వచ్చాయి. ఇప్పటివరకు ఇదే ఎక్కువ. దీంతో పోల్చినా జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి వచ్చిన పెట్టుబడులే ఎక్కువ.

ఏప్రిల్ 22 నుంచి రిలయెన్స్ జియో వరుసగా డీల్స్ కుదుర్చుకుంటోంది. ఫేస్‌బుక్, జనరల్ అట్లాంటిక్, సిల్వర్ లేక్ రెండుసార్లు, విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్, కేకేఆర్, ముబదాల ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ, ఏడీఐఏ, టీపీజీ, ఎల్ క్యాటర్టాన్, పీఐఎఫ్ సంస్థలు జియో ప్లాట్‌ఫామ్స్‌తో డీల్స్ కుదుర్చుకున్నాయి.
First published: July 3, 2020, 8:37 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading