హోమ్ /వార్తలు /బిజినెస్ /

BIMA Sugam: బీమా సుగంకు గ్రీన్ సిగ్నల్.. ఇక, అన్ని బీమా సేవలు ఒకే చోట.. ఎలా పని చేస్తుందంటే..

BIMA Sugam: బీమా సుగంకు గ్రీన్ సిగ్నల్.. ఇక, అన్ని బీమా సేవలు ఒకే చోట.. ఎలా పని చేస్తుందంటే..

BIMA Sugam: బీమా సుగంకు గ్రీన్ సిగ్నల్.. ఇక, అన్ని బీమా సేవలు ఒకే చోట.. ఎలా పని చేస్తుందంటే..

BIMA Sugam: బీమా సుగంకు గ్రీన్ సిగ్నల్.. ఇక, అన్ని బీమా సేవలు ఒకే చోట.. ఎలా పని చేస్తుందంటే..

BIMA Sugam: పాలసీని కొనుగోలు చేయడం నుంచి సెటిల్‌మెంట్ క్లెయిమ్ చేసే వరకు అన్ని బీమా సేవలను ఒకే చోట అందించేందుకు తాజాగా బీమా రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ) నడుం బిగించింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఈ రోజుల్లో ప్రజలు అన్ని సేవలను డిజిటల్‌గా ఒకే దగ్గర పొందాలని కోరుకుంటున్నారు. అయితే ఈ విషయంలో ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ (Insurance Industry) కాస్త వెనకబడిందనే చెప్పాలి. అయితే ఇప్పుడు ఈ రంగం కూడా ముందడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా పాలసీని కొనుగోలు చేయడం నుంచి సెటిల్‌మెంట్ క్లెయిమ్ చేసే వరకు అన్ని బీమా సేవలను ఒకే చోట అందించేందుకు తాజాగా బీమా రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ) నడుం బిగించింది. ఈ మేరకు ‘బీమా సుగం (BIMA Sugam)’కు ఆమోదం తెలిపింది. ఈ బీమా సుగం అనేది అన్ని ఇన్సూరెన్స్ సర్వీసులకు వన్ స్టాప్ డెస్టినేషన్‌గా నిలవనుంది.

* అన్ని డాక్యుమెంట్లు సేఫ్‌

బీమా సుగం కింద, డీమ్యాట్ ఫార్మాట్‌లో పాలసీదారులకు E-BIMA లేదా E-IA అకౌంట్ అందుబాటులో ఉంటుంది. ఈ అకౌంట్‌తో ఫిజికల్ డాక్యుమెంట్స్ మేనేజ్ చేయాల్సిన అవసరం రాదు. అలానే వాటిని భద్రంగా ఉంచుకునే పాట్లు తప్పుతాయి. అంతేకాదు, ఇన్సూరెన్స్‌కు సంబంధించి అన్ని డాక్యుమెంట్లు చాలా సేఫ్‌గా ఉంటాయి. రెన్యువల్ సమయంలో ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సిన అవసరం కూడా రాదు. ఈ 'బీమా సుగం'ను జనవరి 2023 నాటికి అమలు చేయాలని ఐఆర్‌డీఏఐ (IRDA) బీమా కంపెనీలను కోరింది.

బీమా సుగం ఎక్స్‌ఛేంజ్‌ని IRDA పర్యవేక్షిస్తుంది. ఈ బీమా సుగం ప్లాట్‌ఫామ్ ఇనిషియల్ క్యాపిటల్‌గా దాదాపు రూ.85 కోట్లు అవసరం కానుండగా.. లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ 30% (రూ.25 కోట్లు), జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ 30% (రూ.25 కోట్లు), ఆన్‌లైన్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ 35% (రూ.30 కోట్లు), బ్రోకర్స్ అసోసియేషన్ 5% (రూ.3 కోట్లు) నిధులు అందించనున్నాయి. బీమా సుగం కార్యకలాపాలకు మరిన్ని నిధులు అవసరం కాబట్టి, మరిన్ని బీమా కంపెనీలు పెట్టుబడిదారులుగా చేరతాయి.

* బీమా సుగం అంటే ఏంటి, ఇది ఎలా వర్క్ అవుతుంది?

బీమా సుగం అనేది ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ లాంటి ఒక ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్. అమెజాన్‌లో ప్రతిదీ ఎలా అమ్మకానికి పెడతారో బీమా సుగంలో కూడా అలానే అన్ని జీవిత, సాధారణ బీమా పాలసీలు సేల్‌కి అందుబాటులో ఉంచుతారు. ఒక లిస్టు ప్రకారం ఇవన్నీ చాలా చక్కగా కనిపిస్తాయి. బీమాలకు సెంట్రలైజ్డ్ మార్కెట్‌ప్లేస్‌గా పనిచేసే ఈ ఫ్లాట్‌ఫామ్ లైఫ్, జనరల్ పాలసీల కోసం విక్రయం, సర్వీసింగ్, క్లెయిమ్ ఫంక్షన్లను హోస్ట్ చేస్తుంది.

ఇది కూడా చదవండి : గుడ్ న్యూస్.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ పెంచిన ప్రైవేట్ బ్యాంకులు.. వడ్డీ రేట్లు ఇవే..

* అన్ని ప్రొడక్ట్స్‌ కొనుగోలు చేసే అవకాశం

ఈ ఫ్లాట్‌ఫామ్‌లో మధ్యవర్తులు, బ్రోకర్లు, బ్యాంకులు, బీమా ఏజెంట్లు, పాలసీబజార్ వంటి అగ్రిగేటర్లు బీమా పాలసీలను ప్రజలకు విక్రయిస్తారు. ప్రజలు ఈ ప్లాట్‌ఫామ్ నుంచి నేరుగా లైఫ్, మోటార్, ఆరోగ్య బీమా ప్రొడక్ట్స్ కూడా కొనుగోలు చేయవచ్చు. బీమా సుగం ద్వారా కొనుగోలు చేసిన అన్ని బీమా పాలసీలు డిజిటలైజ్ అవుతాయి. బీమా సుగంతో పాలసీదారులకు చాలా ప్రయోజనం కలగనుంది.

ముఖ్యంగా మధ్యవర్తులకు చెల్లించే కమీషన్లు కట్టాల్సిన అవసరం రాదు. తద్వారా వారు బీమా ఖర్చును తగ్గించుకోవడం సాధ్యమవుతుంది.అంతేకాకుండా, దీని ద్వారా కమీషన్లుగా చెల్లించే జీవిత బీమా ప్రీమియం మొత్తాన్ని దాదాపు 30% నుంచి 5%కి తగ్గించవచ్చని ఒక నివేదిక పేర్కొంది. బయ్ ఇన్సూరెన్సు పాలసీ, క్లెయిమ్ సెటిల్‌మెంట్, ఏజెంట్ పోర్టబిలిటీ, పాలసీ పోర్టబిలిటీ వంటి అన్ని సేవలకు వన్‌-స్టాప్ డెస్టినేషన్‌గా మారే బీమా సుగం భవిష్యత్తులో బీమా రంగంలో అతిపెద్ద సంస్కరణగా అవతరించవచ్చు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Insurance, Irdai, Personal Finance

ఉత్తమ కథలు