ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్(Demand) పెరుగుతోంది. ఇండియాలో కూడా ఎక్కువ మంది ఈవీలకు మారుతున్నారు. ఈ సెగ్మెంట్లోకి చాలా ఆటో కంపెనీలు అడుగు పెడుతున్నాయి. అయితే ఇటీవల ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ బైక్‌లలో(Electric Bikes) మంటలు చెలరేగిన ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో ఎలక్ట్రిక్ బైక్‌ల నాణ్యతపై ఆరోపణలు వచ్చాయి. అయినా ఈవీలకు డిమాండ్ తగ్గలేదు. ఇప్పుడిప్పుడే ఈ సెగ్మెంట్ అభివృద్ధి చెందుతున్నా.. జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ విభాగంపై దృష్టి సారించాయి. బజాజ్ అలియాంజ్ జనరల్, HDFC ERGO వంటి ఇన్సూరెన్స్ కంపెనీలు ఎలక్ట్రిక్ కార్ల కోసం ప్రత్యేక సేవలను అందించే ప్రత్యేక పోర్టల్‌లను కూడా లాంచ్ చేశాయి. ఎలక్ట్రిక్ వాహనాల ఇన్సూరెన్స్ ఆప్షన్ల గురించి తెలుసుకుందాం.
* ఎలక్ట్రిక్ వాహనాలకు ఇన్సూరెన్స్
పర్యావరణ పరిరక్షణకు ప్రపంచ దేశాలు కట్టుబడి ఉన్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలపై రాయితీలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈవీ రంగం మరింత అభివృద్ధి సాధిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఈవీలపై కేంద్ర ప్రభుత్వం పన్ను ప్రయోజనాలను ప్రకటించింది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) ఎలక్ట్రిక్ వాహన ఇన్సూరెన్స్ కోసం డిస్కౌంట్ థర్డ్-పార్టీ లయబిలిటీ ప్రీమియం రేట్లను తప్పనిసరి చేసింది.
భవిష్యత్తులో ఈ విభాగంలోకి ప్రవేశించడానికి, ఇన్సూరెన్స్ కంపెనీలు అదనపు సేవలు, కవరేజీని అందించడం ప్రారంభించాయి. EV హెల్ప్‌లైన్, SOS, ఛార్జింగ్ సమాచారాన్ని'EVforAll' సర్వీస్ అంబ్రెల్లా ద్వారా బజాజ్ అలయన్జ్ జనరల్ ఇన్సూరెన్స్ అందిస్తోంది. మరమ్మతులు, వైద్య సహాయం తదితర సేవలకు ఇవి అదనం. ఇంతకుముందు HDFC ERGO ఇదే విధమైన ప్లాట్‌ఫారమ్ 'AllthingsEV'ని ప్రారంభించింది. ఇది EV ఎంపికలు, ధర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సబ్సిడీలు, సమీపంలోని ఛార్జింగ్ స్టేషన్లు మొదలైన వాటిపై సమాచారాన్ని అందిస్తుంది.
* అగ్ని ప్రమాదాలతో ఆందోళనలు
EVలు పర్యావరణ అనుకూలమైనవి, దీర్ఘకాలంలో ఖర్చును ఆదా చేస్తాయి. అయితే ఇటీవలి నెలల్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు సంబంధించిన వరుస అగ్ని ప్రమాదాలు భద్రతా ఆందోళనలకు దారితీశాయి. ఎక్కువ ప్రమాదాలు ఎలక్ట్రిక్ బైక్‌లలో జరిగాయని, కాబట్టి ఎలక్ట్రిక్ కార్లపై ప్రీమియంలు పెద్దగా ప్రభావితం కాలేదని ఓ ఇన్సూరెన్స్ కంపెనీకి చెందిన అధికారి తెలిపారు. ఎలక్ట్రిక్ బైక్‌లపై కొన్ని కంపెనీలు టారిఫ్‌పై తగ్గింపులను ప్రకటించాయని చెప్పారు. ఇది పాలసీదారులకు 10 శాతం వరకు ప్రీమియం భారం పెంచిందని అన్నారు.
అయితే ఇటువంటి ప్రమాదాలు ప్రీమియం రేట్లను పెంచవని లేదా EV ఇన్సూరెన్స్ కంపెనీల సేవలకు అడ్డు కావని కొందరు పరిశ్రమ అధికారులు అభిప్రాయపడుతున్నారు. భారతీయ రహదారులపై నడుస్తున్న EVల సంఖ్య ఇప్పటికీ చాలా తక్కువగా ఉందని, దురదృష్టకర సంఘటనలతో EV ప్రీమియంలు ప్రభావితం కాలేదని బజాజ్ అలయన్జ్ జనరల్ ఇన్సూరెన్స్ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ TA రామలింగం మనీకంట్రోల్‌తో చెప్పారు.
* సవాళ్లను అధిగమించాలి
ఎలక్ట్రిక్ వెహికల్ ఇన్సూరెన్స్ విభాగంలో వృద్ధి EV స్పేస్‌తో ముడిపడి ఉందని రామలింగం అన్నారు. పర్యావరణ ప్రయోజనాలు అర్థం చేసుకున్నా ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయడానికి అయ్యే ఖర్చు చాలా మందిని దూరం చేస్తుందన్నారు. ఈ రంగంలో కంపెనీలకు గణనీయమైన అనుభవం లేదని, బ్యాటరీలతో సంబంధం ఉన్న సమస్యలపై కొన్ని ఆందోళనలు ఉన్నాయని అన్నారు. EV రంగం ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల అధిక ధరలు, మౌలిక సదుపాయాల కొరత వంటి అడ్డంకులను ఎదుర్కొంటున్నప్పటికీ ఛార్జింగ్ స్టేషన్లు, పరిస్థితి వేగంగా మెరుగుపడుతోందని తెలిపారు.
* కవరేజీ, మినహాయింపులు
ఈవీలకు కవరేజీ నిబంధనలు ఇతర వాహన బీమాల మాదిరిగానే ఉంటాయి. సంప్రదాయ ఇంధనంతో నడిచే వాహనాలతో పోలిస్తే కొనుగోలు ఖర్చు ఎక్కువగా ఉన్నందున ప్రీమియంలు ఎక్కువగా ఉంటాయి. నిర్దిష్ట మినహాయింపులు లేనప్పటికీ, ఇన్సూరెన్స్ కంపెనీలు ఇంకా EVల కోసం ప్రత్యేకంగా కవర్లను రూపొందించలేదు. నిర్దిష్ట యాడ్-ఆన్‌లను అభివృద్ధి చేయడానికి కంపెనీలు కృషి చేస్తున్నాయి. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు అగ్ని ప్రమాదాలలో చిక్కుకున్నప్పుడు, కొన్ని మోడళ్లను తయారీదారులు రీకాల్ చేసారు, ఇలాంటి వాటికి కవర్ లభించదని రామలింగం చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.