వివిధ బీమా పాలసీల్లో ఇన్వెస్ట్(Invest) చేయడం ద్వారా ఆదాయ పన్ను చట్టం- సెక్షన్(Section) 80సీ కింద పన్ను ఆదా చేసుకోవచ్చని మీకు తెలుసా? భవిష్యత్తుపై భరోసానిచ్చే బీమా పాలసీలు(Insurence Policy) పన్ను ఆదాలోనూ సహాయపడతాయి. అయితే కేవలం పన్నుల ఆదా కోసమే బీమా పాలసీ (it relaxation policy) కొనుగోలు చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఆదాయంలో పెట్టుబడులు ఎంత ముఖ్యమో.. వీలైనంత ఎక్కువ రాబడినిచ్చే ప్రొడక్ట్స్‌లో పెట్టుబడి పెట్టడమూ అంతే ముఖ్యం. పన్ను చెల్లింపులే(it returns) కాకుండా వాటి ఆదా కోసం ఐటీ చట్టం ఈ వెసులుబాటు కల్పిస్తోంది. పన్ను ఆదా చేసేందుకు సహాయపడే అందుబాటులో ఉన్న పాలసీల వివరాలు మీకోసం..
టర్మ్ ఇన్సూరెన్స్ (Term Insurence) పాలసీలు..
ఓ వ్యక్తి ఆర్థిక ప్రణాళికలో తప్పనిసరిగా ఉండాల్సిన పాలసీ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్(Term Life Insurance). 1961 ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80C ప్రకారం మీపై ఆధారపడిన వారికి ఆర్థిక భరోసా కల్పించే ఈ పాలసీకి చెల్లించే ప్రీమియంపై పన్ను మినహాయింపు ఉంది. దీనికింద గరిష్ఠంగా 1.5 లక్షల రూపాయల వరకు ఆదా చేయవచ్చు. తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, పిల్లలకు టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్‌ని కొనుగోలు చేయవచ్చు.
అయితే టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో పెట్టుబడుల ద్వారా సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ప్రయోజనం పొందాలంటే.. 2012 ఏప్రిల్ 1కి ముందు తీసుకున్న పాలసీల ప్రీమియం మొత్తంలో 20శాతానికి మించకూడదు. అంతేకాకుండా 2012 ఏప్రిల్ 1 తర్వాత కొనుగోలు చేసిన పాలసీల ప్రీమియం మొత్తం 10శాతానికి దాటకూడదు. ఇక పాలసీదారు మరణానంతరం నామినీకి వచ్చే సొమ్ముపై పన్ను ఉండదు.
యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ (ULIP)..
ఆదాయపు పన్ను చట్టంలోని 80C, 10 (10D) సెక్షన్ల కింద ULIPలో 2.5 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టడం ద్వారా పన్ను ఆదా చేసుకోవచ్చు. మెచ్యూరిటీ తర్వాత వచ్చే రిటర్న్‌లపై పన్ను ఉండదు. ఈ పాలసీలో గరిష్ఠ రాబడి పొందాలంటే చైల్డ్ ప్లాన్‌లో పెట్టుబడి పెడితే మేలని నిపుణులు సూచిస్తున్నారు.
ఎండోమెంట్ పాలసీ(Endoment Policy)..
ఎండోమెంట్ పాలసీ జీవిత బీమా పాలసీ.. కుటుంబం అంతటికీ కవరేజీని అందించే ఉత్తమ ప్లాన్. పాలసీ మెచ్యూరిటీపై మొత్తం అమౌంట్‌ను ఒకేసారి పొందొచ్చు. దీనికింద 1.5 లక్షల రూపాయల వరకు చెల్లించే ప్రీమియంపై పన్ను మినహాయింపు ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C కింద ఐటీ మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. అంటే పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని తగ్గించేందుకు ఈ పాలసీ ఉపకరిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Insurence