Insurance for healthcare workers: ఆరోగ్య సంరక్షణ కార్యకర్తల ఇన్సూరెన్స్ పాలసీ రద్దు.. త్వరలోనే కొత్త పాలసీ..

Insurance for healthcare workers: ఆరోగ్య సంరక్షణ కార్యకర్తల ఇన్సూరెన్స్ పాలసీ రద్దు.. త్వరలోనే కొత్త పాలసీ..

Bajaj Allianz: క్రిటి-కేర్ పాలసీ ప్రకటించిన బజాజ్ అలియాంజ్... 43 తీవ్ర అనారోగ్యల కవరేజీ (ప్రతీకాత్మక చిత్రం)

కోవిడ్ నేపథ్యంలో హెల్త్ కేర్ వర్కర్ల కోసం భారత ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ఇన్సూరెన్స్ పాలసీ ఈ నెల 24న ముగుస్తుందని అధికారులు ప్రకటించారు. కరోనా రోగులకు చికిత్స అందించే డాక్టర్లు, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తల కోసం కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ప్రత్యేకంగా ఇన్సూరెన్స్ పాలసీని ప్రవేశపెట్టింది.

  • Share this:
కోవిడ్ నేపథ్యంలో హెల్త్ కేర్ వర్కర్ల కోసం భారత ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ఇన్సూరెన్స్ పాలసీ ఈ నెల 24న ముగుస్తుందని అధికారులు ప్రకటించారు. కరోనా రోగులకు చికిత్స అందించే డాక్టర్లు, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తల కోసం కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ప్రత్యేకంగా ఇన్సూరెన్స్ పాలసీని ప్రవేశపెట్టింది. దీని కింద కోవిడ్-19 డ్యూటీ చేస్తూ మహమ్మారి కారణంగా చనిపోయిన హెల్త్ కేర్ వర్కర్లకు రూ.50 లక్షల ఇన్సూరెన్స్ పాలసీ వర్తిస్తుంది. స్వల్ప కాలానికి ఉద్దేశించిన ఈ పాలసీ కాలవ్యవధి ఏప్రిల్ 24తో పూర్తిగా ముగియనుంది. దీని స్థానంలో కొత్త పాలసీని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

ఇన్సూరెన్స్ పాలసీ ముగింపుపై కేంద్ర ఆరోగ్య శాఖ.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సమాచారం ఇచ్చింది. గత ఏడాది కరోనా విజృంభణ తరువాత మహమ్మారిని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.1.7 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో భాగంగా కరోనా రోగులకు చికిత్స అందించే వైద్య సిబ్బందికి రూ.50 లక్షల ఇన్సూరెన్స్ ప్యాకేజీని ప్రకటించారు.

గతంలోని ముగిసిన పాలసీ కాలవ్యవధి
ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీలో భాగంగా కోవిడ్‌తో పోరాడుతున్న ఆరోగ్య సంరక్షణ కార్యకర్తల కోసం గత ఏడాది మార్చి 30న కేంద్రం ఇన్సూరెన్స్ పాలసీని ప్రకటించింది. ముందు దీన్ని 90 రోజుల కోసమే తీసుకువచ్చినప్పటికీ, ఆ తరువాత పాలసీ వ్యవధిని 2021 మార్చి 24 వరకు పొడిగించింది. నిజానికి పాలసీ కాలవ్యవధి మార్చి 24న ముగిసింది. దీంతో పాలసీ దారుల తుది క్లెయిం సెటిల్మెంట్‌ను ఏప్రిల్ 24 వరకు పూర్తి చేయాలని కేంద్రం కోరింది. "పాలసీకి అర్హత ఉన్న క్లెయింల సెటిల్మెంట్‌ల కోసం ఏప్రిల్ 24 వరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాం. ఈలోపు అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించాలి" అని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్‌లో ఉంది.

త్వరలో కొత్త పాలసీ
కోవిడ్-19పై పోరాడుతున్న ఆరోగ్య సంరక్షణ కార్యకర్తల కోసం త్వరలో కొత్త ఇన్సూరెన్స్ పాలసీని అందుబాటులోకి తీసుకువస్తామని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ట్వీట్ చేసింది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద లబ్ధిదారులకు కొత్త పాలసీని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు న్యూ ఇండియా ఎస్యూరెన్స్ కంపెనీతో చర్చలు జరుపుతున్నామని ట్వీట్‌లో పేర్కొంది. గత పాలసీ క్లెయిం సెటిల్మెంట్లు ఏప్రిల్ 24 లోపు పూర్తికానున్నాయి. ఆ తరువాత కొత్త పాలసీ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

తక్కువ సంఖ్యలో క్లెయింలు
కరోనాపై పోరులో కీలక పాత్ర పోషిస్తున్న సుమారు 22 లక్షల మంది ఫ్రంట్ లైన్ వర్కర్లకు గత ఏడాది నుంచి ప్రభుత్వం బీమా కల్పిస్తోంది. పారిశుద్ధ్య కార్మికులు, వార్డ్ బాయ్స్, నర్సులు, ఆశా వర్కర్లు, పారామెడికల్ సిబ్బంది, టెక్నీషియన్లు, డాక్టర్లు, స్పెషలిస్టులు, ఇతర ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలను పాలసీ పరిధిలోకి తీసుకువచ్చింది. ఈ పథకాన్ని ప్రైవేట్ రంగంలోని సిబ్బందికి కూడా వర్తింపజేశారు. ఈ జనవరి వరకు కోవిడ్-19తో 162 మంది డాక్టర్లు, 107 మంది నర్సులు, 44 మంది ఆశా వర్కర్లు చనిపోయినట్లు అధికారిక వర్గాలు ప్రకటించాయి. గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ ఇన్సూరెన్స్ పాలసీ కింద ఇప్పటివరకు 287 క్లెయింలకు కేంద్రం ఆమోదం తెలిపింది. కానీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాత్రం ఇంతకంటే ఎక్కువమంది చనిపోయినట్లు పేర్కొంది.
First published:

అగ్ర కథనాలు