Home /News /business /

INSURANCE COMPANY LAUNCHES PLAN FOR DIABETES AND HYPERTENSION PATIENTS UMG GH

Health Insurance: షుగర్, బీపీ ఉన్నవాళ్లకి బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్.. ఈ పాలసీలో బెనిఫిట్స్ ఏంటో తెలుసా..?

షుగర్, బీపీ ఉన్నవాళ్లకి బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్..

షుగర్, బీపీ ఉన్నవాళ్లకి బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్..

మధుమేహం, రక్తపోటు ఉన్నవారి కోసం కొత్త పాలసీని ప్రారంభించింది నివా బుపా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ. స్మార్ట్ హెల్త్+ డిసీజ్ మేనేజ్‌మెంట్ ప్లాన్‌గా పేర్కొనే కొత్త రైడర్ ప్లాన్ 1వ రోజు నుంచి మధుమేహం, రక్తపోటు, సంబంధిత సమస్యలకు కవరేజీని అందిస్తుంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
మధుమేహం, రక్తపోటు ఉన్నవారి కోసం కొత్త పాలసీని ప్రారంభించింది నివా బుపా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ. స్మార్ట్ హెల్త్+ డిసీజ్ మేనేజ్‌మెంట్ ప్లాన్‌గా పేర్కొనే కొత్త రైడర్ ప్లాన్ 1వ రోజు నుంచి మధుమేహం, రక్తపోటు, సంబంధిత సమస్యలకు కవరేజీని అందిస్తుంది. భారతదేశంలో మధుమేహం, రక్తపోటు వ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఈ పాలసీని కంపెనీ ప్రారంభించింది. రీఅష్యూర్ ప్లాన్ కోసం సైన్ అప్ చేసే వారికి రైడర్ అందుబాటులో ఉంది. ‘మధుమేహం, రక్తపోటుతో బాధపడే కస్టమర్లు ఆసుపత్రిలో చేరే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వారికి తక్షణమే కవరేజీ అవసరం. ఈ రోగులు ఆందోళన చెందకుండా ఉండటం కోసం కొత్త పాలసీని తీసుకొచ్చాం.’ అని కంపెనీ పేర్కొంది.

* వెయిటింగ్‌ పీరియడ్‌ సమస్య దూరం
స్మార్ట్‌హెల్త్‌+ డిసీజ్ మేనేజ్‌మెంట్ రైడర్ ద్వారా క్వార్టర్లీ హెల్త్‌ చెకప్స్, హెల్త్‌ ఇన్సూరెన్స్‌ రెన్యువల్‌ ప్రీమియంపై 20 శాతం వరకు తగ్గింపును కూడా అందిస్తుంది. వినియోగదారులతో ఇంటర్నల్‌ రీసెర్చ్‌ నిర్వహించామని, మధుమేహం, రక్తపోటుతో బాధపడుతున్న చాలా మంది వ్యక్తులు ఎక్కువ ప్రీమియంలు చెల్లించిన తర్వాత కూడా రెండు నుంచి నాలుగు సంవత్సరాల వరకు వెయిటింగ్‌ పీరియడ్‌ను ఎదుర్కొంటున్నారని కంపెనీ పేర్కొంది. వేగవంతమైన పట్టణీకరణ, సక్రమంగా లేని జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం వంటి అనేక కారణాల వల్ల భారతదేశంలో మధుమేహం, రక్తపోటు బాధితులు పెరుగుతున్నారని తెలిపింది. భారతీయ జనాభాలో చాలా ఎక్కువ శాతం మంది మధుమేహం, రక్తపోటుతో బాధపడుతున్నారు. అలాంటి వారి కోసం వెయిటింగ్‌ పీరియడ్‌ లేని, పాలసీ పొందిన మొదటి రోజు నుంచే కవరేజీ లభించే పాలసీని అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

ఇదీ చదవండి: ఓరి నీ సర్ప్రైజ్ పాడుగాను.. హారం పోయిందని పెళ్లికొడుకు నాటకం.. చివరికి ఏం జరిగిందంటే !


* 10 శాతం మందికే నియంత్రణలో రక్తపోటు
ప్రపంచ ఆరోగ్య సంస్థ డేటా ప్రకారం.. భారతదేశంలో మధుమేహం కేసులు పెరుగుతున్నాయి. భారతదేశంలోని వయోజన జనాభాలో 72.96 మిలియన్ల మధుమేహం కేసులు ఉన్నట్లు అంచనా. ఈ సంవత్సరం ఇండియా కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ విడుదల చేసిన మరో నివేదికలో.. భారతదేశంలోని ప్రతి నలుగురిలో ఒకరు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని, కేవలం 10 శాతం మంది రోగులకు మాత్రమే రక్తపోటు నియంత్రణలో ఉందని వెల్లడించింది.



నివా బుపా హెల్త్ ఇన్సూరెన్స్ అండర్ రైటింగ్, ప్రొడక్ట్స్ అండ్ క్లెయిమ్స్ డైరెక్టర్ మిశ్రా మాట్లాడుతూ.. ‘రీఅష్యూర్‌ను స్మార్ట్ హెల్త్+ డిసీజ్ మేనేజ్‌మెంట్ రైడర్‌ లాంచ్ చేయడం మాకు గర్వకారణం. మరింత తెలివిగా, అందరినీ కలుపుకొని, మరింత అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో రీఅష్యూర్‌ను ప్రారంభించాం. మధుమేహం, రక్తపోటుతో బాధపడుతున్న వ్యక్తులు లిమిట్స్‌, నిబంధనలతో కూడిన జీవితాన్ని గడపకూడదని నివా బుపా భావిస్తుంది. వారి ఆరోగ్య పరిస్థితికి చురుకైన జీవనశైలిని పాటించడం ముఖ్యం. ఇలాంటి వారి జీవితాన్ని ఎటువంటి చింత లేకుండా జీవించడానికి మేం వారికి స్వేచ్ఛను ఇవ్వాలనుకుంటున్నాం. స్మార్ట్ హెల్త్+ డిసీజ్ మేనేజ్‌మెంట్ రైడర్ అనేది బాధితులకు 1వ రోజు నుంచే అత్యుత్తమ ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తుంది.’ అని పేర్కొన్నారు.
Published by:Mahesh
First published:

Tags: Diabetes, General insurance, Health Insurance, Insurance

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు