కరోనా సెకండ్‌వేవ్‌లో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఆరోగ్య బీమా ఉన్నవారు నెట్వర్క్ ఆసుపత్రుల్లో క్యాష్‌లెష్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో చాలా ఆసుపత్రులు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను తిరస్కరిస్తున్నాయి. డబ్బు చెల్లించేవారికే చికిత్సలు అందిస్తున్నాయి. ముఖ్యంగా కరోనా కోసమే ప్రవేశపెట్టిన కరోనా కవచ్, కరోనా రక్షక్ వంటి స్వల్పకాలిక కోవిడ్ పాలసీల విషయంలో ఈ సమస్య అధికంగా ఉంది. ఈ బీమా పాలసీలను గతేడాది కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో ప్రవేశపెట్టారు. తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రయోజనాల కారణంగా చాలా మంది ఈ వీటిని ఎంచుకున్నారు. అయితే వీటిలో 50 శాతం కన్నా తక్కువ పాలసీలు మాత్రమే క్లెయిమ్ అవుతున్నాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
దీనిపై ఐఆర్డీఏఐకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. స్పందించిన ఐఆర్డీఏఐ.. ఆరోగ్య బీమా సంస్థలన్నీ కరోనా కవచ్ పాలసీలను కచ్చితంగా క్లెయిమ్ చేయాలని ఆదేశించింది. క్లెయిమ్ తిరస్కరణకు కొన్ని కారణాలను ఎత్తిచూపుతున్నాయి బీమా సంస్థలు. అవేంటో తెలుసుకుందాం.
చాలా మంది పాలసీదారులు తేలికపాటి కరోనా లక్షణాలున్నా సరే, ఆసుపత్రుల్లో చేరుతున్నారని బీమా సంస్థలు వాదిస్తున్నాయి. అటువంటి వారు అసలు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదని తేల్చి చెబుతున్నాయి. RT-PCR పరీక్షా ఫలితాల్లో CT వ్యాల్యూ అధికంగా ఉన్న సందర్భాల్లో మాత్రమే ఆసుపత్రుల్లో చేరాలని, లేదంటే హోమ్ క్వారంటైన్లో ఉండి చికిత్స తీసుకోవాలని పాలసీదారులను కోరుతున్నాయి. అందువల్ల, రోగి ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం లేదని ఊహించి చాలా పాలసీలను తిరస్కరిస్తున్నాయి.
ఇతర వ్యాధుల కారణంగా
సాధారణంగా కరోనా సోకిన వ్యక్తుల్లో ఇతర అనారోగ్య లక్షణాలు కూడా కనిపిస్తాయి. అయితే, తమ పాలసీలు కేవలం కరోనా చికిత్సకు మాత్రమే వర్తిస్తాయని, ఇతర అనారోగ్య సమస్యలకు వర్తింవని బీమా సంస్థలు చెబుతున్నాయి. కరోనా ద్వారా ఆ వ్యాధులు సంక్రమించదని వాదిస్తూ క్లెయిమ్‌ను తిరస్కరిస్తున్నాయి.
స్వల్ప లక్షణాలతో కోవిడ్ బారిన పడ్డవారు ఇంట్లోనే చికిత్స తీసుకోవచ్చు. కరోనా కవచ్ పాలసీలు హోమ్ ఐసోలేషన్‌లో చికిత్సకు కూడా కవరేజీని అందిస్తాయి. పల్స్ ఆక్సిమీటర్, నెబ్యులైజర్, ఆక్సిజన్ సిలిండర్ల వంటి పరికరాల కొనుగోలుకు అయ్యే ఖర్చును చెల్లిస్తాయి. అయితే, ఎటువంటి కారణాలు లేకుండానే వీటిని కూడా తిరస్కరిస్తున్నాయి. ఇలా చేయడం పాలసీదారులను మోసగించడమేనని నిపుణులు చెబుతున్నారు.
తప్పుడు ఆదాయ వివరాలు
పాలసీ తీసుకునే సమయంలో తప్పుడు వివరాలు నమోదు చేశారన్న కారణంగా పాలసీలను తిస్కరిస్తున్నాయి బీమా సంస్థలు. ముఖ్యంగా ఆదాయ వివరాలు తప్పుగా నమోదు చేశారని వాదిస్తున్నాయి. అయితే, కరోనా రక్షక్ పాలసీలకు ఎటువంటి ఇన్కమ్ ష్యూరిటీ అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగా క్లెయిమ్‌లను తిరస్కరించడం సరికాదని పేర్కొంటున్నారు.
కొన్ని బీమా కంపెనీలు పాలసీదారుల పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నాయి. కరోనా సోకిన వారితో ఎందుకు దగ్గరగా ఉన్నారని, జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నాయి. ఒక కుటుంబంలో ఎక్కువ మందికి కరోనా సోకిన చోట ఇటువంటి తిరస్కరణ కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి. అయితే, బీమా సంస్థలు ఇలా అసంబద్ధంగా క్లెయిమ్ తిస్కరించడం సరికాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఎక్కువ క్లెయిమ్ రిక్వెస్ట్‌లు
సెకండ్ వేవ్ కారణంగా చాలా మంది కరోనా బారిన పడుతున్నారు. దీంతో క్లెయిమ్‌ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. అధిక సంఖ్యలో క్లెయిమ్‌ల కారణంగా గత రెండు నెలలుగా భారతదేశంలో బీమా కంపెనీలు మునిగిపోయాయి. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేకపోయినప్పటికీ, చాలా మంది రోగులు ఆసుపత్రుల్లో చేరుతున్నారని, వైద్యులను సంప్రదించకుండానే రోగులు ఆసుపత్రిలో చేరుతున్న సందర్భాలు కూడా ఉన్నాయిని వాదిస్తున్నాయి. సరైన కారణం లేకుండా పాలసీ క్లెయిమ్ తిరస్కరిస్తే పాలసీదారుడు ఐఆర్‌డీఏఐకి ఫిర్యాదు చేయవచ్చు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.