హోమ్ /వార్తలు /బిజినెస్ /

Vehicle Insurance: అద్దె వాహనానికి కూడా బీమా కంపెనీలే పరిహారం చెల్లించాలి... సుప్రీం కోర్టు సంచలన తీర్పు

Vehicle Insurance: అద్దె వాహనానికి కూడా బీమా కంపెనీలే పరిహారం చెల్లించాలి... సుప్రీం కోర్టు సంచలన తీర్పు

BH-series: కొంత మంది తరచూ వేర్వేరు రాష్ట్రాలకు వాహనాలతో వెళ్లాల్సి ఉంటుంది. అలాంటి వాళ్లు ఆయా రాష్ట్రాలకు వెళ్లాక... వాహనాల రిజిస్ట్రేషన్ మార్చుకోవాల్సి ఉంటుంది. దీనికి కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రానికి వెళ్లినా కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్ మార్చుకోవాల్సిన పని లేదు. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం శనివారం... కొత్త వాహనాలకు కొత్త రిజిస్ట్రేషన్ విధానం తెచ్చింది. దీన్ని భారత్ సిరీస్ (BH - Series) అంటున్నారు. దీని కింద రిజిస్ట్రేషన్ అయిన వాహనాల్ని ఏ రాష్ట్రంలోనైనా స్వేచ్ఛగా నడపవచ్చు. కేంద్ర పాలిత ప్రాంతాలకు కూడా తీసుకెళ్లవచ్చు. రాష్ట్రం మారినప్పుడల్లా మళ్లీ రిజస్ట్రేషన్ అక్కర్లేదు.

Vehicle Insurance | అద్దె వాహనాలు ప్రమాదాలకు గురైతే బీమా కంపెనీలే పరిహారం చెల్లించాలని సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

అద్దెకు తీసుకున్న వాహనాలకు కూడా బీమా వర్తిస్తుందని సుప్రీంకోర్టు తెలిపింది. ఇన్సూరెన్స్ కంపెనీలే పరిహారం చెల్లించి ఇందుకు బాధ్యత వహించాలని తాజా తీర్పులో వెల్లడించింది. రిజిస్టర్డ్ యజమాని నుంచి రవాణా సంస్థ వాహనాన్ని అద్దెకు తీసుకుంటే, వాహనంతో పాటు ఇన్సూరెన్స్ కూడా బదిలీ అవుతుందని స్పష్టం చేసింది. వ్యక్తి సమర్థవంతమైన నియంత్రణ, ఆదేశం ఆధారంగా అతడినే యజమానిగా పరిగణిస్తారని.. ప్రస్తుత బీమా పాలసీ కూడా కిరాయి కాలానికి బదిలీ అవుతుందని అత్యున్నత న్యాయస్థానం తీర్పులో పేర్కొంది. ఈ క్రమంలో అలహాబాద్ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును తిరస్కరిస్తూ జస్టీస్ ఎస్ నజీర్, కృష్ణ మురారితో కూడిన దర్మాసనం తుది తీర్పు చెప్పింది.

అద్దె ఒప్పందం ప్రకారం బీమా ఉన్న వాహనానికి ప్రమాదం జరిగితే, పరిహారం చెల్లించాల్సిన బాధ్యత సదరు ఇన్సూరెన్స్ కంపెనీ లేదా ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ లేదా వాహన యజమానికి ఉంటుందని కోర్టు చెప్పింది. రవాణా సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందంపై ఇది ఆధారపడి ఉంటుందని తెలిపింది.

PM Kisan Scheme: ఆ రైతుల నుంచి పీఎం కిసాన్ డబ్బులు వెనక్కి తీసుకుంటున్న కేంద్రం

Aadhaar Card: ఆధార్ కార్డులో పుట్టిన తేదీ తప్పుగా ఉందా? ఇలా మార్చేయండి

యూపీ రవాణా సంస్థ పిటీషన్

ఈ కేసు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ట్రాన్ పోర్ట్ కార్పొరేషన్ కు సంబంధించింది. ఈ రవాణా సంస్థ ఓ బస్సును అద్దెకు తీసుకుంది. ఈ బస్సుకు ప్రమాదం జరిగి ఓ వ్యక్తి మరణించగా.. అతడి వారసులు మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ ట్రిబ్యునల్‌లో పిటీషన్ దాఖలు చేశారు. వాస్తవానికి బస్సు యజమానికి, బీమా సంస్థ, ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ కు మధ్య రాతపూర్వక ఒప్పందం ఉందని వారు వ్యాజ్యంలో పేర్కొన్నారు. దీనికి ఇన్సూరెన్స్ కంపెనీ బాధ్యత వహిస్తుందని, రూ.1,82,000 పరిహారం చెల్లించాలని ట్రిబ్యునల్ ఆదేశించింది.

Indian Railways: రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు స్మార్ట్ స్లీపర్ కోచ్‌లు... ఈ బోగీల ప్రత్యేకతలు ఇవే

Vande Bharat Train: 40 పట్టణాలను కలుపుతూ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు... ప్రత్యేకతలు ఇవే

ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ అలహాబాద్ హైకోర్టులో బీమా కంపెనీ వ్యాజ్యం దాఖలు చేసింది. కార్పొరేషన్ నియంత్రణలో బస్సులు నడుస్తున్న కారణంగా.. బీమా సంస్థ థర్డ్ పార్టీలకు పరిహారం చెల్లించాల్సిన బాధ్యత బీమా సంస్థలకు లేదని హైకోర్టు అభిప్రాయపడింది. అనంతరం రవాణా సంస్థ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. దీనిపై విచారించిన సుప్రీం కోర్టు.. అద్దె ఒప్పందం ప్రకారం వాహనంతో పాటు బీమా పాలసీ కూడా బదిలీ అవుతుందని తాజా తీర్పులో పేర్కొంది.

First published:

Tags: Insurance, Supreme Court

ఉత్తమ కథలు