ఈ పాండెమిక్ యుగంలో బీమా అనేది నేడు అత్యవసరమైన అంశం. అది జీవిత బీమా అయినా, ఆరోగ్యం అయినా లేదా ఏదైనా సాధారణ బీమా అయినా, కష్ట సమయాల్లో ఇది చాలా ఉపయోగపడుతుంది. కరోనా మహమ్మారి బీమా ప్రాముఖ్యతను అందరికీ చాలా చక్కగా తెలియజేసింది. కానీ బీమా కంపెనీ తన క్లెయిమ్ సమయంలో మీ క్లెయిమ్‌ను తిరస్కరించినప్పుడు మీరు తీసుకున్న బీమా పాలసీ నిరుపయోగం అయ్యే అవకాశం ఉంది. మీరు ఏదైనా పొరపాటు చేసిననా ఇన్సూరెన్స్ కంపెనీలు మీ క్లెయిమ్‌ను తిరస్కరిస్తాయి. అందువల్ల, మీ క్లెయిమ్ రద్దు చేసే అవకాశాలు ఏమేం ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజానికి బీమాకు సంబంధించిన నిబంధనలు, షరతులను జాగ్రత్తగా చదివి అనుసరించినట్లయితే, క్లెయిమ్ రద్దు సమస్యను చాలా వరకు అధిగమించే అవకాశాలున్నాయి.
నిబంధనలు, షరతులను పూర్తిగా చదవండి
బీమా పాలసీని కొనుగోలు చేసేటప్పుడు చాలా ఏజెంట్ చెప్పేదానిపైనే ఆధారపడి పాలసీని కొనుగోలు చేస్తారు. కంపెనీ నిబంధనలు షరతులను కూడా చదవరు. భీమా కంపెనీలు కొన్నిసార్లు మనకు తెలియని వాటి నిబంధనలు, షరతులలో పొందుపరుస్తారు. తరచుగా ఈ విషయాలు క్లెయిమ్ చేసే సమయంలో వాళ్లు గుర్తుచేస్తారు. లేదా మీకు క్లెయిం ఎందుకు రిజెక్ట్ అయ్యిందో నిబంధనల్లో తెలియజేస్తారు. అందువల్ల, ఏదైనా బీమా పాలసీని తీసుకునేటప్పుడు, దాని నిబంధనలు మరియు షరతులను క్షుణ్ణంగా అధ్యయనం చేయండి.
మీ గురించి ఖచ్చితమైన సమాచారం అందించండి..
అధిక ప్రీమియం నుంచి తప్పించుకునేందుకు ఆరోగ్య బీమా తీసుకునేటప్పుడు చాలా మంది తరచుగా గత వ్యాధుల సమాచారాన్ని బహిర్గతం చేయకుండా ఉంటారు. చాలా మంది వ్యక్తులు ధూమపానం,మద్యపానం గురించి సమాచారాన్ని కూడా పంచుకోరు. ఈ తప్పుల కారణంగా క్లెయిం తిరస్కరించే అవకాశం ఉంది. అందుకే మీరు ముందుగా మీ మెడికల్ హిస్టరీ గురించి బీమా కంపెనీకి తెలియజేయడం చాలా ముఖ్యం.
వ్యవధిలోపు క్లెయిం చేయకపోతే తిరస్కరించవచ్చు...
ప్రతి బీమా కంపెనీకి క్లెయిమ్ చేయడానికి ఒక నిర్ణీత సమయం ఉంటుంది. ఈ నిర్ణీత సమయంలో మీరు క్లెయిమ్ చేయకుంటే, మీ క్లెయిను తిరస్కరించబడవచ్చు. సంఘటన జరిగిన వెంటనే బీమా ప్రయోజనాల కోసం దావా వేయడం అవసరం. చాలా బీమా కంపెనీలు క్లెయిమ్ కోసం 7 రోజుల నుండి 30 రోజుల వరకు సమయం ఇస్తాయి.
మోటారు బీమా ఎప్పుడు తిరస్కరించబడుతుంది?
మీరు మీ వాహనంలో CNG కిట్‌ను ఇన్‌స్టాల్ చేయడం లేదా ఏదైనా ఇన్‌స్టాల్ చేయడం వంటి ఏవైనా మార్పులు చేసి ఉంటే లేదా వాహనం యొక్క బాడీలో మార్పులు చేసి, దాని గురించి బీమా కంపెనీకి తెలియజేయకపోతే, మీ క్లెయిమ్ తిరస్కరించబడవచ్చు.
బీమా క్లెయిమ్ తిరస్కరించబడటానికి ఒక కారణం ఏమిటంటే, పాలసీలో బీమా కంపెనీ కొన్ని నష్టాలను కవర్ చేయదు. ఈ నష్టాల కోసం ప్రత్యేక యాడ్-ఆన్ కవర్లు తీసుకోవాలి. పాలసీ ఇంజిన్ వైఫల్యం లేదా కాలక్రమేణా వాహనం దెబ్బతినడం కోసం కవర్ అందించకపోతే. దీని కోసం విడిగా ఇంజన్ ప్రొటెక్టర్ మరియు జీరో డిప్రిసియేషన్ యాడ్ ఆన్ కవర్లు తీసుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health Insurance